
జాబితాలో ముగ్గురు సాక్షి ఫొటోగ్రాఫర్లు
కాచిగూడ (హైదరాబాద్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన రాష్ట్రస్థాయి న్యూస్ ఫొటో కాంపిటీషన్–2024లో 31 జిల్లాల నుంచి 100 ఎంట్రీలు వచ్చాయని సంఘం అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, కార్యదర్శి కేఎన్ హరి చెప్పారు.
సీనియర్ జర్నలిస్ట్, ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓ బి.అయోధ్య రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ సుశీల్ రావు, సీనియర్ ఫొటో జర్నలిస్టు హెచ్.సతీష్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి వివిధ కేటగిరీల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.మోహనాచారి (హైదరాబాద్), బి.శివప్రసాద్ (సంగారెడ్డి), వి.భాస్కరాచారి (మహబూబ్‌నగర్) తీసిన చిత్రాలు కన్సొలేషన్ విభాగంలో విజేతలుగా నిలిచాయన్నారు.
సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ ఛాయా చిత్ర ప్రదర్శనను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment