రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ -రాధికల వివాహం శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ పెళ్లి సందడికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అత్యంత లగ్జరీయస్‌గా జరిగిన ఈ వివాహానికి సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు, రాజకీయనాయకులు హాజరయ్యారు.
అయితే ప్రస్తుతం నెట్టింట ముఖేశ్ అంబానీ ఇంట జరిగిన ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆషాడంలో పెళ్లిళ్లు చెయ్యరు. అందులోనూ కొత్త కోడలు అత్తారింట ఉండనే ఉండకూదు. అసలు ఈ మాసం మూఢంతో సమానమని. ఎలాంటి వివాహ తంతు లేదా అందుకు సంబంధించిన ఏ పనులు చెయ్యరు. మరీ అలాంటిది ముఖేశ్ ఉండి ఉండి మరీ ఇలా ఆషాడంలో పెళ్లి చేయడం ఏంటనీ సర్వత్రా చర్చించుకుంటున్నారు.
కారణం ఏంటంటే..
ఇక్కడ అనంత్ రాధికల పెళ్లి ముహుర్తం ధృక్ గణితం ఆధారంగా ముహర్తం నిర్ణయించారు పండితులు. దీన్ని సూర్యమానం ప్రకారం నిర్ణయిస్తారు. వాస్తవానికి దక్షిణాది వారు చాంద్రమానం ప్రకారం ముహుర్తాలు నిర్ణయించగా..ఉత్తరాది వారు సూర్యమానం ఆధారంగా పంచాంగం నిర్ణయిస్తారు. అలాగే చాంద్రమాన పంచాగంలో ఉన్నట్లు అధిక మాసాలు అంటూ..ఈ సూర్యమాన పంచాంగంలో ఉండనే ఉండవు. పైగా ఆయా ప్రాంతాల వారీగా అది ఆషాడ మాసం కాదు.
ఇక అనంత్ రాధికల పెళ్లి జూలై 12 శుక్రవారం మేషరాశిలో చంద్రుడు సంచారం, సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణిస్తుంటాడు చంద్రుడు రాత్రి వృషభరాశిలో సంచారం. పైగా ఇది పమరమిత్ర తార కలిగిన శుభఘడియలు కూడా. కావున పండితులు ఈ ముహర్తం వివాహానికి అత్యంత శుభప్రదమని చెబుతున్నారు. అందువల్లే ఆషాడంలో కూడా అంబానీ ఇంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అనంత రాధికల వివాహం జూలై 12 శుభ్ వివాహ్‌తో మొదలయ్యి..జూలై 13 శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ మహోత్సవంతో ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment