
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి సారెను సమర్పించేందుకు శుక్రవారం తరలివచ్చారు

ఉదయం నుంచి సాయంత్రం వరకు బృందాలుగా ఆలయానికి వచ్చి అమ్మవారికి సారెతో పాటు పూలు, పండ్లు, పలహారాలు, పసుపు, కుంకుమ సమర్పించారు

అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు

ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని సారెను చూపుతున్నారు

అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి పూజలు చేయించుకుంటున్నారు



