talsani srinivasa yadav
-
మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం: మంత్రి తలసాని
-
హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా?: తలసాని
-
టీఆర్ఎస్ నేతలకు షాక్.. ఫ్లెక్సీలపై పెనాల్టీలు
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకొని పలువురు టీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల వంటివి భారీగా ఏర్పాటు చేశారు. వాటితో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా ద్వారా పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందించిన ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్(సీఈసీ) ఈ చలానాల జారీ ప్రారంభించింది. వాటిని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా సీఈసీ ఖాతాకు అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నుంచి పార్టీ డివిజన్ స్థాయి నాయకుల వరకు పెనాల్టీల ఈ– చలానాలు జారీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ఫ్లెక్సీలున్నప్పటికీ పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకే పెనాల్టీలు వేయడంతో, పెనాల్టీలు పడనివి అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ► మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్పార్క్, పంజగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, తార్నాక, ప్యాట్నీ ఈస్ట్‌మారేడ్‌పల్లి, మెట్టుగూడ, తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ– చలానాలు జారీ చేశారు. ఒక్కో ఫ్లెక్సీకి రూ. 5వేల వంతున చలానాలు జారీ అయ్యాయి. ► హైటెక్‌సిటీలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల వంతున రెండింటికి లక్ష రూపాయల చలానాలు జారీ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట ఏర్పాటైన వాటికి, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన వాటికి పెనాల్టీలు విధించా రు. బుధవారం సాయంత్రం వరకు తలసానిపై ఇరవైకి పైగా, పార్టీ జనరల్సెక్రటరీపై దాదాపు ఇరవై ఫ్లెక్సీలకు ఈచలానాలు జారీ చేశారు. ► టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి హుస్సేన్‌సాగర్‌లో బోట్‌కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50వేలు, రూ.15వేలు వంతున రెండు ఈ– చలానాలు జారీ అయ్యాయి. గచ్చిబౌలిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన షేక్‌హమీద్‌కు లక్ష రూపాయల వంతున రెండు ఈ– చలానాలు జారీ చేశారు. ఈచలానాల జారీ ఇంకా కొనసాగుతుండటంతో కచ్చితంగా ఎంత మొత్తం అనేది తెలియడానికి సమయం పట్టనుంది. తగ్గేదేలే.. ► పెనాల్టీలు వేసినా తాము తగ్గేది లేదని, పార్టీపై.. అగ్రనాయకులపై తమ అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నట్లుగా పలువురు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు తదితరమైన వాటితో స్వాగతాలు పలికారు. పెనాల్టీలు పడినా సరే అధిష్టానం దృష్టిలో పడితే చాలన్నట్లుగా కొందరు వీటిని ఏర్పాటు చేశారు. ► ట్విట్టర్ వేదిక ద్వారా కొందరు పౌరులు టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లు కారు అని అన్న మీరే ఇలా వ్యవహరించారేం? అని ప్రశ్నించారు. మేం నిబంధనలు పాటించాలి కానీ మీ పార్టీ పాటించవద్దా అని పేర్కొన్నారు. బెంగళూర్‌లో ఫ్లెక్సీలు, గుట్కా, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారని పోస్ట్‌చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటదో తెలియని నగరంలో ఒక్కసారిగా గాలిదుమారం వీస్తే రోడ్డున పోయే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. -
వచ్చేనెల 25, 26వ తేదీల్లో బోనాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): జూలై 25, 26వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర జరుగుతుందని ఆలయ ఈవో గుత్త మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్ర వారం ఈవో, ఆలయ వేద పండితులు, అర్చకులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. జూలై 11న అమ్మవారి ఘటోత్సవం, 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం ఉంటుందని మంత్రి సమక్షంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించాలని మంత్రి తెలిపారు. దేవాలయ ప్రసాదంతో పాటు వేదపండితులు ఆశీర్వచనాలను మంత్రికి అందించారు. చదవండి: హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమే: ఈటల -
బాలు మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్ : సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన ఎస్పీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. బాలసుబ్రహ్మణ్యం లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని సీఎం అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బాలు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ( ఇలా జరగడం బాధాకరం: ఉప రాష్ట్రపతి ) CM Sri KCR has expressed shock and grief over the demise of legendary playback singer Sri SP Balasubrahmanyam. Hon'ble CM said that Sri Balu won the hearts of fans all over the country through thousands of his melodious songs. — Telangana CMO (@TelanganaCMO) September 25, 2020 -
తలసానిని కలసిన దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దానం నాగేందర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం టీఆర్ఎస్లో చేరికపై దానం నాగేందర్ తలసానితో చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చిన సాదరంగా ఆహ్వానిస్తామని తలసాని అన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. మరోవైపు దానం నాగేందర్ బాటలో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కూడా నడుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. దానం నాగేందర్ పార్టీని విడటంపై చర్చించారు. అంతకుముందు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దానం నాగేందర్‌ను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. సంపత్‌కుమార్‌కు పదవి ఇవ్వడంపై దానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సమయంలో కీలక నేతలు పార్టీని వీడటం వల్ల బలహీనమవుతామని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముఖేశ్, విక్రమ్‌లు కూడా పార్టీని వీడతారనే వార్త వారిలో మరింత గుబులు పుట్టిస్తోంది. -
ప్రపంచం గర్వించేలా ‘మెట్రో’ నిర్మాణం: తలసాని
హైదరాబాద్: ప్రపంచంలోని స్టేషన్లకు దీటుగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంవత్సర కాలంలో పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశామన్నారు. శనివారం మెట్రో హరితహారంలో భాగంగా మంత్రి పద్మారావుతో కలసి ఉప్పల్ స్టేషన్లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో 72 కిలోమీటర్ల మేర 63 స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరలో మెట్రో రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్.రెడ్డి మాట్లాడుతూ మొత్తం 57 రైళ్లను తీసుకొస్తున్నామని అందులో 30 వరకు ఇప్పటికే వచ్చాయని తెలిపారు. మెట్రో స్టేషన్లతో పాటు పరిసర కాలనీల్లో కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు, ఇప్పటికే ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉప్పల్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, రైతు సంఘం నాయకులు దుబ్బ నర్సింహారెడ్డి, మేకల హన్మంత్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, ధర్మారెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.