రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.
చదవండి: Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు..
తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పాత రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి సాదారణ భక్తులు, వీఐపీ పాస్‌లతో వచ్చే వారిని, బోనాలతో వచ్చే వారిని కూడా ఇక్కడి నుంచి అనుమతి ఇస్తున్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం బాటా నుంచి ఒక క్యూలైన్. టొబాకో బజార్ నుంచి దాతల కోసం, అంజలీ థియేటర్ నుంచి వీఐపీ, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
కొత్తగా రెండు ఎగ్జిట్ గేట్లు
ఈ ఏడాది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు బయటకు వెళ్లేందుకు మరో రెండు నిష్క్రమణ గేట్లను ఏర్పాటు చేశారు. గతంలో దేవాలయం వెనుక వైపు కేవలం ఒకటి మాత్రమే ఉండగా ఈసారి అదనంగా దేవాలయానికి దక్షిణం వైపు మరో రెండు గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెంటనే బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment