
సాక్షి, విజయవాడ : ఆషాడం మాసంలో తెలంగాణ బోనాలు మొదలైతే.. దుర్గగుడిలో పవిత్ర సారె ఉంటుందని కనకదుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఆషాడ మాసం మొత్తం పవిత్ర సారె కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరుగుతుందని అన్నారు. గతేడాది యాభై వేలమంది భక్తులు పవిత్రసారె తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈసారి కూడా అమ్మవారికి పవిత్ర సారె తీసుకొచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జూలై 3నుంచి ఆగస్ట్ 1వరకు ఈ ఆషాడ మాసం ఉంటుందని అన్నారు. పవిత్రసారె తీసుకొచ్చే భక్తులు ముందుగా తెలియజేస్తే.. అందుకు తగ్గ ఏర్పాట్లతో పాటు అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
జూలై 14,15,16 తేదీల్లో శాఖంబరి ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రకటించారు. 16న చంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు సాయంత్రంఘైదు గంటలకే దర్శనం నిలుపుదల చేస్తామని, మళ్లీ ఉదయం పదిగంటలకు తిరిగి దర్శనం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయం నుంచి ఆహ్వానం వచ్చిందని, బోనం సమర్పించడానికి 26న అక్కడికి వెళ్లనున్నుట్లు తెలిపారు. పవిత్ర సారె తీసుకొచ్చే వారందరికి ముఖమండప దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment