
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): జూలై 25, 26వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర జరుగుతుందని ఆలయ ఈవో గుత్త మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్ర వారం ఈవో, ఆలయ వేద పండితులు, అర్చకులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. జూలై 11న అమ్మవారి ఘటోత్సవం, 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం ఉంటుందని మంత్రి సమక్షంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించాలని మంత్రి తెలిపారు. దేవాలయ ప్రసాదంతో పాటు వేదపండితులు ఆశీర్వచనాలను మంత్రికి అందించారు.
చదవండి: హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమే: ఈటల