గోరింటాకు ఇష్టపడని అతివలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో!. పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్లు సమయంలలో మహిళల చేతులు రకరకాల గోరింటాకు డిజైన్‌లతో ఎర్రగా మెరిసిసోవాల్సిందే. అలాంటి గోరింటాకు ప్రత్యేకించి ఆషాడంలోనే కంప్లసరీగా ఎందుకు పెట్టుకుంటారు? అస్సలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? గోరింటాకు ప్రాముఖ్యత ఏమిటి? తదితరాల గురించి చూద్దామా!.
పార్వతి దేవి రుధిరాంశతో జన్మించిందే గోరింటా
గౌరిదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింత గూర్చి చెలులు పర్వతరాజు(హిమవంతుడు)కు చెప్పడంతో ఆయన సతీసమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోనే పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు. నా వలన లోకానికి ఏవిధమైన ఉపయోగం కలదు అని ఆ గౌరిదేవిని ప్రశ్నిస్తుంది. ఇంతలో పార్వతి దేవి చిన్నతనపు చలపతతో ఆ చెట్టు ఆకుని కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి.
దీంతో పార్వతి తల్లిదండ్రులు అయ్యో బిడ్డా చేతుల కందిపోయాయి అని భాదపడుతుండగా..వెంటనే పార్వతి దేవి నాకు ఏవిధమైన భాద కలగలేదు. పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కనిపిస్తోంది అంటుంది. దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవ లోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధ చెందుతుందని అని ఆ వృక్షాన్ని ఆశ్వీరదిస్తాడు. అదీగాక గౌరిదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరింటాకుగా ఆ వృక్షాన్ని పిలిచేవారు.
అది కాస్త కాలక్రమేణ అలంకారంగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాకుగా మారిపోయింది. అంతేగాదు గౌరిదేవి నీ వర్ణం కాళ్లు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది గనుక అదే నీ జస్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరం కూడా ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి జనులు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు, కాళ్లు అందంగా తీర్చిదిద్దుకునే అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు. అదే సమయంలో కుంకుమకు ఓ సందేహం కలుగుతుంది. నదుటన కూడా ఈ ఆకు పసరునే బొట్టుగా దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది. ఈ విషయమే గౌరిదేవికి చెప్పగా గోరింటాకు నుదుటన పెడితే పండదని చెబుతుంది. కావాలంటే పరీక్షించి చూడండి గోరింటాకు నిజంగానే నుదుటన పండదు.
స్త్రీల ఆరోగ్యానికి ఔషధంలా..
రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరేవేసే ప్రధాన నాడులు ఉంటాయి. అంతేగాదు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి.
మంచి భర్త రావడానికి గోరింటాకుకి గల సంబంధం ఏమిటంటే..
స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోనుల పని తీరు చక్కగా ఉంటే దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. ఆ అందంగా ఉండే అతివలు సున్నితమైన తమ లేత చేతులకు ఈ గోరింటాకుని పెంటుకుంటే..బాగా పండి చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యంగా ఉంటే ఆ అమ్మాయి పెళ్లిచేసుకుంటే ఆమె దాంపత్యం చాలా బావుంటుంది.
దీంతో భర్త కూడా ఆమెను బాగా ప్రేమిస్తాడు. ఈ దూరదృష్టితోనే బాగా పండితే మంచి మొగుడు వస్తాడని మన పెద్దలు చెప్పారు. ఈ చెట్టు సంత్సరానికికోమారు పుట్టింటకి పోతుందంట అంటే పార్వతి దేవి దగ్గరికి. అంతేగాదు అషాడమాసంలో అక్కడున్నప్పడూ కూడా తనని మరిచిపోకుండా పెట్టుకోవాలని పార్వతి దేవిని కోరిందట. అందుకనే అందరూ ఆషాడం రాగానే గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు మనకు చెబుతుంటారు.
(చదవండి: తొలి ఏకాదశి..శయన ఏకాదశి..విష్ణువు నిజంగానే నిద్రలోకి వెళ్తారా..!)
Comments
Please login to add a commentAdd a comment