Lamps shine
-
కుమారుడి పెళ్లిలో నీతా అంబానీ చేతిలో మంగళ దీపం: విశేషం ఇదీ!
గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో జయమాల ఇతర ఘట్టాలు విజయవంతంగా ముగిసాయి. దీంతో అధికారంగా రాధిక మర్చంట్ అనంత్ భార్య, అంబానీ ఇంట చిన్న కోడలిగా అవతరించింది. అయితే ఈ వివాహ వేడుకలో వరుడి తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ పట్టుకున్నదీపం హాట్ టాపిక్‌గా నిలిచింది.నీతా అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చినప్పుడు, సంప్రదాయ రామన్ డివో దీపంతో కనిపించారు. గుజరాతీ వివాహాలలో రామన్ డివో ఒక ముఖ్యమైన భాగం. గుజరాతీ ప్రజలు ప్రతి శుభ కార్యంలో దీనిని ఉపయోగిస్తారు. ఆచారాన్ని సంప్రదాయాలను కచ్చితంగా పాటించే నీతా కూడా వివాహ వేదిక వద్దకు వరుడు తరలి వెళ్లే సమయంలో గణేశ విగ్రహంతో ఉన్న రామన్ దీపాన్ని తీసుకెళ్లాడు. ఇది చీకటిని పారదోలి, సకల శుభాలు కలుగ జేస్తుందని, కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందించే మంగళదీపంగా నమ్ముతారు. ఈ సందర్భంగా తల్లిగా నీతా అంబానీ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వివాహానికి వచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. అనంత్ రాధిక శాశ్వత బంధంలోకి అడుగు పెడుతున్న తరుణంలో తన మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందనీ, భక్తిభావంతో ఉప్పొంగుతోంది అంటూ ఉద్వేగంగా చెప్పారు. హిందూ సంప్రదాయంలో వివాహం అంటే ఏడేడు జన్మల వాగ్దానం అని వివరించారు. గతంలో కూడా నీతా ఈ దీప ఆచారాన్ని పాటించారు. అలాగే పెళ్లికి తరలివెళ్లేముందు తన తాతగారు ధీరు భాయి అంబానీకి ప్రత్యేక నివాళులర్పించాడు వరుడు అనంత్. ఈ సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ ధరించిన జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన అందమైన పీచ్ కలర్ సిల్క్ గాగ్రా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. అనంత్ పెళ్లి వేడుకల్లో నీతా ఆనందంతో నృత్యం చేయడం విశేషం. #WATCH | Mumbai: Chairperson of Reliance Foundation Nita Ambani, Industrialist Mukesh Ambani along with family and guests shake a leg at the wedding ceremony of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/bD1pZH2vmw— ANI (@ANI) July 13, 2024 -
దీప యజ్ఞం సక్సెస్
న్యూఢిల్లీ: దీప కాంతిలో భారతావని వెలుగులీనింది. కరోనా రక్కసి అంతానికి దేశ ప్రజలంతా ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌పై అలుపెరగని పోరుకు సంఘీభావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘దీప యజ్ఞం’ విజయవంతమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు వెలిగించి కరోనా రాక్షసిని అంతమొందించే ఉమ్మడి సంకల్పానికి ఘనంగా సంఘీభావం తెలిపారు. కోట్లాది భారతీయులు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి 9 నిమిషాల పాటు తమ ఇళ్ల ముందు, బాల్కనీల్లో దీపాల వెలుగులను విరజిమ్మి, మహమ్మారిపై పోరులో విజయమే లక్ష్యమని ప్రతిన బూనారు. ప్రధాని మోదీ కూడా తన ఇంటిముందు దీప స్థంభాన్ని వెలిగించి, కరోనాపై కదనంలో ముందుంటానని దేశ ప్రజలకు ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ దీప యజ్ఞంలో మమేకమయ్యారు. తమ నివాసాల్లో దీపాలను వెలిగించి, ప్రధాని మోదీ సంకల్పానికి సంఘీభావం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాణాసంచా కాల్చడం, హిందూ ప్రార్థనా గీతాలను, మంత్రాలను వినిపించడం కూడా కనిపించింది. మరికొన్ని చోట్ల జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు, తమ ఇళ్లల్లోని విద్యుద్దీపాలను ఆర్పేసి, ఇంటి ముందు దీపాలు, కొవ్వొత్తులు, లేదా మొబైల్ టార్చ్‌లు వెలిగించి కరోనాను తరిమికొట్టే తమ ఉమ్మడి సంకల్పాన్ని ఘనంగా ప్రకటించాలని శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ సేఫ్ దేశవ్యాప్తంగా ఇళ్లల్లో విద్యుద్దీపాలను ఒకేసారి 9 నిమిషాల పాటు ఆర్పేసే కార్యక్రమం జరిగినప్పటికీ.. విద్యుత్ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. డిమాండ్‌లో ఒకేసారి భారీగా తగ్గుదల, 9 నిమిషాల అనంతరం ఒకేసారి అదే స్థాయిలో పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ.. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సిద్ధమై, అవసరమైన చర్యలు తీసుకుందన్నారు. ‘గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. నేను, మా శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించాం. సమర్ధవంతంగా ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఎన్ఎల్డీసీ, ఆర్ఎల్డీసీ, ఎస్‌ఎల్‌డీసీల్లోని ఇంజినీర్లందరికి అభినందనలు’ అని సింగ్ పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా 117 గిగావాట్ల నుంచి 85.3 గిగావాట్లకు తగ్గిపోయింది. అంటే 30 గిగావాట్లకు పైగా డిమాండ్ తగ్గింది. ఇది మేం తగ్గుతుందని ఊహించిన 12 గిగావాట్ల కన్నా చాలా ఎక్కువ’ అని ఆయన వివరించారు. దీప యజ్ఞం సందర్భంగా ఒకేసారి విద్యుత్ వినియోగం తగ్గితే గ్రిడ్ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. సరుకుల రవాణాకు సహకరించండి నిత్యావసరాల రవాణాలో కీలకమైన ట్రక్ డ్రైవర్లు, ఇతర కూలీలు తమ పని ప్రదేశాలకు వెళ్లేందుకు సహకరించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అప్పుడే నిత్యావసరాల సరఫరా సజావుగా సాగుతుందని పేర్కొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భూత్ బంగ్లా
నిజాలు దేవుడికెరుక: బ్రిటన్... 1735. నార్ఫోక్లోని రేనమ్ హాల్ దీపాల కాంతితో వెలిగిపోతోంది. భవంతి అలంకరణ కళ్లు చెదరగొడుతోంది. ఆ వైభవం చూపరుల మతి పోగొడుతోంది. ‘‘ఏదేమైనా... ఇలాంటివి చేయాలంటే మీ తర్వాతే ఎవరైనా’’... వైన్‌ని సిప్ చేస్తూ అన్నాడు కల్నల్ లోఫ్తస్. లార్డ్ చార్ల్స్ టౌన్సెన్డ్ ముఖం ప్రసన్నమయ్యింది. ‘‘ఏదో మీ అభిమానంలెండి’’ అన్నాడు గ ర్వాన్ని కప్పిపుచ్చుతూ.