Ashada Masam
-
హైదరాబాద్: నగరానికి పెళ్లి కళ! 17, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. ఆషాఢ మాసం వెళ్లి శ్రావణం రావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు కూడా వచ్చేశాయి. దీంతో ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నట్లు పురోహితవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొంతకాలంగా ఎలాంటి పెళ్లిళ్లు, వేడుకలు లేకుండా ఉన్న పురోహితులు ఈ నెల రోజుల పాటు బిజీ బిజీగా గడపనున్నారు.ఈ నెల 7 నుంచి 28 వరకూ అన్నీ మంచి ముహూర్తాలే అయినా 17, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ రెండు రోజుల పాటు నగరంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫంక్షన్‌హాళ్లు, కల్యాణమండపాలు, హోటళ్లకు బుకింగ్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే భాజాభజంత్రీలు, మండపాలను అలంకరించేవారికి, కేటరింగ్ సంస్థలకు సైతం ఆర్డర్లు పెరిగినట్లు అంచనా. ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు ప్రముఖ పురోహితుడు చిలకమర్రి శ్రీనివాసాచార్యులు తెలిపారు.15వ తేదీ నుంచి అన్నీ దివ్యమైన ముహూర్తాలే అని చెప్పారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని పేర్కొన్నారు. ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్న దృష్ట్యా మార్కెట్లో సైతం సందడి పెరిగింది. వస్త్రదుకాణాలు, బంగారం దుకాణాల్లో అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల బంగారం ధరలు కూడా కొంత వరకూ తగ్గడం వల్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ రావడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.ఇవి చదవండి: ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’.. : స్టార్ డిజైనర్ ఓస్వాల్ -
హైదరాబాద్: రాజ్‌భవన్ లో ఆషాడ బోనాలు ఉత్సవాలు (ఫోటోలు)
-
ఇంద్రకీలాద్రి : రికార్డు స్థాయిలో దుర్గమ్మకు సారె సమర్పణ (ఫొటోలు)
-
తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు)
-
ఆషాఢ గజానన సంకష్ట చతుర్థి : విశిష్టత, లాభాలు
ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని గజానన సంకష్ట చతుర్థి అంటారు. ఎంతో భక్తితో జరుపుకునే పండుగ. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం (క్షీణించే దశ) చతుర్థి (నాల్గవ రోజు) నాడు వస్తుంది. సంకష్ట చతుర్థి అంటే కష్టాలను నాశనం చేసేదని అర్థం. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథిని సంకష్ట చతుర్థి అంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణపతి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడట. అందుకే ఈ మాసంలో శివుడితోపాటు, ఆయన కుమారుడైన వినాయకుడిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం వేళలో మహిళలు గణపతిని పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఈ ఉపవాసాన్ని ముగిస్తారు. అత్యంత భక్తిశ్రద్దలతో గణేశుని పూజించి రోజంతా ఉపవాసం ఆచరిస్తారు. గణపతి వ్రత కథను చదువుకుని సాయంత్రం పూజలు చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రత మహిమ వల్ల అదృష్టం కలిసివస్తుందని అన్ని అడ్డంకులను విఘ్ననాయకుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. గజానన సంకష్ట చతుర్థి నాడు దానధర్మాలు చేస్తారు. అన్నార్తులకు అవసరమైన ఇతర బహుమతులు అందించడం శుభప్రదంగా భావిస్తారు. తద్వారా కష్టనష్టాలు తొలగి ఆ గణుశుని ఆశీస్సులు లభిస్తాయని, సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మంచి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భావిస్తారు. -
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఆషాఢ సారె సమర్ఫణలు (ఫొటోలు)
-
Ashada Masam: గోరింటా పూసిందీ...
ఆషాఢమాసపు వర్షపు జల్లులకు కొత్త చివుర్లు తొడిగి, నిండా ఆకులతో ఉల్లాసంగా కనిపిస్తుంది గోరింట చెట్టు. అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరిన నవ వధువు, మరదలిని ఆటపట్టించే వదినలు, ఆజమాయిషీ చేస్తూ తిరిగే అత్తలు, ఆటపాటలతో సందడి చేసే యువతులు.. అందరినీ కట్టిపడేసి కుదురుగా కూర్చోబెట్టి, ఎర్రని పంట కోసం ఎదురు చూపుల సహనాన్ని అలవాటు చేస్తుంది గోరింట.ఈ కాలమే ఎందుకంటే..⇒ ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. అలాగే, చల్లబడిన బయటి వాతావరణానికి, శారీరక వేడికి సమతుల్యత లోపిస్తుంది. దీనిని బ్యాలెన్స్ చేసే శక్తి గోరింటాకుకు ఉంటుందనేది పెద్దలు చెప్పే మాట. ⇒వర్షాల కారణంగా నీళ్లలో తరచూ పాదాలు తడుస్తుంటాయి. ఇలాంటప్పుడు పాదాల చర్మానికి సూక్ష్మ క్రిముల వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.⇒గోళ్లకు కూడా గోరింటాకు పెట్టడం వల్ల గోళ్లు పెళుసు బారడం, గోరుచుట్టు రావడం వంటి సమస్యలు దరిచేరవు. ⇒ఎర్రగా పండిన చేతులను చూసుకొని ఎంతగానో మురిసి΄ోయే వనితలు గోరింటాకును సౌభాగ్యానికి ప్రతీకగానూ భావిస్తారు. గోరింటాకు ్రపాముఖ్యతను తెలుసుకోవడమే కాదు మహిⶠలంతా ఒకచోట చేరి, వేడుకలా మార్చుకుంటున్నారు. వివాహ వేడుకల్లో మెహిందీ ఫంక్షన్‌కు ఉన్న ్ర΄ాధాన్యత ఆషాఢం గోరింటాకుకూ వర్తింపజేస్తున్నారు. -
