bonalu festivals
-
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బోనాల సందడి దృశ్యాలు
-
వైభవంగా సోమాజిగూడ శ్రీ రేణుక మహాలక్ష్మి ఎల్లమ్మ కళ్యాణం దృశ్యాలు..
-
Hyderabad Bonalu : ఘనంగా హైదరాబాద్ లో బోనాల సందడి (ఫోటోలు)
-
బోనాలు స్పెషల్.. అమ్మవారి సేవలో ప్రముఖులు (ఫోటోలు)
-
అంబారీపై దర్శనమిచ్చిన అమ్మవారు (ఫొటోలు)
-
వైభవంగా లాల్ దర్వాజ బోనాలు (ఫోటోలు)
-
బోనాలు: మీ తప్పుల వల్లే కుండపోత వర్షాలు కురిపిస్తున్నా
తెలంగాణలో ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు(సోమవారం) సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం వద్ద రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. ‘‘మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదు. ఆలయంలో పూజలు సరిగా జరగడంలేదు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు. నాకు పూజలు సరిగ్గా చేయనందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నాను. మీ కళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తున్నాను. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను’’ అని అన్నారు. -
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందడి (ఫొటోలు)
-
ఘనంగా లష్కర్ బోనాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. చదవండి: Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు.. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పాత రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి సాదారణ భక్తులు, వీఐపీ పాస్‌లతో వచ్చే వారిని, బోనాలతో వచ్చే వారిని కూడా ఇక్కడి నుంచి అనుమతి ఇస్తున్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం బాటా నుంచి ఒక క్యూలైన్. టొబాకో బజార్ నుంచి దాతల కోసం, అంజలీ థియేటర్ నుంచి వీఐపీ, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొత్తగా రెండు ఎగ్జిట్ గేట్లు ఈ ఏడాది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు బయటకు వెళ్లేందుకు మరో రెండు నిష్క్రమణ గేట్లను ఏర్పాటు చేశారు. గతంలో దేవాలయం వెనుక వైపు కేవలం ఒకటి మాత్రమే ఉండగా ఈసారి అదనంగా దేవాలయానికి దక్షిణం వైపు మరో రెండు గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెంటనే బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. -
కనుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
ఎల్లమ్మ కల్యాణం.. ఎల్లెడలా ఆనందం (ఫొటోలు)
-
కన్నుల పండుగగా బల్కంపేట అమ్మవారి కళ్యాణం
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం కన్నుల పండుగగా, అత్యంత ఘనంగా జరిగింది. ఆలయం ముందు నిర్మించిన భారీ షెడ్డు క్రింద వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారి కల్యాణం నిర్వహించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి.రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దంపతులు అమ్మవారి కల్యాణం లో పాల్గొన్న అనంతరం ఆలయం లోపల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ క్యూ లైన్ లలో నిల్చున్నారు. ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన షెడ్డులో కూడా భక్తులు కూర్చొని అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణంలో టీఎస్ఎమ్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ కవిత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్ లు మహేశ్వరి, సరళ, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఈవో అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బోనాల ఉత్సవాలకు రూ. 15 కోట్లు మంజూరు
హైదరాబాద్: బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ లతో కలిసి దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక తదితర శాఖల అధికారులతో ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్, 24 వ తేదీన జరిగే హైదరాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ నిధులను ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించే బోనాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. పలు ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 25 వ తేదీన జరిగే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు సందర్భంగా 500 మంది కళాకారులతో చార్మినార్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నగరంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారుల ఆధ్వర్యంలో వివిధ వేషదారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పాతబస్తీ లోని దమయంతి బిల్డింగ్, డిల్లీ దర్వాజ, గోల్కొండ, రవీంద్రభారతి, ఇందిరాపార్క్ వద్ద గల కట్టమైసమ్మ ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, చిలకలగూడ తదితర 8 ప్రాంతాలలో త్రీ డీ మ్యాప్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం, సబ్జిమండి ఆలయాలకు ప్రభుత్వ ఖర్చులతోనే అంబారీ ఊరేగింపు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. బోనాల ఉత్సవాల విశిష్ట తను చాటి చెప్పేలా వివిధ ప్రసార మాధ్యమాలు, కరపత్రాలు, పోస్టర్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ అమయ్ కుమార్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఐ అండ్ పీఆర్ సీఐఈవో రాధాకృష్ణ, డీఆర్ఓ సూర్యలత, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణ, ఏసీలు బాలాజీ, కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
Bonalu Festival 2021: లాల్‌దర్వాజ బోనాలు: పాతబస్తీలో సందడి
-
బోనాల జాతర
-
అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-
బోనం ఎత్తుదాం.. నేటి నుంచి మహా సంబురం
-
ఇక ఆన్లైన్లో బోనం.. ఈసారి లష్కర్ బోనాలతో శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ : ఆషాఢమాసం ప్రారంభంతో తెలంగాణలో బోనాల సందడి మొదలవుతుంది. ఈ మాసం మూడో ఆదివారం జరిగే లష్కర్ బోనాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. తలపై బోనం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి చేరుకుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అందరూ ప్రత్యక్షంగా బోనం సమర్పించే పరిస్థితులు లేవు. దీంతో ఆలయ నిర్వాహకులకు సరికొత్త ఆలోచన వచ్చింది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన పేరుతో నిర్వాహకులే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అందులోని బియ్యాన్ని ప్రసాదంలా పోస్టు ద్వారా ఇంటికి పంపుతారు. వాటిని వండుకుని ప్రసాదంగా స్వీకరించొచ్చు. తొలిసారిగా ఈ ఏడాది లష్కర్ బోనాలతో ఈ వినూత్న ప్రయోగానికి దేవాదాయ–తపాలాశాఖలు సంయుక్తంగా శ్రీకారం చుట్టనున్నాయి. భద్రాద్రి తలంబ్రాలతో మొదలు కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో ఆలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. ముఖ్యమైన వేడుకలు నిర్వహించుకోవాల్సి వస్తే, ఆలయాలకు వెళ్లకుండానే జరుపుకోవాల్సిన పరిస్థితి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా కరోనా భయంతో చాలామంది ఆలయాలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భద్రాద్రి రాముడి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే పరిస్థితి లేనందున, ఆన్లైన్లో గోత్ర నామాలతో పాటు ఇతర వివరాలను ముందుగా నమోదు చేసుకుంటే.. వారి పేరిట పూజాదికాలు నిర్వహించి పోస్టు ద్వారా ముత్యాల తలంబ్రాలు, మిశ్రీ ప్రసాదాన్ని ఇంటికే పంపే ఏర్పాట్లు చేసింది. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణేశ్ మందిరం, కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి మందిరం, సికింద్రాబాద్ ఉజ్జయినీ ఆలయం, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయాల్లో కూడా ఆన్లైన్ పూజలతో పోస్టు ద్వారా ప్రసాదం అందించే వెసులుబాటు కల్పించారు. రుసుము రూ.200! బోనాలను కూడా ఆన్లైన్ ద్వారా సమర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి రూ.200 రుసుము నిర్ధారించే వీలుంది. ఆ రుసుమును తపాలాకార్యాలయాల్లో చెల్లించి పేరు నమోదు చేసుకుంటే భక్తుల పేరుతో ఉజ్జయినీ మహంకాళీకి ఆలయ సిబ్బంది బోనం సమర్పించి అందులోని బియ్యం నుంచి 20 గ్రాములు, కుంకుమ, పొడి ప్రసాదాన్ని పోస్టు ద్వారా వారి ఇంటికి పంపుతారు. ఈ మేరకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, భవిష్యత్తులో మరిన్ని దైవిక సేవలను ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ గణేశ్ మందిరంలో మోదక హవనాన్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా తపాలాశాఖతో దేవాదాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటోంది. విభూది, పొడి ప్రసాదం, కుంకుమ, గరిక లాంటి వాటిని పోస్టు ద్వారా పంపుతారు. -
బొనమెత్తనున్న భాగ్యనగరం
-
సప్త మాతృకలకు బంగారు బోనం..
చార్మినార్: రాబోయే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఏడాది కూడా సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఏడు అమ్మవారి దేవాలయాలకు ఏడు బంగారు బోనాలతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం జూలై 11న గోల్కొండ జగదాంబ అమ్మవారికి జరిగే మొదటి బంగారు బోనంతో ప్రారంభమవుతుందన్నారు. జూలై 13న బల్కంపేట ఎల్లమ్మ తల్లి, 16న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 18న విజయవాడ కనకదుర్గమ్మ, 22న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, 27న చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. 29న లాల్‌దర్వాజ సింహవాహిణి అమ్మవారికి చివరి బోనం సమర్పణతో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. -
ఆషాఢ మాస బోనాలకు వేళాయె..
హైదరాబాద్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవాల నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది కోవిడ్–19 ఆంక్షల నడుమ బోనాల జాతర ఉత్సవాలు ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా జరిగాయి. అమ్మవారికి బోనాలను ఆయా దేవాలయాల్లో కాకుండా ఇళ్లల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం సూచించడంతో నెల రోజుల పాటు బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించారు. భక్తులు లేకుండానే అమ్మవారికి ఆయా దేవాలయాల కమిటి ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఈసారి వైభవంగా ఉత్సవాలను నిర్వహించడానికి నిర్వాహకులు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుని ఎన్నిక కూడా పూర్తి అయ్యింది. కమిటి ఆధ్వర్యంలో త్వరలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బోనాల జాతర ఉత్సవాలపై చర్చించడానికి సిద్ధమవుతున్నారు. గతేడాది నెల రోజుల పాటు బోనాల సమర్పణ... గతేడాది జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. పాతబస్తీలో గతేడాది జూలై 19న, సంబందిత ఆలయాల ప్రతినిధులు, పండితుల మంత్రోచ్చరణలతో అమ్మవారికి పూజలు,బోనం సమర్పణ జరిగింది. మరుసటి రోజు అంటే..జూలై 20న, ఎలాంటి హడావిడి లేకుండా అమ్మవారి ఘటాల ఊరేగింపు కొనసాగింది. పరిమిత సంఖ్యలో దేవాలయాలకు చెందిన భక్తులు తప్పా..సా«ధారణ ప్రజలెవరు ఈ సామూ హిక ఘటాల ఊరేగింపులో పాల్గొన లేదు. ఈసారి కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్యగణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను ప్రభుత్వం ఆంక్షలను తొలగిస్తుందని ఉత్సవాల నిర్వాహకులు ఆశిస్తున్నారు. గతేడాదిలా కాకుండా ఈసారి అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అవకాశాలుంటాయని భావిస్తున్నారు. మాస్క్‌లు «ధరించడంతో పాటు... భౌతిక దూరం పాటిస్తూ ఆయా దేవాలయాలలో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించకపోవచ్చని భావిస్తున్నారు. ఈసారి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు జూలై 11న, గోల్కొండ జగదాంబా అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో నగరంలో ఉత్సవాలు ప్రాంభమవుతున్నాయి. జూలై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి. అదే రోజు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రాంభమవుతాయి. ఈ ఏడాది జాతర వివరాలివీ... ఆగస్టు 1న పాతబస్తీలో అమ్మవారికి భక్తులు బోనాల సమర్పన పూజా కార్యక్రమాలుంటాయి. ఆగస్టు 2న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కార్యక్రమాలుంటాయి.. వచ్చే నెల 25న సికింద్రబాద్ అమ్మవారి బోనాల జాతర రోజే పాతబస్తీలో కాశీవిశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు కొనసాగుతుంది. అనంతరం ఆయా దేవాలయాల్లో ఘటాల స్థపాన జరుగుతుంది. గతంలోలాగే ఈసారి కూడా సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమం నిర్వహించనున్నారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబా అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి, సికింద్రాబాద్ ఉజ్జయి నీ మహంకాళీ అమ్మవారు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తలి, చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారు, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారితో కలిపి