‘‘భలేవారే... అభిమానంతో లేనిది చెబుతామా ఏంటి! క్రిస్మస్ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్‌గా చేయడం నేనెప్పుడూ వినలేదు, కనలేదు. ఎంతయినా మీరు గ్రేట్.’’ ఉప్పొంగిపోయాడు చార్ల్స్. అతడికీ కల్నల్కీ మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే అందరూ బయట లాన్లో ఉంటే, అతడిని మాత్రం లోనికి తీసుకొచ్చి ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్నాడు. ‘‘ఏంటి ఫ్రెండ్సిద్దరూ స్పెషల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు’’ అంటూ వచ్చిన హాకిన్స్‌ను చూసి ఆ ఆనందంలోంచి బయటకు వచ్చాడు చార్ల్స్. ‘‘అలాంటిదేమీ లేదు మిస్టర్ హాకిన్స్. మీరూ మాతో జాయిన్ కావచ్చు’’ అన్నాడు మరో వైన్ గ్లాస్‌ని చేతిలోకి తీసుకుని హాకిన్స్కి అందిస్తూ. ముగ్గురూ కబుర్లలో పడ్డారు. అంతలో ఎవరో పిలుస్తున్నారని పనివాడు వచ్చి చెప్పడంతో బయటకు వెళ్లాడు చార్ల్స్. లోఫ్తస్, హాకిన్స్ పెగ్గు మీద పెగ్గు వేస్తున్నారు. ‘‘పార్టీ అదిరిపోయింది లోఫ్తస్. లార్డ్ చార్ల్స్ దారి ఎవరికీ రాదనుకో’’... వైన్ గొంతు జారుతుంటే చార్ల్స్ మీద అభిమానం పొంగుకొచ్చింది హాకిన్స్కి. ‘‘అది సరే కానీ... ఆవిడెవరు’’ అన్నాడు హాకిన్స్ నోటికెత్తబోయిన గ్లాసుని అలాగే పట్టుకుని. అతడు చూస్తున్నవైపే దృష్టి సారించాడు లోఫ్తస్. వయ్యారంగా మెట్లు దిగుతోందో సౌందర్యరాశి. పాల నురుగు లాంటి తెల్లని గౌనులో దేవకన్యలా కనిపిస్తోంది. గాలికి ఎగురుతున్న ముంగురులు ఆమె ముఖాన్ని కప్పేస్తున్నాయి. ‘‘నిన్నే... ఎవరావిడ? చార్ల్స్ బంధువా?’’... లోఫ్తస్ మాట్లాడకపోయేసరికి రెట్టించాడు హాకిన్స్. అప్పటికీ సమాధానం రాకపోవడంతో లోఫ్తస్ వైపు చూశాడు హాకిన్స్. అంతే... షాక్ తిన్నాడు.లోఫ్తస్ వణికిపోతున్నాడు. ముఖమంతా చెమటలు పోస్తున్నాయి. కళ్లనిండా భయం. చేత్తో గుండెను పట్టుకుని విలవిల్లాడుతున్నాడు. అతణ్ని అలా చూడగానే భయం వేసింది హాకిన్స్కి. బయటకు పరుగెత్తి చార్ల్స్ని పిలిచాడు. అతిథుల్లో ఓ వైద్యుడు ఉండటంతో అతడిని తీసుకొచ్చాడు చార్ల్స్. వెంటనే చికిత్స చేయడంతో లోఫ్తస్ లేచి కూచున్నాడు. ‘‘ఏమైంది కల్నల్... సడెన్‌గా అలా అయిపోయావేంటి?’’... అడిగాడు చార్ల్స్ అనునయంగా. ‘‘నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి. అందరినీ బయటకు వెళ్లమను.’’ ‘‘ఒంటరిగానా... ఏమైంది?’’ ‘‘ప్లీజ్ చార్ల్స్. వెళ్లమను. నువ్వు మాత్రమే ఉండు నా దగ్గర. త్వరగా...’’ అందరికీ బయటకు పంపేశాడు చార్ల్స. ‘‘ఇప్పుడు చెప్పు... ఏమైంది?’’ అన్నాడు పక్కన కూచుని. ‘‘చార్ల్స్... డొరొతీ...’’ అతడి మాట పూర్తి కాకముందే చివ్వున లేచి నిలబడ్డాడు చార్ల్స్. ‘‘ఇప్పుడు తన గురించి ఎందుకు? కొంపదీసి తాగిన మత్తులో ఆ హాకిన్స్గాడి దగ్గర ఏదైనా వాగేశావా?’’ కోపంగా అన్నాడు. ‘‘కాదు. నేను డొరొతీని చూశాను.’’ ‘‘అవును చూశావు. ఒక్కసారి కాదు, బోలెడుసార్లు. అయితే ఏంటట?’’ ‘‘అరే భగవంతుడా... నేను చూసింది ఎప్పుడో కాదు. ఇప్పుడే... ఈ హాల్లోనే...’’ ‘‘వ్వా...