ఆషాఢంలో దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఆషాడ మాసంలో అనంత్ అంబానీ పెళ్లి..కారణం ఇదే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ -రాధికల వివాహం శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ పెళ్లి సందడికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అత్యంత లగ్జరీయస్‌గా జరిగిన ఈ వివాహానికి సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు, రాజకీయనాయకులు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం నెట్టింట ముఖేశ్ అంబానీ ఇంట జరిగిన ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆషాడంలో పెళ్లిళ్లు చెయ్యరు. అందులోనూ కొత్త కోడలు అత్తారింట ఉండనే ఉండకూదు. అసలు ఈ మాసం మూఢంతో సమానమని. ఎలాంటి వివాహ తంతు లేదా అందుకు సంబంధించిన ఏ పనులు చెయ్యరు. మరీ అలాంటిది ముఖేశ్ ఉండి ఉండి మరీ ఇలా ఆషాడంలో పెళ్లి చేయడం ఏంటనీ సర్వత్రా చర్చించుకుంటున్నారు. కారణం ఏంటంటే..ఇక్కడ అనంత్ రాధికల పెళ్లి ముహుర్తం ధృక్ గణితం ఆధారంగా ముహర్తం నిర్ణయించారు పండితులు. దీన్ని సూర్యమానం ప్రకారం నిర్ణయిస్తారు. వాస్తవానికి దక్షిణాది వారు చాంద్రమానం ప్రకారం ముహుర్తాలు నిర్ణయించగా..ఉత్తరాది వారు సూర్యమానం ఆధారంగా పంచాంగం నిర్ణయిస్తారు. అలాగే చాంద్రమాన పంచాగంలో ఉన్నట్లు అధిక మాసాలు అంటూ..ఈ సూర్యమాన పంచాంగంలో ఉండనే ఉండవు. పైగా ఆయా ప్రాంతాల వారీగా అది ఆషాడ మాసం కాదు. ఇక అనంత్ రాధికల పెళ్లి జూలై 12 శుక్రవారం మేషరాశిలో చంద్రుడు సంచారం, సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణిస్తుంటాడు చంద్రుడు రాత్రి వృషభరాశిలో సంచారం. పైగా ఇది పమరమిత్ర తార కలిగిన శుభఘడియలు కూడా. కావున పండితులు ఈ ముహర్తం వివాహానికి అత్యంత శుభప్రదమని చెబుతున్నారు. అందువల్లే ఆషాడంలో కూడా అంబానీ ఇంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అనంత రాధికల వివాహం జూలై 12 శుభ్ వివాహ్‌తో మొదలయ్యి..జూలై 13 శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ మహోత్సవంతో ముగుస్తాయి. (చదవండి: వందేళ్లక్రితమే భారత్‌లో సెల్ఫీ ఉందని తెలుసా..!) -
ఆషాఢంలో.. మునగాకు తినాలని మీకు తెలుసా!?
ఆషాడంలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోతాం. మునగాకు తినాలని కూడా చెప్పారు పెద్దవాళ్లు. మహిళల ఆరోగ్యాన్ని సంప్రదాయాల పట్టికలో చేర్చారు. పెద్దవాళ్లు చెప్పిన పద్ధతులను పాటిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.కొబ్బరి మునగాకు వేపుడు..కావలసినవి..మునగాకు పావు కేజీ;పసుపు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు;ఉప్పు – అర టీ స్పూన్;మిరప్పొడి– టీ స్పూన్;నూనె – టేబుల్ స్పూన్;ఆవాలు– అర టీ స్పూన్;పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్;వెల్లుల్లి రేకలు– 4;కరివేపాకు– 2 రెమ్మలు.తయారీ..మునగాకులో పుల్లలు తీసివేసి, ఆకును శుభ్రంగా కడిగి నీరు పోయేటట్లు చిల్లుల పాత్రలో వేయాలి.అరగంటసేపు పక్కన ఉంచాలి. బాగా ఆరిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని అందులో కొబ్బరి తురుము, పసుపు వేసి కలపాలి.బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, మిరప్పొడి, కరివేపాకు వేసి వేయించాలి.అవి వేగిన తర్వాత ముందుగా కలిపి సిద్ధంగా ఉంచుకున్న మునగాకు, కొబ్బరి మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సన్న మంట వేగనివ్వాలి.మధ్యలో మూత తీసి కలుపుతూ ఆకులో పచ్చిదనం, తేమ పోయే వరకు వేగనిచ్చి ఉప్పు సరిచూసుకుని ఆపేయాలి.మొరింగా ఆమ్లెట్..కావలసినవి..కోడిగుడ్లు – 2;మునగాకు – అర కప్పు;ఉప్పు – పావు టీ స్పూన్;మిరియాలపొడి– పావు టీ స్పూన్;వెన్న లేదా నెయ్యి– టేబుల్ స్పూన్.తయారీ..మునగాకులో పుల్లలు ఏరివేసి ఆకును శుభ్రంగా కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేయాలి.నీరు కారిపోయిన తర్వాత తరిగి ఒక పాత్రలో వేయాలి.అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.ఆ తర్వాత కోడిగుడ్లు కొట్టి సొనవేసి కలపాలి.పెనం వేడిచేసి వెన్న లేదా నెయ్యి వేసి కరిగిన తర్వాత మునగాకు, కోడిగుడ్ల మిశ్రమాన్ని వేయాలి.ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా దోరగా కాలనిచ్చి స్టవ్ ఆపేయాలి. గమనిక: కోడిగుడ్డు సొన కాలే సమయంలో మునగాకు కూడా మగ్గిపోతుంది. పచ్చివాసన వస్తుందని సందేహం ఉంటే మునగాకును పెనం మీద పచ్చివాసన పోయే వరకు వేయించి ఆ తర్వాత మిగిలిన దినుసులను కలిపి ఆమ్లెట్ వేసుకోవాలి.ఇవి చదవండి: ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదా? -
ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదా?
ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒక గడప దాట కూడదని, అత్తా అల్లుళ్లు ఒకరికొకరు ఎదురు పడకూడదని, కొత్త దంపతులు కలవకూడదనీ అంటారు. ఎందుకంటే..?సాధారణంగా వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులుప్రారంభిస్తారు. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో ఉంటే, సకాలంలో పనులు జరగవు.వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటిలా కాల్వల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే కష్టం కదా... అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు. అంతేకాకుండా, కొత్త నీరు వచ్చే ఆషాఢంలో ఆ నీరు తాగటం వల్ల రకరకాల రుగ్మతలకు లోను కావచ్చు.అంతేకాదు, ఈ కాలంలో గర్భధారణ జరిగితే పిల్లలు కలిగే నాటికి మంచి ఎండాకాలం... శిశువు పెరగటానికి అంత మంచి వాతావరణం కాదు అని ఆలోచించారు. అందుకే ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి రోజులకు అన్వయించుకుంటే... వ్యవసాయదారుల కుటుంబాలు కాకుండా ఇతరుల విషయంలో ఈ ఇబ్బంది లేదు.ఇవి చదవండి: పబ్‌లో.. ఫస్ట్ టైమ్! -
ఆషాఢం.. ప్రత్యేకతల సమాహారం!
ఉపందుకునే వ్యవసాయ పనులు.. ఎటూ చూసిన పచ్చని పంటలు. ఆడబిడ్డల అరచేతులపై అందమైన ముగ్గులు.. దేవుడిలాంటి భర్త దొరకాలని కోరుకునే ఆడపిల్లల ఆకాంక్షలు.. కొత్త జంటు దూరంగా.. పంటలు బాగా పండాలని.. పిల్ల జెల్లా బాగుండాలని.. ఊరువాడా చల్లంగుండాలని గ్రామ దేవతలకు భోనాల సందడి.. ఇలా ఎన్నెన్నో విశేషాలతో కూడుకున్నదే ఆషాఢమాసం.. ఈ మాసంలో పల్లెలు, పట్టణాలు బోనాలతో మార్మోగుతాయి. నెల రోజుల పాటు గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. శనివారం నుంచి ప్రారంభమైన ఆషాఢమాసం గురించి ప్రత్యేక కథనం..బోనం.. అమ్మవారికి నైవేద్యం..బోనం అంటే అమ్మవారి నైవేద్యం, మహిళలు వండిన అన్నంతోపాటు బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. బోనాల ఊరేగింపులో పోతరాజుల ఆటపాటలు, శివసత్తుల విన్యాసాలు, యువకుల నృత్యాలు ఆకట్టుకుంటాయి. పూర్వ కాలంలో పండుగ రోజు దుష్టశక్తులను పారదోలడానికి బోనంతో పాటు దున్నపోతును బలిచ్చే వారు. ఇప్పుడు మేకలు, గొర్రెలు, కొడిపుంజులను బలి ఇవ్వడం అనవాయితీగా మారింది.వన భోజనాల సందడి..గ్రామీణ ప్రాంతాల్లో వన భోజనాలు సందడి నెలకొంటుంది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు మొక్కుతారు. పాడి పంటలు పండి అందరూ బాగుండాలని గ్రామ దేవతల వద్ద వనభోజనాలకు వెళ్తారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం అక్కడే భోజనాలు వండి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వంటలు చేసి భుజిస్తారు.అరచేతిలో అందమైన ముగ్గులు..కొత్తగా పెళ్లయిన యువతులు ఆషాఢమాసం ప్రారంభం కాగానే తప్పనిసరిగ పుట్టింటికి వెళ్తారు. చేతులకు గోరింటాకు పెట్టి అది ఎంత బాగా పండితే వారి జీవితం అంత బాగుంటుందని, సుఖ కాంతులో వర్ధిలుతారని నమ్మకం. గతంలో గ్రామాల్లో ప్రకృతి పరంగా గోరింటాకు పెట్టుకునేవారు. కాలక్రమేణా గోరింటాకు కనుమరుగై దాని స్థానంలో మోహిందీ వాడటం ప్రారంభమైంది.అత్తా కోడళ్లకు ఎడబాటు..ఆషాఢ మాసంలో అత్తత్తాకోడళ్లు ఒకరి ముఖం మరొకరు చూసుకోవద్దని తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ కారణంగా కొత్త కోడళ్లు అత్తవారింటికి దూరమవుతారు. ఆషాఢ మాసం ప్రారంభానికి ముందే కోడళ్లు తమ పుట్టింటికి చేరుకుంటారు. ఇలా దూరంగా ఉండటం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని పెద్దలు చెబుతుంటారు.ఎవుసం పనులకు ఊపు..ఆషాఢమాసం ప్రారంభానికల్లా రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం వంటి వ్యవసాయ పనులన్నీ పూర్తి చేస్తారు. తొలకరి జల్లులు కురవగానే వ్యవసాయ పనులను వేగవంతం చేస్తారు. ఈ మాసం ముగిసే వరకు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతారు. ఎక్కువగా వరి సాగు పనులు జరుగుతాయి. -
Telangana Bonalu 2024: అమ్మా బైలెల్లినాదో...
