ఆషాఢమాసపు వర్షపు జల్లులకు కొత్త చివుర్లు తొడిగి, నిండా ఆకులతో ఉల్లాసంగా కనిపిస్తుంది గోరింట చెట్టు. అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరిన నవ వధువు, మరదలిని ఆటపట్టించే వదినలు, ఆజమాయిషీ చేస్తూ తిరిగే అత్తలు, ఆటపాటలతో సందడి చేసే యువతులు.. అందరినీ కట్టిపడేసి కుదురుగా కూర్చోబెట్టి, ఎర్రని పంట కోసం ఎదురు చూపుల సహనాన్ని అలవాటు చేస్తుంది గోరింట.
ఈ కాలమే ఎందుకంటే..
⇒ ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. అలాగే, చల్లబడిన బయటి వాతావరణానికి, శారీరక వేడికి సమతుల్యత లోపిస్తుంది. దీనిని బ్యాలెన్స్ చేసే శక్తి గోరింటాకుకు ఉంటుందనేది పెద్దలు చెప్పే మాట.
⇒వర్షాల కారణంగా నీళ్లలో తరచూ పాదాలు తడుస్తుంటాయి. ఇలాంటప్పుడు పాదాల చర్మానికి సూక్ష్మ క్రిముల వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
⇒గోళ్లకు కూడా గోరింటాకు పెట్టడం వల్ల గోళ్లు పెళుసు బారడం, గోరుచుట్టు రావడం వంటి సమస్యలు దరిచేరవు.
⇒ఎర్రగా పండిన చేతులను చూసుకొని ఎంతగానో మురిసి΄ోయే వనితలు గోరింటాకును సౌభాగ్యానికి ప్రతీకగానూ భావిస్తారు. గోరింటాకు ్రపాముఖ్యతను తెలుసుకోవడమే కాదు మహిⶠలంతా ఒకచోట చేరి, వేడుకలా మార్చుకుంటున్నారు. వివాహ వేడుకల్లో మెహిందీ ఫంక్షన్‌కు ఉన్న ్ర΄ాధాన్యత ఆషాఢం గోరింటాకుకూ వర్తింపజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment