
ఆషాఢ మాసం
ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒక గడప దాట కూడదని, అత్తా అల్లుళ్లు ఒకరికొకరు ఎదురు పడకూడదని, కొత్త దంపతులు కలవకూడదనీ అంటారు. ఎందుకంటే..?
సాధారణంగా వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులుప్రారంభిస్తారు. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో ఉంటే, సకాలంలో పనులు జరగవు.
వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటిలా కాల్వల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే కష్టం కదా... అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు. అంతేకాకుండా, కొత్త నీరు వచ్చే ఆషాఢంలో ఆ నీరు తాగటం వల్ల రకరకాల రుగ్మతలకు లోను కావచ్చు.
అంతేకాదు, ఈ కాలంలో గర్భధారణ జరిగితే పిల్లలు కలిగే నాటికి మంచి ఎండాకాలం... శిశువు పెరగటానికి అంత మంచి వాతావరణం కాదు అని ఆలోచించారు. అందుకే ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి రోజులకు అన్వయించుకుంటే... వ్యవసాయదారుల కుటుంబాలు కాకుండా ఇతరుల విషయంలో ఈ ఇబ్బంది లేదు.
ఇవి చదవండి: పబ్‌లో.. ఫస్ట్ టైమ్!