గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో జయమాల ఇతర ఘట్టాలు విజయవంతంగా ముగిసాయి. దీంతో అధికారంగా రాధిక మర్చంట్ అనంత్ భార్య, అంబానీ ఇంట చిన్న కోడలిగా అవతరించింది. అయితే ఈ వివాహ వేడుకలో వరుడి తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ పట్టుకున్నదీపం హాట్ టాపిక్‌గా నిలిచింది.
నీతా అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చినప్పుడు, సంప్రదాయ రామన్ డివో దీపంతో కనిపించారు. గుజరాతీ వివాహాలలో రామన్ డివో ఒక ముఖ్యమైన భాగం. గుజరాతీ ప్రజలు ప్రతి శుభ కార్యంలో దీనిని ఉపయోగిస్తారు. ఆచారాన్ని సంప్రదాయాలను కచ్చితంగా పాటించే నీతా కూడా వివాహ వేదిక వద్దకు వరుడు తరలి వెళ్లే సమయంలో గణేశ విగ్రహంతో ఉన్న రామన్ దీపాన్ని తీసుకెళ్లాడు. ఇది చీకటిని పారదోలి, సకల శుభాలు కలుగ జేస్తుందని, కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందించే మంగళదీపంగా నమ్ముతారు.
ఈ సందర్భంగా తల్లిగా నీతా అంబానీ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వివాహానికి వచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. అనంత్ రాధిక శాశ్వత బంధంలోకి అడుగు పెడుతున్న తరుణంలో తన మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందనీ, భక్తిభావంతో ఉప్పొంగుతోంది అంటూ ఉద్వేగంగా చెప్పారు. హిందూ సంప్రదాయంలో వివాహం అంటే ఏడేడు జన్మల వాగ్దానం అని వివరించారు. గతంలో కూడా నీతా ఈ దీప ఆచారాన్ని పాటించారు. అలాగే పెళ్లికి తరలివెళ్లేముందు తన తాతగారు ధీరు భాయి అంబానీకి ప్రత్యేక నివాళులర్పించాడు వరుడు అనంత్.
ఈ సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ ధరించిన జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన అందమైన పీచ్ కలర్ సిల్క్ గాగ్రా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. అనంత్ పెళ్లి వేడుకల్లో నీతా ఆనందంతో నృత్యం చేయడం విశేషం.
#WATCH | Mumbai: Chairperson of Reliance Foundation Nita Ambani, Industrialist Mukesh Ambani along with family and guests shake a leg at the wedding ceremony of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/bD1pZH2vmw
— ANI (@ANI) July 13, 2024
Comments
Please login to add a commentAdd a comment