
దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి

ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి

అనంతరం వసంతోత్సవాన్ని నిర్వహించగా, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది ఒకరిపై మరొకరు గులామ్‌లు చల్లుకుంటూ వేడుకను ఉత్సాహంగా నిర్వహించారు

అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీపై ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్లారు

దుర్గాఘాట్‌లో పవిత్ర కృష్ణానదిలో గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు అవభృదోత్సవాన్ని నిర్వహించారు



































