gorintaku
-
అతివల అరచేత... అందాల అరుణోదయం
సాక్షి, అనకాపల్లి : తెలుగు లోగిళ్లలో పండుగ అయినా, పబ్బమైనా అమ్మాయిల చేతులు, కాళ్లకు గోరింటాకు తప్పనిసరి. పెళ్లికాని యువతి చేతికి గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని..గర్భిణుల అరచేతులు ఎర్రగా మారితే కట్టుకున్నవాడికి చాలా ప్రేమ ఉన్నట్టు అని చమత్కరిస్తారు. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి సంబరంగా గోరింటాకు నూరి చేతుల నిండా పెట్టుకుంటూ కబుర్లు చెబుతూ తెగ సందడి చేస్తారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే రుతువు మారిన వేళ కాళ్లు, చేతులు, గోళ్లు శుభ్రపడతాయని, రోగ నిరోధకంగా పనిచేయడంతో అంటువ్యాధులను కూడా దూరం చేస్తుందని వైద్యులు సైతం చెబుతున్నారు. ఈ ఆషాఢంలో మహిళలు, యువతులు, చిన్నారులు, విద్యార్థినుల చేతులు గోరింటాకుతో కళకళలాడుతున్నాయి. ఒకరికొకరు పోటీపడి మరీ గోరింటాకు పెట్టుకుంటున్నారు. విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు, గ్రామాల్లో ప్రత్యేక సంబరాలే జరుగుతున్నాయి.సంప్రదాయం...ప్రకృతి హితంప్రకృతి హితమైన గోరింటాకు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీష్మ రుతువు చివర వర్ష రుతువు ప్రారంభానికి మధ్యలో ఆషాఢం వస్తుంది. ఈ సమయంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతుంది. ఈ కారణంగా గోరింటాకును అరచేతుల్లో ధరిస్తే శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. చర్మ సమస్యలు కూడా దరిచేరవు. ఎన్నో ఔషధ లక్షణాలు గల ఈ గోరింటాకు అతివలకు అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. గోరింటాకు చేతులు, పాదాలకు పెట్టుకుంటే శరీరంలోని వేడిని, వాతాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్కు ఇది మందులా పనిచేస్తుంది. సెగ గెడ్డలు వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఈ ఆకు నూరి పెట్టుకుంటే అవి పగిలిపోతాయి. పుండు త్వరగా మానిపోతుంది. తలకు కూడా ఈ పేస్టు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.గోరింటా పండింది..! ‘గోరింట పూసింది కొమ్మ లేకుండా..మురిపాల అరచేత మొగ్గ తొడిగింది’.. అన్నాడో సినీ కవి. ఆషాఢం వచ్చిందంటే చాలు..గొరింటాకు గుర్తుకొస్తుంది. అతివలు అరచేతికి గోరింట పెట్టుకుని మురిసిపోతుంటారు. కుటుంబాలు కలివిడిగా ఉంటూ, బంధాలు బలోపేతం చేసుకునే వేడుకగా దీన్ని పూర్వీకులు నిర్వచిస్తారు. తెలుగు సంప్రదాయంలో భాగమైన ఈ వేడుకలో ఆరోగ్య సూత్రాలెన్నో దాగి ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న గోరింటాకు వేడుకలు గ్రామీణ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. -
Ashada Masam: గోరింటా పూసిందీ...
ఆషాఢమాసపు వర్షపు జల్లులకు కొత్త చివుర్లు తొడిగి, నిండా ఆకులతో ఉల్లాసంగా కనిపిస్తుంది గోరింట చెట్టు. అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరిన నవ వధువు, మరదలిని ఆటపట్టించే వదినలు, ఆజమాయిషీ చేస్తూ తిరిగే అత్తలు, ఆటపాటలతో సందడి చేసే యువతులు.. అందరినీ కట్టిపడేసి కుదురుగా కూర్చోబెట్టి, ఎర్రని పంట కోసం ఎదురు చూపుల సహనాన్ని అలవాటు చేస్తుంది గోరింట.ఈ కాలమే ఎందుకంటే..⇒ ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. అలాగే, చల్లబడిన బయటి వాతావరణానికి, శారీరక వేడికి సమతుల్యత లోపిస్తుంది. దీనిని బ్యాలెన్స్ చేసే శక్తి గోరింటాకుకు ఉంటుందనేది పెద్దలు చెప్పే మాట. ⇒వర్షాల కారణంగా నీళ్లలో తరచూ పాదాలు తడుస్తుంటాయి. ఇలాంటప్పుడు పాదాల చర్మానికి సూక్ష్మ క్రిముల వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.⇒గోళ్లకు కూడా గోరింటాకు పెట్టడం వల్ల గోళ్లు పెళుసు బారడం, గోరుచుట్టు రావడం వంటి సమస్యలు దరిచేరవు. ⇒ఎర్రగా పండిన చేతులను చూసుకొని ఎంతగానో మురిసి΄ోయే వనితలు గోరింటాకును సౌభాగ్యానికి ప్రతీకగానూ భావిస్తారు. గోరింటాకు ్రపాముఖ్యతను తెలుసుకోవడమే కాదు మహిⶠలంతా ఒకచోట చేరి, వేడుకలా మార్చుకుంటున్నారు. వివాహ వేడుకల్లో మెహిందీ ఫంక్షన్‌కు ఉన్న ్ర΄ాధాన్యత ఆషాఢం గోరింటాకుకూ వర్తింపజేస్తున్నారు. -
Ashada Masam: గోరింట పండింది..
సప్తగిరికాలనీ(కరీంనగర్): గోరింట పూసింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గా తొడిగింది.. అన్నాడో సినీ కవి. ఆషాఢం వచి్చందంటే చాలు.. గోరింటాకు గుర్తుకొస్తుంది. ఈ మాసం గడిచేలోపు ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. అతివలు అరచేతులకు పెట్టుకొని మురిసిపోతుంటారు. శుభకార్యాలు, పండుగలు, ఆషాఢ మాసంలో మైదాకు పెట్టింది పేరు. అంతేకాదు.. ఔషధ గుణాలు గోరింటాకులో మెండు.ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సంబరంగా చేసుకొనే పండుగ. ఇటీవల కాలంలో మహిళలందరూ ఒకచోట చేరి మెహందీ పండుగను చేసుకోవడం, కిట్టీ పార్టీల్లో కూడా ఆషాఢ మెహందీ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లోని మగువ కిట్టీ పార్టీ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలను నగరంలోని మున్సిపల్ పార్క్‌లో ఘ నంగా చేసుకున్నారు. అందరూ ఒకచోట చేరి గోరింటాకును తయారు చేసి చేతులకు పెట్టుకుంటూ సందడి చేశారు. ఆషాఢ మాసం ఆరంభమైన సందర్భంగా ఆషాఢ మెహందీపై సాక్షి స్పెషల్ స్టోరీ. చర్మవ్యాధులు రాకుండా.. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధు ల బారి నుంచి రక్షించుకోవచ్చనేది ఆరోగ్య రహస్య ం. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట పొలాలు బురదమయమై క్రిమికీటకాలు పె రుగుతాయి. మహిళలు పొలంలో వరినాట్లు వేయ డం వల్ల చేతులు, కాళ్లకు బురద అంటుకుంటుంది. ఈ మాసంలో మైదాకు పెట్టకుంటే చర్మవ్యాధులు రా కుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆషాఢ ప్రత్యేకత.. ఆషాఢంలో ఏదో ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలన్నారు మన పూర్వీకులు. ఆనాటి సంప్రదాయాలు నేటికీ కొనసాగుతున్నాయి. గోళ్లకు రంగునిచ్చే గోరింటాకుకు సఖరంజని అని కూడా పేరుంది. నేటి ఆధునిక కాలంలో గోరింటాకు పేరుతో కోన్లు, పేస్టులు వస్తున్నాయి. అవి రంగును, అందాన్ని ఇస్తాయి తప్పా.. ఔషధ గుణాలుండవు. ప్రయోజనాలు.. మైదాకు వేళ్లకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెలుసుబారి పోకుండా కాపాడుతుంది. ఆకులే కాకుండా పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు కూడా ఔషధ యుక్తాలే. వీటితో శరీరంలో అలర్జీలను దూరం చేసుకోవచ్చు. బోధకాల వ్యాధి, ఏనుగు కాలు(లింపాటిక్ పైలేరియాసిస్) దరి చేరదు. ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకును బాగా నూరి పూస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నెలకోసారి గోరింటాకు ముద్దను తలకు ప్యాక్ వేసుకుంటే జట్టు బలపడి రాలదు. గోరింటాకు పాడి కాచిన నూనెను వాడడం చిట్కా వైద్యంలో ఒకటి. గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని తాకటం వల్ల అందులోని లాసోన్ అనే సహజమైన రసాయనంతో ఎరుపు రంగు ఏర్పడుతుంది. కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగు కలిగించే రసాయనాలు కలపడం వల్ల ఆరోగ్యం మాటెలా ఉన్నా.. కొన్ని అలర్జీలు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. తయారు చేసే విధానం మైదాకులో చింతపండు వేసి మధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ రోట్లో రుబ్బాలి. నాణ్యమైన గోరింటాకు ఎంచుకొని ఆకులు లేదా పొడిని వేడి నీళ్లలో కలిపి రాత్రంతా నానబెడితే మంచి రంగులో పండుతుంది. మెహందీ, హెన్నాకు కాఫీ పొడిని కలిపి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు పెట్టుకోవాలి. దీంతో కాఫీ బ్రౌన్ కలర్లో పండుతుంది. నిమ్మ రసంలో పంచదార వేసి చిక్కటి సిరప్ తయారు చేసుకోవాలి. మెహందీ చేతులకు పెట్టుకున్నాక తడారే సమయంలో లెమన్ షుగర్ సిరప్‌ను చేతులకు పెట్టుకోవాలి.మైదాకుతో ఆరోగ్యం పొలాల్లో పని చేసే మహిళలకు గోరింటాకు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఇ ప్పుడు రెడీమెడ్ రావడం, రసాయనిక పేస్టులు వాడటంతో చర్మవ్యాధు లు వస్తున్నాయి. కొత్తగా పెళ్లయిన యువతులు ఆషాఢంలో తల్లిగారింటికి వచ్చి గోరింటాకు పెట్టుకొని మురిసిపోవడం ఆనవాయితీ. పట్టణాల్లో చాలామంది కోన్లను ఉపయోగిస్తున్నారు. – శ్వేతమగువ కిట్టీ పార్టీ ఆధ్వర్యంలో.. మా మగువ కిట్టీ పార్టీ ఆ« ద్వర్యంలో ప్రతి సంవత్స రం ఒక పెద్ద పండుగ లా గా నిర్వహించుకుంటాం. అందరం ఒకచోట కలు సుకొని పూజలు నిర్వహిస్తాం. అనంతరం మెహందీని చేతులనిండా పె ట్టుకుంటాం. రోజంతా సంబరంగా గడుపుతాం. – చకిలం స్వప్నసంప్రదాయం.. ఔషధం మైదాకు చేతులకు పెట్టుకోవడం సంప్రదాయంతోపాటు మంచి ఔషధం. ఇది పూర్వం నుంచి వస్తు న్న ఆచారం. నేడు కోన్లు వచ్చాయి. యువతులు కావాలంటే కోన్లను వాడాల్సి వస్తుంది. మంచి కంపెనీలకు చెందిన గోరింటాకు కోన్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులుండవు. శుభకార్యాలకు మహి ళలు తప్పక మైదాకు పెట్టుకుంటున్నారు. – ఉమ అనాదిగా వస్తున్న ఆచారం గోరింటాకులో మంచి ఔష ధ గుణాలున్నాయి. ఇది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం మాత్రమే కాకుండా.. వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల సంభవించే శరీర రుగ్మతలను తొలగించే చక్కటి ఔషధం కూడా. అందుకే ఆషాఢంలో గోరింటాకును తప్పకుండా పెట్టుకుంటా. – సాహితి ఇష్టమైన పండుగ మెహందీ అంటే ఇష్టపడని మహిళలుండరు. పసి పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలివారి వరకు ప్రతిఒక్కరూ మైదాకును ఇష్టపడతారు. ప్రస్తత కాలంలో కోన్లు వచ్చినా ఆషాఢంలో మాత్రం గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటారు. – ప్రవళిక ఆషాఢ మాసంలో.. ఊహ తెలిసిన నుంచి ప్రతీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటున్నా. ఆ షాఢం వచి్చందంటే మా ఇంట్లో మైదాకు పండగ వాతావరణం అలుముకుంటుంది. ఆషాఢ మాసంలో మా చేతులన్నీ మెహందీలమయమవుతాయి. నెల మొత్తం పెట్టుకుంటాం. – లక్ష్మి -
ఆషాడంలోనే ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే?..
గోరింటాకు ఇష్టపడని అతివలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో!. పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్లు సమయంలలో మహిళల చేతులు రకరకాల గోరింటాకు డిజైన్లతో ఎర్రగా మెరిసిసోవాల్సిందే. అలాంటి గోరింటాకు ప్రత్యేకించి ఆషాడంలోనే కంప్లసరీగా ఎందుకు పెట్టుకుంటారు? అస్సలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? గోరింటాకు ప్రాముఖ్యత ఏమిటి? తదితరాల గురించి చూద్దామా!. పార్వతి దేవి రుధిరాంశతో జన్మించిందే గోరింటా గౌరిదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింత గూర్చి చెలులు పర్వతరాజు(హిమవంతుడు)కు చెప్పడంతో ఆయన సతీసమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోనే పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు. నా వలన లోకానికి ఏవిధమైన ఉపయోగం కలదు అని ఆ గౌరిదేవిని ప్రశ్నిస్తుంది. ఇంతలో పార్వతి దేవి చిన్నతనపు చలపతతో ఆ చెట్టు ఆకుని కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి. దీంతో పార్వతి తల్లిదండ్రులు అయ్యో బిడ్డా చేతుల కందిపోయాయి అని భాదపడుతుండగా..వెంటనే పార్వతి దేవి నాకు ఏవిధమైన భాద కలగలేదు. పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కనిపిస్తోంది అంటుంది. దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవ లోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధ చెందుతుందని అని ఆ వృక్షాన్ని ఆశ్వీరదిస్తాడు. అదీగాక గౌరిదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరింటాకుగా ఆ వృక్షాన్ని పిలిచేవారు. అది కాస్త కాలక్రమేణ అలంకారంగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాకుగా మారిపోయింది. అంతేగాదు గౌరిదేవి నీ వర్ణం కాళ్లు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది గనుక అదే నీ జస్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరం కూడా ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి జనులు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు, కాళ్లు అందంగా తీర్చిదిద్దుకునే అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు. అదే సమయంలో కుంకుమకు ఓ సందేహం కలుగుతుంది. నదుటన కూడా ఈ ఆకు పసరునే బొట్టుగా దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది. ఈ విషయమే గౌరిదేవికి చెప్పగా గోరింటాకు నుదుటన పెడితే పండదని చెబుతుంది. కావాలంటే పరీక్షించి చూడండి గోరింటాకు నిజంగానే నుదుటన పండదు. స్త్రీల ఆరోగ్యానికి ఔషధంలా.. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరేవేసే ప్రధాన నాడులు ఉంటాయి. అంతేగాదు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి. మంచి భర్త రావడానికి గోరింటాకుకి గల సంబంధం ఏమిటంటే.. స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోనుల పని తీరు చక్కగా ఉంటే దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. ఆ అందంగా ఉండే అతివలు సున్నితమైన తమ లేత చేతులకు ఈ గోరింటాకుని పెంటుకుంటే..బాగా పండి చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యంగా ఉంటే ఆ అమ్మాయి పెళ్లిచేసుకుంటే ఆమె దాంపత్యం చాలా బావుంటుంది. దీంతో భర్త కూడా ఆమెను బాగా ప్రేమిస్తాడు. ఈ దూరదృష్టితోనే బాగా పండితే మంచి మొగుడు వస్తాడని మన పెద్దలు చెప్పారు. ఈ చెట్టు సంత్సరానికికోమారు పుట్టింటకి పోతుందంట అంటే పార్వతి దేవి దగ్గరికి. అంతేగాదు అషాడమాసంలో అక్కడున్నప్పడూ కూడా తనని మరిచిపోకుండా పెట్టుకోవాలని పార్వతి దేవిని కోరిందట. అందుకనే అందరూ ఆషాడం రాగానే గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు మనకు చెబుతుంటారు. (చదవండి: తొలి ఏకాదశి..శయన ఏకాదశి..విష్ణువు నిజంగానే నిద్రలోకి వెళ్తారా..!) -
అరచేతిలో అందాల పంట
కొమ్మాది(భీమిలి): గోరింట పూచింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు.. గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు.. సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా.. అందాల చందమామ అతనే దిగి వస్తాడు అంటూ గోరింటాకు గొప్పతనాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓ సినిమాలో అద్భుతంగా చెప్పారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆషాఢం, గోరింటాకు, మహిళలకు ఓ ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆషాఢం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోపు ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. జ్యేష్ట మాసంలో వర్షాలు మొదలై.. ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునే వారు, ఏరు దాటాల్సి వచ్చే వారు, ఈ కాలంలో కాళ్లు చేతులు తడవకుండా రోజులు దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం గోళ్లు దెబ్బతినడం వంటి వాటి నుంచి ఈ గోరింటాకు కొన్ని రోజులు పాటు ఆపుతుంది. ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతుంది. ఆ సమయంలో గోరింట పెట్టుకోవడంతో ఎర్రగా పండుతుంది. అందుకే పూర్వం నుంచి ఆషాఢంలో గోరింట పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కొత్త పెళ్లికూతురికి సౌభాగ్యం ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింటాకు తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింటిలో ఉన్న వధువు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. కోన్లతో జాగ్రత్త ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారని చాలా మంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్లపై ఆధారపడుతుంటారు. గోరింట మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వలన ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపురంగు కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. దీని వలన ఆరోగ్యం మాట అటు ఉంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆషాఢంలో ప్రకృతి సహజసిద్ధంగా లభించే గోరింటాకును వాడేందుకు ప్రాధాన్యమివ్వాలి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఆషాఢం నాటికి వాతావరణం ఒక్క సారిగా చల్లబడుతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన కఫ సంబంధిత రోగాలు ఏర్పడతాయి. గోరింటాకుకు ఒంట్లో వేడిన తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరిచి రోగాల బారిన పడకుండా చేస్తుంది. అన్ని విధాలా మేలు చేస్తుంది. సంప్రదాయంతో పాటు ఔషధం కూడా.. గోరింటాకులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం మాత్రమే కాదు.. వాతావరణంలో జరుగుతున్న మార్పుల వలన సంభవించే శరీర రుగ్మతలను తొలగించే చక్కటి ఔషధం. –జి.ఉష, సాగర్‌నగర్ చిన్నప్పటి నుంచి కొనసాగిస్తూ.. నాకు ఉహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఆషాఢంలోనూ గోరింటాకు పెట్టుకుంటున్నాను. ఆషాఢం వచ్చిందంటే మా ఇంట్లో అక్కచెల్లెళ్లు అందరం కలసి గోరింటాకు పెట్టుకునేవాళ్లం. అప్పుడు పండగ వాతావరణంలా ఉండేది. – మణి సుందరి, వైజాగ్ పూర్వం నుంచి.. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అయితే ప్రస్తుతం యువతకు ఇది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. గోరింటాకు ఆకులను ముద్దగా చేసుకుని మేము పెట్టుకునే వాళ్లం. అయితే నేడు గోరింటాకు చెట్లు కనుమరుగైపోతున్న తరుణంలో కోన్లకు ప్రాధాన్యమివ్వాల్సి వస్తోంది. – పి.ఉమ, వైజాగ్ -
ఆషాడ మాసం: గోరింటాకు పెట్టుకోవడం వెనకున్న ఆంతర్యం ఇదే..
సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆషాఢమాసం నేటి (గురువారం) నుంచి ప్రారంభం అయ్యిందది. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఆషాఢమాసం వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఈ మాసంలో వానలు ఎక్కువై ఇంటి లోగిళ్లు, పంట పొలాలు బురదమయమై, క్రిమి కీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో కాళ్లు, చేతులు ఆడిస్తూ పనిచేయడం పరిపాటి. కాబట్టి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునే వారు. ప్రస్తుతం రకరకాల మెహందీ డిజైన్లు వాడుకలోకి రావడం వల్ల అందం కోసం గోరింటాకును మహిళలు అలంకరించుకోవడం అధికమై, కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోరింటాకు వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్ట వంటివి రాకుండా ఉంటాయి. ఈ మాసం సందర్భంగా కొన్నిచోట్ల మహిళా సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో మహిళలంతా సామూహికంగా గోరింటాకు వేడుకలు నిర్వహిస్తారు. పండుగలకు ప్రత్యేకం ఆషాఢం పండుగలకు ఆషాఢం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వచ్చేనెల 10వ తేదీన శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి), 12వ తేదీన గురుపౌర్ణమి (ఆషాడ పౌర్ణమి) పండుగలు రానున్నాయి. ఆషాఢ మాసంలో బోనాల వేడుకలను జరుపుకుంటారు. గ్రామ దేవతలకు బోనాలతో మొక్కులు సమర్పిస్తారు. ఆషాఢ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. -
ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు.. ఎందుకంటారు!
జనగామ: ఆషాఢమాసాన్ని శూన్య మాసమంటారు. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కానీ ఈ మాసం అనేక పర్వదినాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ప్రతి వారం, పదిహేను రోజులకోసారి ఏదో ఒక పండగ, వ్రతం, పూజ చేసుకుంటారు. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. క్షణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాఢమాసం అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకు వస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని పూర్వీకుల నుంచి వస్తుంది. గోరింటాకు ఎరుపు రంగును ఇస్తుంది. ఎరుపు సూర్యునికి ప్రతీక. అరచేతిలో సూర్యుడిలా గుండ్రంగా పెడతారు. నెలవంక పైన చుక్క గోరింటాకు శరీరపు ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది. ఈ సీజన్లో తొలకరి మొదలై వర్ష రుతువుగా మారి జోరుగా వర్షాలు కురుస్తాయి. వర్షం నీటిలోనే పనులు చేసుకునే సీజన్ ఇది. శాస్త్రీయ ప్రయోజనాలు కూడా.. ముఖ్యంగా పొలం పనులు చేసుకునే రైతు కుటుంబాలు గంటల తరబడి నీటిలోనే పనిచేయాల్సి ఉంటుంది. దీంతో చర్యవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. గోరింటాకు యాంటీ బ్యాక్టీరియా గుణాలు కలిగి ఉంటుంది. ఇది పెట్టుకుని పనులు చేసిన వారికి వర్షంలో తడిసిపోయినా చర్యవ్యాధులు దరిచేరవు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వేడిని తగ్గించే గుణం ఉన్న గోరింటాకు బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందం, ఆనందం కోసం గోరింటాకు పెట్టుకోవడం మొదలైంది. కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. పెళ్లయిన వారైతే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు అంటుంటారు. కొత్త పెళ్లి కూతురుకు అందం.. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం అనాధి నుంచి వస్తుంది. గోరింటతో చేతులను పండించుకునే వారి సౌభాగ్యాన్ని కాంక్షిస్తుందని నమ్ముతారు. కేవలం ఆషాఢ మాసంలోనే గోరింటాకు దొరుకుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడపడితే అక్కడ కోన్లు అందుబాటులోకి వచ్చాయి. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు మిక్సింగ్ చేస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే చర్మవ్యాధులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును మాత్రమే వాడుకునేలా ప్రాధాన్యతను ఇవ్వాలి. గోరింటాకు అందం ఆరోగ్య, సౌభాగ్యానికి చిహ్నంగా నిలుస్తుంది. అమ్మవారికి ప్రతీకగా.. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తుంది. గోరింటాకు అమ్మవారికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకంబరీ మాతగా అలంకరిస్తారు. మైదాకులో లక్ష్మిదేవి రూపాన్ని చూసుకుంటారు. ఆషాఢంలో శుభగడియలు లేకున్నా వ్రతాలు, పూజలు చేసుకుంటారు. – ఆరాధ్యశర్మ, వేదపండితులు, జనగామ -
గోరింటాకు శ్రీవల్లి
కూతురు అంటే తల్లిదండ్రుల చాటు బిడ్డలా, వారిపై ఆధారపడేలా కాకుండా కుటుంబానికే పెద్ద దిక్కుగా మారే విధానం ‘గోరింటాకు’ సీరియల్లో కనిపిస్తుంది. స్టార్ మా’లో వస్తున్న ‘గోరింటాకు’ సీరియల్ ద్వారా తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీవల్లిగా పరిచయం అయ్యింది కావ్య. బెంగుళూరు నుంచి తెలుగింటికి వచ్చిన కావ్య సీరియల్లోని తన పాత్ర గురించి, నిజ జీవితం గురించి ఆనందంగా పంచుకుంది. ‘తండ్రికి గుండెజబ్బు. అతను చేసేది మగ్గం పని. కుటుంబం గడవలేని స్థితిలో తండ్రి స్థానాన్ని శ్రీవల్లి తీసుకుంటుంది. చేనేత చీరల అమ్మకం, అందులోని ఎగుడుదిగుడులను తట్టుకుంటూ తను ముందుకుసాగడం చూసే ప్రేక్షకులు ఇలాంటి ధైర్యవంతురాలైన కూతురు తమ ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ మాటలు నాతోనే ప్రేక్షకులు నేరుగా అన్నప్పుడు కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు.’ ఆడిషన్స్ ద్వారా ఎంపిక బిఎస్సీ పూర్తి చేశాక కన్నడ సీరియల్స్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కన్నడలోనూ నీలి, నాయకి సీరియల్స్ చేస్తున్నాను. ముందు ఈ ఫీల్డ్ అనుకోలేదు కానీ, మా అమ్మ భాగ్య నేను నటిని కావాలని ఆశపడేది. ఎక్కడ సీరియల్స్, సినిమా ఆడిషన్స్ జరిగినా అక్కడకు తీసుకెళ్లేది. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లో ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తి గమనించే అమ్మ నన్ను ఈ ఫీల్డ్కి పరిచయం చేయాలనుకున్నారు. కన్నడలో మూడేళ్లుగా సీరియల్స్ చేస్తున్నాను. ఈ ఏడాది తెలుగులో అవకాశం వచ్చింది. నాన్న నటరాజ్ బోర్‌వెల్స్ బిజినెస్ చేస్తారు. నాకో చెల్లెలు. తను డిగ్రీ సెకండియర్ చదువుతోంది. శ్రీవల్లికి పూర్తి వ్యతిరేకం సీరియల్లో శ్రీవల్లికి ఉన్నంత బరువు బాధ్యతలు నాకు లేవు. అలాగే, అందులో శ్రీవల్లి విలన్స్ నుంచి ఎదుర్కొనే టీజింగ్ సీన్స్ లాంటివి కూడా లేవు. నిజం చెప్పాలంటే నా జీవితం శ్రీవల్లి పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. భక్తురాలిని... గోరింటాకు సీరియల్లో శ్రీవల్లి చాలా స్ట్రిక్ట్. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించదు. ధైర్యంతో పాటు దైవం అంటే భక్తి కూడా ఉంటుంది. మా అమ్మకు దేవుడి మీద బాగా నమ్మకం. రెండు నెలలకోసారి ఇంట్లో హోమాలు, పూజలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిలో నేనూ పాల్గొంటాను. కాటన్ చీరలు చేనేత బ్యాక్‌గ్రౌండ్ మీద సీరియల్ థీమ్ నడుస్తుంది. ఈ సీరియల్లో శ్రీవల్లికి చీరల షోరూమ్ కూడా ఉంటుంది. మిగతా సీరియల్స్‌లో లాగా హీరోయిన్‌కి హెవీగా మేకప్, డిజైనర్ డ్రెస్సులు కాకుండా కాటన్ చీరలను యూనిట్ సజెస్ట్ చేసింది. దాంతో మంగళగిరి చేనేత చీరలను ధరిస్తుంటాను. సింపుల్‌గా కాటన్ చీరలో కనిపించడంతో శ్రీవల్లి వ్యక్తిత్వం కూడా ఇందులో ప్రతిఫలిస్తుంటుంది. తొందరపడను చేసే పని ఒకేలా ఉండకూడదు అనుకుంటాను. అందుకే త్వరగా అన్నీ చేసేయాలని కోరుకోను. ఈ పరిశ్రమలో మంచి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకుంటూనే ఇంకా పై చదువులు చదవాలని ఉంది. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాను. వేటికీ ఎక్కువ హైరాన పడటం ఉండదు కాబట్టి కాస్త ఖాళీ టైమ్‌ను నా కోసం ఉండేలా జాగ్రత్తపడతాను. అప్పుడేగా మన ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవచ్చు. ఏ కాస్త తీరికి దొరికినా డ్యాన్స్ చేస్తాను. రాక్, పాప్, ఇండో–వెస్ట్రన్.. ఇలా అన్ని రకాల సంగీతాన్ని ఇష్టపడతాను. అప్పుడప్పుడు బుక్స్ చదువుతుంటాను. నన్ను చూసి నేర్చుకోవాలంటుంది మా చెల్లి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలనేది తన తాపత్రయం. ‘అక్కా, ఇద్దరం కలిసే పెరిగాం కదా! నీకింత ధైర్యం ఎలా వచ్చింది’ అని అడుగుతుంటుంది. నన్ను చూసి తనూ ఒక ఫొటో షూట్ ట్రై చేసింది. సూచనలు అడుగుతాను అమ్మానాన్న, చెల్లి నా సీరియల్స్ చూసి సూచనలు చెబుతుంటారు. ఒక్కోసారి వాళ్లు చెప్పకపోయినా నేనే అడుగుతాను. తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రతీ డైలాగ్నకి ముందు దాని పూర్తి అర్ధం తెలుసుకుంటాను. ప్రేక్షకులు మెచ్చేలా నటన ఉండాలని తపిస్తాను’ అని వివరించింది కావ్య. – నిర్మలారెడ్డి -
అందుకే అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి!
సాక్షి, విశాఖపట్టణం : ఆషాఢమాసం ప్రారంభమైంది. కొత్తగా వివాహమైన కోడలు అత్తారింటిలో ఈ మాసంలో ఉండకూడదన్న విశ్వాసం ఉంది. ఈ మాసమంతా ఎలాంటి శుభ కార్యాలు కూడా చేయరు. ఏటా చిన్నా, పెద్ద ముహుర్తాలు తొమ్మిది నెలల పాటు ఉంటాయి. కేవలం ఆషాఢం, పుష్యం, భాద్రపదం మాసాలలో మాత్రమే శుభముహూర్తాలు ఉండవు. మిగతా తొమ్మిది మాసాలు ముహూర్తాలు వరసగా ఉంటాయి. ఈసారి ఆషాఢం, భాద్రపదానికి తోడు శుక్రమౌఢ్యంతో శ్రావణమాసం రావడంతో మంచి ముహూర్తాలకు విరామం ఏర్పడింది. శుక్రమౌఢ్యం ఉన్న రోజుల్లో పెద్ద శుభ కార్యాలు చేయరు. కేవలం నామకరణాలు, జన్మదినోత్సవాల లాంటివి మాత్రమే చేసుకోవచ్చునని పండితులు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో మౌఢ్యం నియమం పాటించని వారు మాత్రం శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆషాఢం ఆఫర్ల వరద ఈ మాసం వస్తుందంటే వ్యాపారులు ఆఫర్లతో ఊదరగొట్టేస్తారు. వస్త్రాల నుంచి నగల వరకు మార్కెట్లో ప్రత్యేక బహుమతులతో, ధరలతో అలంకార ప్రియు లను ఆకర్షిస్తారు. తూకాల్లో వస్త్రాల విక్రయాలు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, లక్కీ డ్రాలు తదితర ఆకర్షణీయ ప్రకటనలతో కొనుగోలుదారులను వ్యాపారులు ‘రారండి’అంటూ ఆహ్వానించేలా ఆఫర్లు ఇస్తారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి కొత్తగా పెళ్లయిన జంట ఒకరిని విడిచి ఒకరు ఉండి తీరాలన్న కఠిన నిబంధనను ఆషాఢ మాసమంతా అనుసరిస్తారు. ఎందుకంటే సాగు పనులు పుష్కలంగా ఉండే ఈ సీజన్లో కొత్త అల్లుడికి మర్యాదలు సరిగా చేయలేమనే భావన, సాగు పనులు స్తంభించిపోతాయనే ఆలోచన ఈ నిబంధనకు కారణంగా చెప్తారు. పైగా ఈ సమయంలో గర్భధారణ అంత ఆరోగ్యకరం కాదు. పరిసరాల్లోని నీళ్లు కలుషితం అయి ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాధులు విస్తరించే కాలంలో అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో పాటు ఈ కాలంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో జరిగే అవకాశం ఉంటుంది. తీవ్ర మైన ఎండలు కాచే సమయం ఉదయించే శిశువుకు మంచిది కాదు. ఈ నెల వియోగం పాటిస్తే జూలై, ఆగస్టుల్లో ప్రసవం జరుగుతుంది. