
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంతో వైభవంగా చేశారు. ఈ పెళ్లికి సుమారు ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.
జులై 12న జరిగిన వివాహానికి దేశాధినేతలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, సినీ తారలు, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు దాదాపు అందరూ హాజరయ్యారు. కొంతమంది అతిధులకు అంబానీ ఏకంగా రూ. 2 కోట్ల ఖరీదైన వాచ్‌లను కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. అనంత్, రాధికల ఒక్కో పెళ్లి కార్డు కోసమే అంబానీ రూ. 6.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.
అంబానీ ధనవంతుడు.. కొడుకు పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. అయితే అంబానీది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే?.. రాధిక మర్చంట్‌తో.. అనంత్ అంబానీ పెళ్లి ఎలా జరిగేది? అనే ప్రశ్న బహుశా కొంతమంది మదిలో మెదిలే ఉంటుంది. ప్రశ్న పుట్టగానే.. సమాధానం అందించడానికి మన ఏఐ ఉంది కదా. ఇట్టే ఫోటోలను విడుదల చేసేసింది. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేసేయండి..
Comments
Please login to add a commentAdd a comment