ఏడు దేవాలయాల అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలను సమర్పించనున్నారు. ఏడు దేవాలయాల అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఈసారి ఘనంగా నిర్వహిస్తాం.. భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగి ంపు కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఈసారి బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విషయమై మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలువనున్నాం. వారి సలహాలు, సూచనల మేరకు ఆషాఢ మాస బోనాలలను గతేడాది కన్నా ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా దేవాలయాలలో అమ్మ వారికి బోనాలు సమర్పించేలా తగిన ఏర్పాట్లు చేస్తాం. – బల్వంత్ యాదవ్, భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు -
భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఘటాల ఊరేగింపు
-
ఆషాఢ బోనం.. ఇంటికే పరిమితం
నిజామాబాద్ కల్చరల్: అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం సంప్రదాయం. ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు కుంకుమతో అలంకరించిన పాత్రలో అగ్ని సాక్షిగా నైవేద్యం(బోనం) సమర్పించడం అమ్మవారికి ఎంతో ఆనందాన్నిస్తుంది. గ్రామ పొలిమేరల్లో ఉండే అమ్మవార్లకు ఈ మాసం మొత్తం బోనాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే కరోనా ప్రభావం బోనాల పండుగపై కూడా తీవ్రంగా పడింది. బోనాలను ఇళ్లకే పరిమితం చేసుకోవాలని సూచించారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం విస్తారంగా కురిసే వర్షాలతో ఈ మాసంలో కలరా, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తిస్తుంటాయి. ఈ సీజన్లో వచ్చే వ్యాధులు మనుషులపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఇలా వ్యాధులు రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గ్రామదేవతలను వేడుకొని భక్తులు బోనాలు సమర్పిస్తారు. బోనాల సందర్భంగా మహిళలు కాళ్లకు రాసుకునే పసుపుతో వానాకాలంలో అరికాళ్లు చెడకుండా ఉంటాయి. దీంతో పాటు ఈ పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మానికి, వీధి వీధికి వేపాకు మండలు కడతారు. వేపాకులో ఉండే ఔషధగుణం ద్వారా క్రిమికీటకాలు నాశనం అవడంతో పాటు అంటువ్యాధులు దరికి చేరవు. సాదాసీదాగా.. ప్రతి ఇంటా సంతోషంగా జరుపుకునే బోనాల వేడుకలు ఈ సంవత్సరం కోవిడ్ –19 కరోనాతో బోనాలను ఇళ్లకే పరిమితం చేసుకోవాలని, సాదసీదగా జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆలయాలలో పూజారుల ఆధ్వర్యంలో బోనాల తంతు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు మాత్రం తమ ఇళ్లలోనే అమ్మవార్లకు బోనం సమర్పించి అందరిని సల్లగా చూడాలని కోరుతూ మొక్కులు చెల్లించాలని చెప్పింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వ నిర్ణయం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆషాఢ బోనంకు కరోనా గ్రహణం పట్టింది. దీంతో బోనాల పండుగను ఇంటికే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం సూచించడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వ్యాధి కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదే. ఎల్లమ్మ అనుగ్రహంతో కరోనా వ్యాధి త్వరగా వెళ్లిపోవాలని కోరుకుంటాను.– పంచరెడ్డి ఎర్రన్న, అధ్యక్షుడు, ఎల్లమ్మ ఆలయం, ఎల్లమ్మగుట్ట -
బోనాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. తెలంగాణలో నిర్వహించే ఈ బోనాల్లో.. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇంటిల్లిపాది వచ్చి అమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. బోనం ఎత్తుకుని.. అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణవారే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక, సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభిస్తారు. ఒడిషా, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన కళాకారులు వివిధ ఆకృతులతో అమ్మవారి శకటాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 13 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీటరికి తోడుగా 43 ప్లటూన్ల సాయుధ బలగాలు కూడా భద్రత విధుల్లో పాటు పంచుకోనుంది.