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఎనిమిది వందల ఏళ్లుగా వస్తోంది. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా,ఈ బోనాల వేడుకలు మాత్రం అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్ సలహా మేరకు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్‌దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్ వద్దకు చేరిన వరద నీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఎందుకు సమర్పిస్తారు?ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, ΄÷ంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. అచ్చ తెలంగాణ జానపదాలు బోనాలపాటలు ఆడమగ, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు‘‘గండిపేట గండెమ్మా దండ బెడత ఉండమ్మా....., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే....., అమ్మా బైలెల్లినాదే....అమ్మా సల్లంగ సూడమ్మ..... మైసమ్మా మైసమ్మా.... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి. అమ్మవార్లకు సోదరుడు పోతురాజుపోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు చేస్తారు. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాయిద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు.బోనం అంటే... భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయ లతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.ఇంటి ఆడబిడ్డ లెక్కఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ్రపాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ్రపాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ్రపాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ జగదంబికదే తొలిబోనంబోనాల మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్ పరిసర ్రపాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్రపారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.– డి.వి.ఆర్. భాస్కర్ -
భాగ్యనగరంలో బోనాల సందడి
-
నేటి నుంచి ఆషాడ మాస బోనాలు.. జగదాంబికకు తొలి బోనం
గోల్కొండ: బోనాలకు వేళైంది. గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలో కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢమాసం బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి భారీ ఎత్తున తాగునీటి ఏర్పాట్లు చేస్తోంది. జలమండలి డీజీఎం ఖాజా జవహర్ అలీ సిబ్బందితో తాగునీటి ట్యాంకర్లను పెట్టిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైయ్యే అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ వారు మొబైల్ ఫైర్ ఎస్టింగిషర్‌ను కూడా సిద్ధం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణలను పూర్తి చేశారు. పోలీసులు లంగర్‌హౌజ్ నుంచి గోల్కొండ వరకు పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా పోలీస్ టీమ్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు తెలిపారు. సప్త మాతృకలకు.. బంగారు బోనాలు.. చార్మినార్: నగరంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని కనక దుర్గ అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి బంగారు బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించనున్నామని భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పాతబస్తీ మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోనంతో గోల్కొండ కోటకు బయలుదేరుతామన్నారు. లంగర్‌హౌజ్ వద్ద ఏర్పాటు చేసే స్వాగత వేదికపై నుంచి మంత్రులు స్వాగతం పలుకుతారని ఆయన తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలను నగరంలోని గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహిని దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో సమర్పించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గోల్కొండ జగదాంబ అమ్మవారికి, 10న బల్కంపేట ఎల్లమ్మ, 12న, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 14న విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, 18న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి, 23న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, 25న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవార్లకు బంగారు బోనం, పట్టు వ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించనున్నారు. -