ట్’’... కరెంట్ షాక్ తిన్నట్టు అదిరిపడ్డాడు చార్ల్స్. ‘‘నీకేమైనా మతిపోయిందా? డొరొతీని ఇప్పుడు చూడ్డమేంటి? అది చచ్చి తొమ్మిదేళ్లయ్యింది కదా?’’ విసుగ్గా అన్నాడు. ‘‘లేదు చార్ల్స్. తనే. కచ్చితంగా తనే. నేను చూశాను. తెల్ల గౌను వేసుకుని మెట్లమీది నుంచి దిగుతోంది. తనని చూసిన షాకులోనే నాకు ఛాతీనొప్పి వచ్చింది.’’ లోఫ్తస్ ముఖంలోని భయాన్ని చూస్తుంటే అతడు చెప్పింది ముమ్మాటికీ నిజమేనని అర్థమవుతోంది చార్ల్స్‌కి. పైగా అతడు పొరపాటు పడడు. ఎందుకంటే... డొరొతీ గురించిన నిజం అతడికి తెలుసు. అంటే డొరొతీ... దెయ్యమైందా? ఇక్కడిక్కడే తిరుగుతోందా? మరి తనకెందుకు కనిపించడం లేదు? తననింతవరకూ ఎందుకు ఏమీ చెయ్యలేదు? ఆలోచనలతో చార్ల్స్ మెదడు బరువెక్కింది. డొరొతీ రూపం కళ్లముందు కనిపించి కంగారుపెడుతోంది. అసలింతకీ ఎవరీ డొరొతీ? ఎవరీ చార్ల్స్? ఏం జరిగింది వారి మధ్య? ఎగసిపడే ఉత్సాహం, వర్ణనకు అందని సౌందర్యం, ఎంతటి వారినైనా కట్టిపడేసే ఆకర్షణ... ఇవన్నీ కలిస్తే డొరొతి. 1686లో బ్రిటన్‌లో పుట్టిన ఈ అతిలోక సుందరి... నాటి బ్రిటన్ ప్రధాని రాబర్ట్ వాల్పోల్ సోదరి. ఆమె అద్భుతమైన అందం యువరాజు చార్ల్స్ టౌన్షెన్డ్ని ఆకర్షించింది. డొరొతీ కూడా చార్ల్స్ని ప్రేమించింది. కానీ చార్ల్స తల్లిదండ్రులు చార్ల్స్‌కి ఎలిజబెత్ అనే మహిళతో వివాహం చేసేశారు. తట్టుకోలేకపోయింది డొరొతీ. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయింది. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి వార్టన్ వచ్చాడు. అతడు డొరొతీని ఇష్టపడ్డాడు. ఆమెను మామూలు మనిషిని చేశాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. డొరొతీ అతడికి దగ్గరయ్యింది. అయితే అంతలో చార్ల్స్ మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. తన భార్య ఎలిజబెత్ మరణించడంతో డొరొతీని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈసారి ఎవరు కాదన్నా లెక్కచేయనంటూ ఆమె చేతిని అందుకున్నాడు. అయితే అప్పటికే డొరొతీ మనసులో అతడి స్థానాన్ని వార్టన్ ఆక్రమించుకున్నాడు. చార్ల్స్ బలవంతంగా పెళ్లయితే చేసుకున్నాడు గానీ, ఆమె మనసు నుంచి వార్టన్‌ను తీసేయలేకపోయాడు. ఆ విషయం అతడు గ్రహించలేకపోయాడు. పిల్లలు పుట్టారు. వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు. అప్పటికి గానీ డొరొతీ, వార్టన్ల వ్యవహారం చార్ల్స్‌కి తెలియలేదు. కానీ తెలిశాక పెద్ద రణరంగమే సృష్టించాడు. డొరొతీ మీద విరుచుకుపడ్డాడు. ఆమెను చిత్రహింసలు పెట్టి రేనమ్ హాల్లోని ఓ గదిలో బంధించాడు. తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. ఎవరినీ కలవనిచ్చేవాడు కాదు. కనీసం పిల్లలను కూడా చూపించేవాడు కాదామెకి. దాంతో గదిలోపలే కృశించిపోయింది డొరొతీ. తన పరిస్థితికి లోలోపలే కుంగిపోయింది. పెద్దగా ఏడ్చేది. తనను క్షమించి వదిలిపెట్టమని గట్టిగట్టిగా అరిచేది. కానీ ఆమె ఆర్తనాదాలు, ఆవేదనాపూరిత కేకలు గోడలు దాటి వెలుపలికి వచ్చేవి కావు. రేనమ్ హాల్ అనేది టౌన్షెన్డ్ వంశస్థుల రాజప్రాసాదం కావడంతో అందులోకి బయటివాళ్లు వచ్చేవారు కూడా కాదు. దాంతో డొరొతీ గురించి ఎవరికీ తెలిసే అవకాశమే లేకపోయింది. కొన్ని రోజుల తరువాత డొరొతీకి పొంగు చూపింది. నరకం అనుభవించింది. ఒక్కసారి వైద్యుణ్ని పంపించమని ఆమె ఎంత బతిమాలినా చార్ల్స్ వినిపించుకోలేదు. దాంతో ఆరోగ్యం క్షీణించి, నలభయ్యేళ్ల వయసులో కన్నుమూసింది డొరొతీ. ఈ లోకం నుంచి, ఆ నరకం నుంచి శాశ్వతంగా విముక్తి పొందింది. అయితే రేనమ్ హాల్లో డొరొతీ పట్ల ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు... చార్ల్స్‌కి అత్యంత ఆప్తుడైన లోఫ్తస్కి తప్ప. అనారోగ్యంతో చాలాకాలం పాటు మంచానికే పరిమితమయ్యిందని, చివరికి అనారోగ్యంతోనే మరణించిందని ప్రపంచాన్ని నమ్మించారు. కానీ ఆ నిజం నీడలా తమని వెంటాడుతుందని వాళ్లు అప్పుడు ఊహించలేకపోయారు. చనిపోయిన తొమ్మిదేళ్ల తరువాత, క్రిస్మస్ పార్టీ చేసుకుంటున్నప్పుడు డొరొతీ ఆత్మ లోఫ్తస్కు కనిపించడంతో కలవరపడ్డాడు చార్ల్స్. అయితే అదంతా భ్రమ కూడా కావొచ్చనుకున్నాడు. కానీ ఆ తరువాత డొరొతీ వరుసగా కనిపిస్తూనే ఉంది. తెల్లని దుస్తులు వేసుకుని, జుత్తు విరబోసుకుని ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటే భయంతో వణికిపోయేవాడు చార్ల్స్. లోఫ్తస్కి కూడా ఆమె చాలాసార్లు కనిపించింది. ఎక్కువగా పైనుంచి హాల్లోకి రావడానికి ఉపయోగించే మెట్ల మీద కనిపిస్తుండేది. అయితే... 1738లో చార్ల్స్ చనిపోయేవరకూ కూడా ఆమె అతడిని ఏమీ చేయలేదు. అతడిననే కాదు... ఆమె ఎవరినీ ఏమీ చేయలేదు. చార్ల్స్ మరణించిన తరువాత అతడి తరువాతి వారసులు ఆ మహల్‌ని సొంతం చేసుకున్నారు. అయినా కూడా డొరొతీ అక్కడ్నుంచి వెళ్లిపోలేదు. అక్కడే ఉంది. ఇల్లంతా తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి చేతిలో దీపం పట్టుకుని సంచరించేది. కొన్నిసార్లు బ్రౌన్ కలర్లో నీడలా అలా అలా కదిలిపోతూ కనిపించేది. అందుకే ఆమెను ‘బ్రౌన్ లేడీ ఘోస్ట్’ అనేవారు. కొందరు ఆమెని చూడటం కోసం కావాలని ఆ భవనంలో రాత్రుళ్లు గడిపేవారు. కొందరైతే ఆమె ఉందని, లేదని పందాలు వేసుకునేవారు. ఒకసారి ఇద్దరు ఫొటోగ్రాఫర్లు కూడా అలానే పందెం వేసుకున్నారు. ఓ రాత్రంతా కెమెరాలు పట్టుకుని రేనమ్ హాల్లో తిరిగారు. లోపల పలు ప్రదేశాల్లో వందలాది ఫొటోలు తీశారు. డొరొతీ ఆత్మను మాత్రం చూడలేకపోయారు. కానీ స్టూడియోకి వెళ్లి ఫొటోలు డెవెలప్ చేస్తున్నప్పుడు అదిరిపడ్డారు. ఓ ఫొటోలో మెట్లు దిగుతున్న దెయ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని చూసి షాకైపోయారిద్దరూ. ‘కంట్రీ లైఫ్ మ్యాగజైన్’లో ఆ ఫొటోని ప్రచురించారు. దాన్ని చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ఇప్పటికీ ఆమె ఆత్మ రేనమ్ హాల్లో ఉందంటారు. అయితే ఆమె అక్కడ ఇంకా ఎందుకుంది, ఏం కోరుకుంటోంది, దేనికోసం వెతుకుతోంది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికీ ఏ కీడూ ఎందుకు చేయదో కూడా అర్థం కాదు. ఆమె జీవితం ఎంత రహసంగా ముగిసిందో... నేటి ఆమె ఉనికి కూడా ఓ రహస్యంలా మిగిలింది! - సమీర నేలపూడి