
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి

శుక్రవారం రద్దీకి తోడు ఆషాఢ సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది

ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ప్రధాన ఆలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు

తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, ఛండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు

అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పలువురు భక్తులు సారెను సమర్పించారు