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాసం ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాస సారె మహోత్సవం (ఫొటోలు)
-
వానలు కురవాలి
ఇది ఆషాఢ మాసం. వర్షారంభ కాలం. ఆషాఢమంటే ఆకాశంలో కనిపించే మబ్బులు. నేలమీద కురిసే తొలకరి చినుకులు వీచే మట్టి పరిమళాలు. ‘తొలకరి వాన మొలకల తల్లి’ అనే నానుడి ఉంది. ఆషాఢంతో ముడిపడిన అనేక సంప్రదాయాలు మన జనజీవనంలో ఉన్నాయి. ఆషాఢం నుంచి కార్తీకం మొదలయ్యే వరకు వానలు కురుస్తాయి. పూర్వం మనకు వానాకాలంతోనే ఏడాది మొదలయ్యేది. అందుకే, వానను వర్షం అని అంటారు. ఏడాదులను వర్షాలతో లెక్క కట్టడం కూడా మనకు వాడుకలో ఉన్న పద్ధతే! ప్రకృతిలోని జీవకళకు వానలే ఆధారం. వర్షసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘సదా మనోజ్ఞం స్వనదుత్సవోత్సుకమ్/ వికీర్ణ విస్తీర్ణ కలాప శోభితమ్/ ససంభ్రమాలింగన చుంబనాకులం/ ప్రవృత్త నృత్యం కులమద్య బర్హిణామ్’ అని కాళిదాసు ‘ఋతుసంహారం’లో వర్షర్తు సౌందర్యాన్ని వర్ణించాడు. మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో వాన కురుస్తున్నప్పుడు నెమళ్లన్నీ పింఛాలు విప్పి జంటలు జంటలుగా ఒకదానినొకటి ముద్దాడుతూ నర్తిస్తున్నాయట! తొలకరి జల్లులు కురిసే వేళల్లో ఇలాంటి చూడచక్కని దృశ్యాలు కనిపిస్తాయి. ‘ఎలగోలు జల్లు మున్ బెళబెళ నేటవా/ల్పడి గాలి నట్టిండ్ల దడిపి చనగ/... భూభిదాపాది దుర్భరాంభోభరంపు/... కడవ వంచి/నట్లు హోరని దారౌఘ మైక్యమొంది/ మిన్ను మన్ను నొకటిగా వృష్టి బలిసె’ అంటూ హోరైన గాలితో చిటపట చినుకులుగా మొదలైన వర్షం వేగాన్ని పుంజుకుని మింటినీ మంటినీ ఏకం చేసేంత కుంభవృష్టిగా పరిణమించిన వైనాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ‘ఆముక్తమాల్యదలో’ కళ్లకు కట్టాడు. ఇలాంటి దృశ్యాన్నే శేషేంద్ర తన ‘ఋతు ఘోష’లో ‘విరిసెను మేఘపరంపర/ మెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్/ పరచెను ఝంఝానిలములు/ కురిసెను వర్షము కుంభగుంభిత రీతిన్’ అని వర్ణించారు. సకాలంలో సజావుగా కురిస్తే, వర్షం హర్షదాయకమే! వర్షం ఒక్కొక్కప్పుడు బీభత్సం సృష్టిస్తుంది. శేషేంద్ర తన కావ్యంలో వర్షబీభత్సాన్ని కూడా వర్ణించారు. ‘పసికందుల్ జడివానలో వడకగా పాకల్ ధరంగూలి తా/మసహాయస్థితి తల్లిదండ్రులును హాహాకారముల్ సేయగా... నిర్వేల హాలాహల శ్వసనంబుల్ ప్రసవించె దీనజనతా సంసారపూరంబులన్’ అంటూ జడివానకు పూరిపాకలు కూలి పోయినప్పుడు నిరుపేదల నిస్సహాయతను కళ్లకు కట్టారు. రుతువులలో వర్షర్తువంతటి అస్తవ్యస్తమైన రుతువు మరొకటి లేదు. వానాకాలానికి ఉండే సహజ లక్షణం అనిశ్చితి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు’ అని సామెత. వర్షాకాలంలో మోతాదుగా వానలు కురుస్తాయనే భరోసా ఎప్పుడూ లేదు. భూమ్మీద ఎక్కడో ఒకచోట అతివృష్టి లేదా అనావృష్టి దాదాపు సర్వసాధారణం. మనుషులు అతివృష్టినీ తట్టుకోలేరు, అనావృష్టినీ భరించలేరు. సకాలంలో వానలు కురవకుంటే వానల కోసం ఎదురు చూస్తారు. ఎదురుచూపులకు ఫలితం దక్కకుంటే కప్పలకు పెళ్లిళ్లు చేయడం, వరుణ హోమాలు చేయడం వంటి తతంగాలను యథాశక్తి సాగిస్తారు. ప్రార్థనల ఫలితంగానో, ప్రకృతి రుతుధర్మ ప్రకారమో జడివానలు మొదలైతే, చిత్తడితో నిండిన వీథుల్లోకి వెళ్లలేక వానలను తిట్టుకుంటారు. మనుషులు స్తుతించినా, నిందించినా వాటితో ఏమాత్రం నిమిత్తం లేకుండా వానలు వాటి మానాన అవి వచ్చిపోతుంటాయి. అతివృష్టి వరదబీభత్సం వంటి ఉపద్రవాలను తెచ్చిపెడితే, అనావృష్టి కరవు కాటకాలతో ఆకలిమంటలు రేపుతుంది. ‘ఆకాశంబున మేఘమాలికల రూపైనం గనన్ రాదు, శు/ష్కాకారంబుల బైరులెల్ల సుదుమై యల్లాడె తీవ్రంబుగా/... మాకీ కష్టము వెట్టె దైవమని యేలా మాటికిం జింతిలన్?’ అంటూ దువ్వూరి రామిరెడ్డి తన ‘కృషీవలుడు’ కావ్యంలో కళ్లకు కట్టారు. అనావృష్టి ప్రభావం రైతు లకే ఎక్కువగా ఉంటుంది. చినుకు కరవై బీడువారిన నేలను చూస్తే రైతు గుండె చెరువవుతుంది. ఆషాఢం అంటే తొలకరి చినుకులు మాత్రమే కాదు, అరచేతులను పండించే గోరింట కూడా! ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయం. పురాతన నాగరికతల కాలం నుంచి గోరింటాకు వాడుకలో ఉంది. అయినా మన కావ్య ప్రబంధాలలో కాళిదాసాది పూర్వకవులు గోరింటాకుపై ఎందుకో శీతకన్నేశారు. గోరింట ప్రస్తావన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలోనే కనిపి స్తుంది గాని, కావ్యాలలో కనిపించదు. జానపద గీతాల్లో గోరింట ప్రస్తావన కనిపిస్తుంది. ‘గోపాల కృష్ణమ్మ పెళ్లయ్యెనాడు/ గోరింట పూచింది కొమ్మ లేకుండా’ అనే జానపద గీతం ఉంది. ‘గోరింటాకు’ సినిమా పాట పల్లవిని కృష్ణశాస్త్రి బహుశా దీనినుంచే సంగ్రహించి ఉంటారు. ఆధునిక కవుల్లో కొద్దిమంది గోరింటపై దృష్టి సారించారు. సరోజినీ నాయుడు ‘గోరింటాకు’ కవిత రాశారు. ‘వధువు నెన్నుదుటికి కుంకుమం ఎరుపు/ మధురాధరాలకు తాంబూల మెరుపు/ లిల్లీల తలపించు కాళ్లకూ వేళ్లకూ/ లేత గోరింటాకు ఎరుపే ఎరుపు’ అంటూ గోరింటాకు ఎరుపును ఎంతో మురిపెంగా వర్ణించారు. ఆమె ఇంగ్లిష్‌లో రాసిన కవితను సినారె తెలుగులోకి అనువదించారు. ‘బొప్పి గట్టినగాని యే పురుషుడైన/ తెలివినొందడు లోకంబు తెలియబోడు/ రాళ్లదెబ్బల గోరింట రంగొసంగు/ మనుజు డగచాటులనె గాని మారడెపుడు’ అంటారు ఉమర్ అలీషా. అగ చాట్లలో నలిగితే తప్ప మనిషి మారడని చెప్పడానికి రాళ్లదెబ్బలతో నలిగితేనే గోరింట రంగునిస్తుందని పోల్చడం విశేషం. ఆషాఢంలోని తొలకరి జల్లులతో మొదలయ్యే వానాకాలంలో సజావుగా వానలు కురిస్తే పంటపొలాల్లో నవధాన్యాలు పండుతాయి. ఆషాఢంలో అతివలు అలంకరించుకునే గోరింటాకుతో అరచేతులు పండుతాయి. ప్రకృతి కరుణిస్తే బతుకులు పండుతాయి. మన పంట పండాలంటే వానలు కురవాలి. -
ధర్మచక్ర ప్రవర్తనా పూర్ణిమ
ఆషాఢమాసం. శుక్లపక్షం. చతుర్దశి చంద్రుడు పశ్చిమ ఆకాశంలోంచి కిందికి వాలిపోయాడు. అది ఒక విశాల వనంలోని పచ్చికబయలు. దానిమధ్య పెద్ద మర్రిచెట్టు. దానికింద ఎత్తైన దిబ్బ. దాని మీద కూర్చుని ఉన్నారు ఐదుగురు తాపసులు. తెల్లవారకముందే సమీప గంగానదిలో స్నానం చేసి వచ్చి తపోసాధన గురించి తర్కించుకుంటున్నారు. తెల్లని నార వస్త్రాలు ధరించారు. వారిలో పెద్దవాడు కొండణ్ణ. అతని చూపు పొదలమాటున లేచి తత్తర పడుతున్న జింకకేసి పడింది. అందరూ అటుకేసి చూశారు. ఎవరో కాషాయ చీవరం ధరించిన ఒక వ్యక్తి వారికేసి వస్తూ కనిపించాడు. ‘మిత్రులారా! అలా నడిచేది ఎవరు? గుర్తించారా? శాక్య గౌతముడే!’’ అన్నాడు అశ్వజిత్తు. ‘‘మిత్రమా! నీవన్నది నిజమే. అతను తపో భ్రష్టుడు. అతను రాగానే మనం గౌరవించకూడదు. లేచి నిలబడకూడదు’’ అన్నాడు బద్దియుడు. ‘‘కూర్చోమని ఆసనం ఇవ్వకూడదు’’ అన్నాడు మహానామ! ‘‘ప్రత్యేక గౌరవ వందనాలు చేయొద్దు. ఆసనం ఇద్దాం’’ అన్నాడు పెద్దవాడైన కొండణ్ణ. ‘‘కానీ... ఆ తేజోమూర్తి వారి దగ్గరకు రాగానే.. ఆ ముఖంలోని జ్ఞానతేజస్సుని చూసి.... ఒకరికొకరు అప్రయత్నంగానే లేచి నిలబడ్డారు. నమస్కరిస్తూ ఎదురు వెళ్లారు. ఆహ్వానించారు. ఉచితాసనం ఇచ్చారు. కాళ్ళకు నీళ్ళిచ్చారు. ‘‘మిత్రమా! శాక్య గౌతమా!’’ అన్నారు. ‘‘భిక్షువులారా! నేను ఇప్పుడు గౌతముణ్ణి కాను. జ్ఞానోదయం అయిన బుద్ధుణ్ణి తథాగతుణ్ని భదంతను. కాబట్టి నన్ను భదంతా (భంతే) అని సంబోధించాలి’’ అన్నాడు. బుద్ధత్వం అనే పదం వినగానే వారి మనస్సు వికసించింది. గౌరవంతో వంగి నమస్కరించారు. ఆకాశంలో నల్లని మేఘాల బారు మెల్లగా జింకలవనం మీదుగా నైరుతి దిక్కుకేసి కదలిపోతోంది...! అప్పటికి ఆరేళ్ళ క్రితం... జ్ఞాన సాధన కోసం దుఃఖ నివారణి మార్గం కోసం అన్వేషిస్తూ తన రాజ్యాన్నీ పదవినీ, రాజభోగాల్నీ వదిలి వచ్చేశాడు సిద్దార్థుడు. అతనితోపాటే ఆస్థాన పురోహితుడు కొండణ్ణ కూడా వచ్చాడు. సిద్ధార్థుడు పుట్టినప్పుడు ‘‘మహారుషి అవుతాడు’’ అని చెప్పింది ఈ కొండణ్ణే. ఇంకా వారితో పాటు నలుగురు పురోహిత పుత్రులూ వచ్చేశారు. సిద్దార్థుడు ఆరేళ్ళు అనేకమంది, రుషుల దగ్గరకూ, తాత్వికుల దగ్గరకూ, గురువుల దగ్గరకూ తిరిగాడు. చివరికి ఈ ఐదుగురు మిత్రులతో కలిసి నిరంజనా నదీ తీరంలో కఠోర తపోసాధనకు దిగాడు. తిండి మానాడు, నీరసించి పడిపోయాడు. ‘‘ఇది సరైన సాధన కాదు’’ అని కొద్దిగా ఆహారం తీసుకోసాగాడు. దానితో అతను తపో భ్రష్టుడయ్యాడు’’ అని కోపగించి, మిగిలిన ఐదుగురూ అతణ్ణి వదిలి వచ్చేశారు. ఆ తర్వాత బుద్ధగయలో జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. దుఃఖ నివారణా మార్గాన్ని తెలుసుకున్నాడు. దాన్ని బోధించడానికి, తనని దూషించి వెళ్లిన వారిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆరోజు.... నాల్గు ఆర్య సత్యాల్ని, అష్టాంగ మార్గాన్నీ, మధ్యమ మార్గాన్నీ వివరించాడు. విన్న వెంటనే కొండణ్ణ అర్థం చేసుకున్నాడు. దుఃఖ విముక్తి పొందాడు. ఆ తర్వాత మిగిలిన వారు ఆ మార్గాన్ని దర్శించారు. వారితో బౌద్ధ సంఘం ఏర్పడింది. కాబట్టి ఈ ఆషాఢ పున్నమి ‘‘సంఘం పుట్టిన రోజుగా’’ ప్రసిద్ధి పొందింది. తాము తెలుసుకున్న ధర్మాన్ని (దుఃఖ నివారణి మార్గాన్ని) ప్రపంచానికి చాటాలనుకున్నారు. కాబట్టి దీన్ని ‘‘ధర్మ చక్ర ప్రవర్తనా దినం’’ అని పిలుస్తారు. బుద్ధుడు వారికి చేసిన మొదటి ప్రవచనం ధర్మ చక్ర ప్రవర్తనా సూత్రంగా, రెండవ ప్రవచనం ‘అనాత్మక లక్షణ సూత్రం’గా బౌద్ధ సాహిత్యంలో ప్రసిద్ధి. విముఖుల్ని సుముఖులుగా చేసిన గురువు కాబట్టి ‘గురుపూర్ణిమగా’ ఈ ఆషాఢ పున్నమిని ప్రపంచ బౌద్ధులు జరుపుకుంటారు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: కదిలించే కాంతి గురువు) -
ఆషాడంలో నేరేడు పండ్లను తినాలని ఎందుకంటారో తెలుసా..!
ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ శాస్త్ర ప్రమాణం. వెంటనే మనకు మరీ శాకాహారులు అని సందేహం వచ్చేస్తుంది కదా! అక్కడకే వస్తున్న ముందుగా దీనిలో ఉండే అంతరార్థాన్ని నిశితంగా పరిశీలిస్తే.. మొక్కలకు ప్రాణముందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. అలాగే సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని అర్థం. వరిధాన్యాన్నివ మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అంటే మొక్క మనకి ఆహారమిచ్చి, అది ప్రాణాన్ని కోల్పోతుంది. కాబట్టి అది మాంసాహారమే. ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! అలాగే మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస". అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి, వేదాలని కాపాడుకోవడం మన విధి. ప్రకృతిలో జరిగే మార్పు కోసం దేహానికి సహజ చికిత్సగా ఈ నేరేడు పళ్లను ఈ మాసంలోనే తీసుకోమని చెప్పడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం కూడా. మొన్నటి వరకు వేసవి తీవ్రతకు దేహం నుంచి శ్వేద(చెమట) రూపంలో బయటకు వెళ్లిన నీరు కాస్త ఆషాఢంలో ఎండతగ్గి, మూత్రం రూపంలో అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ ఆయుర్వేదం చెబుతోంది. ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన విషయాలు 1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడం, 2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. అంటే శూన్యమాసమైన ఈ ఆషాడ మాసం మానవుడిని ఆరోగ్యాన్ని కాపాడుకోమని సూచించడమే గాక మన జీవనం కోసం చేసే పాపాలకు ప్రాయచిత్తం చేస్తుకునేలా వేదాధ్యయనం చేసి ప్రకృతికి కృతజ్క్షత చూపమని చెబుతోంది. మన ఆచారాల్లో దాగి ఉన్న గొప్ప శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని తెలుసుకోవడమే గాక తరువాత తరాలకి చెబుదాం. (చదవండి: ఆషాడంలోనే ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే?..) -
ఆషాడంలోనే ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే?..
