క్యాంపస్‌లో.. bigg boss
సిటీ కాలేజీలు ట్రెండ్‌ని ఫాలో అవ్వవు. క్రియేట్ చేస్తాయి. సూపర్‌హిట్ అయిన టీవీ రియాలిటీ షో లు బిగ్‌బాస్, రోడీస్‌లని క్యాంపస్‌లోకి
తీసుకొచ్చి కాలేజ్ ఫెస్ట్‌లో భాగం చేయడం ద్వారా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది పల్సేషన్. మిగిలిన కాలేజీలన్నీ మరిన్ని రియాల్టీ షోలకు వెల్‌కమ్ చెప్పడం ద్వారా ఇది రేపటి ట్రెడిషన్ గా మారనుంది.
కల్చరల్ ఈవెంట్స్, క్విజ్ కాంపిటీషన్స్, గేమ్స్, స్పోర్ట్స్, లిటరరీ యాక్టివిటీస్, మ్యూజిక్ కాంపిటీషన్స్.. ఇంకా చారిటీ వర్క్స్. కాలేజ్ ఈవెంట్లలో హోరెత్తించే ఈ తరహా రెగ్యులర్ ప్రోగ్రామ్‌ల గురించి మాట్లాడడం ఇంకా మనకు బోరెత్తించదా? వాట్స్ నెక్ట్స్? అని అడగాలనిపించదా? యంగ్ అండ్ ఎనర్జిటిక్ గైస్/గాళ్స్‌కు ఆ మాత్రం తెలియదా? తెలుసు కాబట్టే.. ఓ కొత్త ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో క్యాంపస్ ఈవెంట్‌ని టాక్ ఆఫ్ ది ట్విన్ సిటీస్‌గా మార్చారు. ఆ కాన్సెప్ట్ పేరే రియాలిటీ షో. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా టీవీ వ్యూయర్‌షిప్‌ని శాసిస్తున్న షోస్‌ని అనుకరించడం ద్వారా కాలేజీలలో లేటెస్ట్ ట్రెండ్‌కు నాంది పలికాయి షాదాన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సెన్సైస్, డాక్టర్ వీఆర్‌కే వుమెన్స్ మెడికల్ కాలేజీ.
‘బిగ్’ ఫెస్ట్...
విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒకే చోట కొన్ని రోజుల పాటు కలసి గడపడం, వారి ప్రవర్తనను సీక్రెట్ కెమెరాల ద్వారా గమనించడం, సహజమైన భావోద్వేగాలను స్వేచ్ఛగా వెల్లడించే ందుకు అవకాశం కల్పించి.. వారి ప్రవర్తనకు వీక్షకుల ఓటింగ్, న్యాయ నిర్ణేతల జడ్జిమెంట్ బేస్ చేసుకుని మార్కులేయడం.. ఎక్కువ మందిని మెప్పించిన వారిని విజేతలుగా ఎంపిక చేయడం.. ఈ ప్రాసెస్ వినగానే హిందీ టీవీ చానెల్స్ చూసే వాళ్లు వెంటనే బిగ్‌బాస్ అని గుర్తిస్తారు. అంతగా పాపులరైన ఈ ప్రోగ్రామ్‌ను మక్కీకి మక్కీ షాదాన్ కాలేజ్ ఫెస్ట్‌లో భాగం చేశారు. దీని కోసం క్యాంపస్ ఆవరణలోనే బిగ్‌బాస్ హౌస్‌ను కూడా నెలకొల్పారు. ‘విభిన్నంగా ఉంటుందని దీనిని ఎంచుకున్నాం. దాదాపు 100కు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. వీటిలో నుంచి 20 ఫైనలిస్ట్‌లు ఎంపికైతే చివరకు 15 మందికే హౌస్‌లోకి వెళ్లే అవకాశం కలిగింది’ అని నిర్వాహకులు అమన్ చెప్పారు. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్ రూమ్.. వంటి వాటితో ఈ బిగ్ హౌస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు రాత్రుళ్లు సైతం అక్కడే ఉంటే విద్యార్థినులు రాత్రి వెళ్లి పోయి ఉదయాన్నే మళ్లీ జాయిన్ అయ్యారు. అలాగే ఓటింగ్‌లు, ఎలిమినేషన్ రౌండ్లు.. ఇలా బిగ్‌బాస్‌ను తలపించే రీతిలో షో కండక్ట్ చేశారు.
యూత్‌కి యూజ్‌ఫుల్..
యువత కోసం యువత చేత యువత వలన అన్నట్టు రూపుదిద్దుకునే కాలేజీ ఈవెంట్లు.. రోజు రోజుకూ క్రియేటి వ్‌గా మారుతుండడం నవతరానికి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. రియాలిటీ షో అనే కొత్త కాన్సెప్ట్ ఎంటరై హిట్టవడంతో రానున్న రోజుల్లో మరిన్ని వెరైటీ థీమ్స్ రావడం, మరింతగా యూత్ టాలెంట్ వెలుగుచూడడం తధ్యం. సో.. లెట్ వెయిట్ ఫర్ మెనీ మోర్ వెరైటీ కాన్సెప్ట్స్..
సమ్‌థింగ్ డిఫరెంట్..
విభిన్నంగా ఏదైనా ప్లాన్ చేయాలని ఆలోచించి బిగ్‌బాస్ రియాలిటీషో కాన్సెప్ట్ డిజైన్ చేశాం. అందిన రిజిస్ట్రేషన్స్ నుంచి 15మందికి కుదించి మరో 5గురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాం. కాలేజ్ బిల్డింగ్‌లో థర్డ్ ఫ్లోర్‌లో వేసిన బిగ్ బాస్ హౌజ్ సెట్‌లో మొత్తం 3రోజుల పాటు కంటెస్టెంట్స్ బస చేసేందుకు అనువుగా ఫుడ్, బెడ్స్ అన్నీ అరేంజ్ చేశాం. లోపలి ప్రతి సన్నివేశాన్ని షూట్ చేశాం. దానిని స్టూడెంట్స్ చూసేలా స్క్రీన్ ఏర్పాటు చేసి, ఆడియన్స్‌కు ఓటింగ్ ఛాన్స్ ఇచ్చాం. ఎవిరిడే ఎలిమినేషన్ రౌండ్స్ నిర్వహించాం. నలుగురు ఫైనలిస్ట్‌ల నుంచి విన్నర్‌గా డాక్టర్ నాసిహ్‌ని ఓటింగ్ ఆధారంగా సెలెక్ట్ చేశాం. అలాగే రోడీస్ రియాలిటీ షో తరహాలో చేసిన ప్రోగ్రాం కోసం ఆడిషన్స్‌లో 30 స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేశాం. డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చాం. దీనిలో షయ్యద్ షాబాజుద్దీన్, అదీబా అలీలు విజేతలుగా నిలిచారు’ అంటూ వివరించారు నిర్వాహకులు.
- మన్నన్ అలీ అష్మీ, నిర్వాహక ప్రతినిధి