Secunderabad Ujjaini Mahankali Bonalu
-
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఆదివారం తెల్లవారుజాము నుంచే మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఇక ఆషాఢమాస జాతరలో భాగంగా ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహంకాళి దేవాలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. #LashkarBonalu #SecunderabadBonalu #Bonalu pic.twitter.com/zf1zbzl0WY — Talasani Srinivas Yadav (@YadavTalasani) July 9, 2023 -
ఘనంగా లష్కర్ బోనాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. చదవండి: Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు.. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పాత రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి సాదారణ భక్తులు, వీఐపీ పాస్‌లతో వచ్చే వారిని, బోనాలతో వచ్చే వారిని కూడా ఇక్కడి నుంచి అనుమతి ఇస్తున్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం బాటా నుంచి ఒక క్యూలైన్. టొబాకో బజార్ నుంచి దాతల కోసం, అంజలీ థియేటర్ నుంచి వీఐపీ, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొత్తగా రెండు ఎగ్జిట్ గేట్లు ఈ ఏడాది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు బయటకు వెళ్లేందుకు మరో రెండు నిష్క్రమణ గేట్లను ఏర్పాటు చేశారు. గతంలో దేవాలయం వెనుక వైపు కేవలం ఒకటి మాత్రమే ఉండగా ఈసారి అదనంగా దేవాలయానికి దక్షిణం వైపు మరో రెండు గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెంటనే బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. -
వచ్చే నెల 25, 26 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది. 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. 26న ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించనున్నారు. చదవండి: తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేత లాక్డౌన్ ఎత్తేశారని.. లైట్ తీసుకోవద్దు.. -
వచ్చేనెల 25, 26వ తేదీల్లో బోనాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): జూలై 25, 26వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర జరుగుతుందని ఆలయ ఈవో గుత్త మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్ర వారం ఈవో, ఆలయ వేద పండితులు, అర్చకులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. జూలై 11న అమ్మవారి ఘటోత్సవం, 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం ఉంటుందని మంత్రి సమక్షంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించాలని మంత్రి తెలిపారు. దేవాలయ ప్రసాదంతో పాటు వేదపండితులు ఆశీర్వచనాలను మంత్రికి అందించారు. చదవండి: హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమే: ఈటల -
బోనమెత్తిన లష్కర్