గోరింటాకు ఇష్టపడని అతివలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో!. పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్లు సమయంలలో మహిళల చేతులు రకరకాల గోరింటాకు డిజైన్లతో ఎర్రగా మెరిసిసోవాల్సిందే. అలాంటి గోరింటాకు ప్రత్యేకించి ఆషాడంలోనే కంప్లసరీగా ఎందుకు పెట్టుకుంటారు? అస్సలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? గోరింటాకు ప్రాముఖ్యత ఏమిటి? తదితరాల గురించి చూద్దామా!. పార్వతి దేవి రుధిరాంశతో జన్మించిందే గోరింటా గౌరిదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింత గూర్చి చెలులు పర్వతరాజు(హిమవంతుడు)కు చెప్పడంతో ఆయన సతీసమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోనే పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు. నా వలన లోకానికి ఏవిధమైన ఉపయోగం కలదు అని ఆ గౌరిదేవిని ప్రశ్నిస్తుంది. ఇంతలో పార్వతి దేవి చిన్నతనపు చలపతతో ఆ చెట్టు ఆకుని కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి. దీంతో పార్వతి తల్లిదండ్రులు అయ్యో బిడ్డా చేతుల కందిపోయాయి అని భాదపడుతుండగా..వెంటనే పార్వతి దేవి నాకు ఏవిధమైన భాద కలగలేదు. పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కనిపిస్తోంది అంటుంది. దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవ లోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధ చెందుతుందని అని ఆ వృక్షాన్ని ఆశ్వీరదిస్తాడు. అదీగాక గౌరిదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరింటాకుగా ఆ వృక్షాన్ని పిలిచేవారు. అది కాస్త కాలక్రమేణ అలంకారంగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాకుగా మారిపోయింది. అంతేగాదు గౌరిదేవి నీ వర్ణం కాళ్లు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది గనుక అదే నీ జస్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరం కూడా ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి జనులు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు, కాళ్లు అందంగా తీర్చిదిద్దుకునే అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు. అదే సమయంలో కుంకుమకు ఓ సందేహం కలుగుతుంది. నదుటన కూడా ఈ ఆకు పసరునే బొట్టుగా దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది. ఈ విషయమే గౌరిదేవికి చెప్పగా గోరింటాకు నుదుటన పెడితే పండదని చెబుతుంది. కావాలంటే పరీక్షించి చూడండి గోరింటాకు నిజంగానే నుదుటన పండదు. స్త్రీల ఆరోగ్యానికి ఔషధంలా.. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరేవేసే ప్రధాన నాడులు ఉంటాయి. అంతేగాదు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి. మంచి భర్త రావడానికి గోరింటాకుకి గల సంబంధం ఏమిటంటే.. స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోనుల పని తీరు చక్కగా ఉంటే దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. ఆ అందంగా ఉండే అతివలు సున్నితమైన తమ లేత చేతులకు ఈ గోరింటాకుని పెంటుకుంటే..బాగా పండి చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యంగా ఉంటే ఆ అమ్మాయి పెళ్లిచేసుకుంటే ఆమె దాంపత్యం చాలా బావుంటుంది. దీంతో భర్త కూడా ఆమెను బాగా ప్రేమిస్తాడు. ఈ దూరదృష్టితోనే బాగా పండితే మంచి మొగుడు వస్తాడని మన పెద్దలు చెప్పారు. ఈ చెట్టు సంత్సరానికికోమారు పుట్టింటకి పోతుందంట అంటే పార్వతి దేవి దగ్గరికి. అంతేగాదు అషాడమాసంలో అక్కడున్నప్పడూ కూడా తనని మరిచిపోకుండా పెట్టుకోవాలని పార్వతి దేవిని కోరిందట. అందుకనే అందరూ ఆషాడం రాగానే గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు మనకు చెబుతుంటారు. (చదవండి: తొలి ఏకాదశి..శయన ఏకాదశి..విష్ణువు నిజంగానే నిద్రలోకి వెళ్తారా..!) -
ఘనంగా ఆషాడమాసం ఉత్సవాలు ప్రారంభం
-
Sravana Masam: శ్రావణం శుభకరం.. ముఖ్యమైన తేదీలివే!
అనంతపురం కల్చరల్: ఈనెల 28న వచ్చే అమావాస్య రాకతో ఆషాఢమాసం ముగిసి శుక్రవారం నుంచి నోములు, వ్రతాలకు నెలవైన శ్రావణం మాసం రానుంది. శుభకార్యాలు మళ్లీ మొదలు కానుండడంతో మాసమంతటా ప్రతి ఇంటా శ్రావణ శోభతో అలరారే పండుగలు, సామూహిక వ్రతాలు సందడి చేయనున్నాయి. శ్రావణంలో భక్తిశ్రద్ధలతో ఆచరించే ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక కోణమే కాకుండా సామాజిక, వైజ్ఞానిక అంశాలెన్నో దాగున్నాయని పెద్దలు చెబుతారు. మానవ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శ్రావణ మాసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ఉంటుంది. ఇప్పటికే శ్రావణమాస పూజల కోసం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. ఈనెల తప్పితే మళ్లీ డిసెంబరు వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో ఫంక్షన్ హాల్స్, కల్యాణమండపాలు బిజీగా మారనున్నాయి. మహిళలకు ప్రీతికరం శ్రావణ నోములు, వ్రతాలు భక్తితోనోచుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటామన్న విశ్వాసముండడంతో మహిళలు ఈ మాసాన్ని అత్యంత ప్రీతికరంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరొచ్చింది. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామి ఇదే నక్షత్రంలో జన్మించినందున శ్రీవారి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి, ఆయన సతీమణి లక్ష్మీదేవి, సోదరి గౌరికి ఇదే మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో పలు ఆలయాల్లో సామూహిక వ్రతాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణంలో వచ్చే మంగళవారాలతో పాటూ శుక్రవారాలు, శనివారాలు ఆలయాలు ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడుతాయి. (చదవండి: 'మామ్పవర్ 360’.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి..) శ్రావణంలో వచ్చే పండుగలివే.. శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. వచ్చే నెల 1న రానున్న నాగుల చవితితో పర్వదినాలు ఆరంభమవుతాయి. మరుసటి రోజుననే గరుడ పంచమిని జరుపుకుంటారు. 5న వరమాలక్ష్మీ వ్రతం, 12న రక్షాబంధనం (రాఖీ పౌర్ణిమ), 18, 19 తేదీల్లో వచ్చే శ్రీకృష్ణజన్మాష్టమితో పాటూ బలరామ జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి పండుగలు వరుసగా ఆనందాలను తెచ్చేవే. మాసం చివరిరోజున కూడా పొలాల అమావాస్యను జరుపుకోవడం ఆనవాయితీ. వ్రతాలకు శ్రావణమాసాన్ని ఎంచుకోవడంలో ఆరోగ్యపరమైన కారణాలున్నాయని, ప్రత్యేక పూజలకు సన్నాహాలు చేస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. (చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?)