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి ఎడబాటు మంచిదే. మూడు నెలలు ఖాళీనే.. శుభ ముహూర్తాలు లేకపోవడంతో ముఖ్యంగా వివాహాలకు అనువైన రోజులు లేకపోవడంతో.. ఫంక్షన్ హాళ్లు, సంబంధిత వ్యాపారాలు కళ తప్పనున్నాయి. శూన్యమాసాలాకు తోడు మౌడ్యమి రావడంతో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలు తక్కువ. శుభ కార్యాలపై ఆధారపడి జీవించే వేలాదిమందికి ఈ విరామం కాలం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. టైలర్లు, బాణాసంచా, భాజాభజంత్రీలు, వంట మాస్టర్లు, కూలీలు, పారిశుద్ధ్య ›పనులు చేసేవారికి రోజు వారీ కూలీ లభించే అవకాశం ఉండదు. పందిళ్లు, షామియానాలకు కూడా గిరాకీ తగ్గనుంది. ఫంక్షన్ హాళ్లు, ప్రింటింగ్ ప్రెస్‌లు, పురోహితులకు కూడా చేతినిండా పని ఉండదు. అక్టోబర్ నుంచి మంచి రోజులు ‘అక్టోబరు 2 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ముహూర్తాలు డిసెంబర్ 12 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 14 నుంచి గురు మౌఢ్యమి కారణంగా మార్గశిర మాసంలో శుభ కార్యాలకు కాస్త విరామం ఏర్పడుతుంది. గురుమౌఢ్యమి జనవరి 10తో ముగియనున్నప్పటికీ పుష్య మాసం ఉండడంతో వివాహాలు, తదితర శుభ కార్యాల కోసం మంచి ముహూర్తాలు లేవు. శుభ ముహూర్తాలు తిరిగి మాఘమాసం అంటే జనవరి 26 నుంచి మాత్రమే ప్రారంభం కానున్నాయి’ అని వేద పండితులు చెబుతున్నారు. శుభకార్యాలకు విరామం మనదేశం వ్యవసాయ ప్రధానమైంది. ప్రతీ పల్లెలో వ్యవసాయాధారిత కుటుంబాలు ఉంటాయి. చినుకులు కురిసి ఖరీఫ్ పంటలకు అనుకూలంగా ఉండేది ఇదే నెలలో. సాగు పనులు, దుక్కి దున్నడం, నాట్లు వేయడం తదితర కార్యక్రమాలన్నీ చేస్తారు. సేద్యపు పనులకు ఆటంకాలు ఉండకూడదు కాబట్టి శుభకార్యాలు జరిపే వీలు ఉండదు. భానుసప్తమి ఆషాఢమాసంలో వచ్చే ఏడో రోజు అనగా సప్తమి తిథిని భాను సప్తమి,రథ సప్తమిగా భావిస్తారు. ప్రకృతికంతటికీ వెలుగు ప్రసాదించి సూర్యున్ని దైవంగా భావించడం ఈ తిథి ప్రత్యేకం. ఏడు గుర్రాల రేడు అనగా ఏడు వర్ణాల మేళవింపు అయిన సూర్యకాంతి కారణంగానే ప్రకృతి పచ్చటి శోభను సంతరించుకుంటుంది కాబట్టి సనాతన ధర్మం ప్రకారం సూర్యుడు సైతం దైవ సమానుడయ్యాడు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు పయనిస్తున్న సూర్యుడు మూడునెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున రాత్రి, పగలు, క్షణం కూడా తేడా లేకుండా సమానంగా ఉంటాయి. తొలిపండుగ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజునే తొలి ఏకాదశి అంటారు. త్రిలోక పరిపాలకుడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్న రోజిది కాబట్టి ఇది శయన ఏకాదశి. తిరిగి నాలుగు నెలల తర్వాత ఉత్థాన ఏకాదశి రోజున మేలుకుని ఉత్తరద్వార దర్శనం ఇస్తాడు. అందుకే ఈ నాలుగునెలల పాటు ఆధ్యాత్మిక సంప్రదాయ వాదులు చాతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. క్రిమి కీటకాదులు అతిగా సంచరించే అవకాశం ఉన్నందును ముని దీక్షలు ఆచరించే వారు బయట తిరగకుండా ఆశ్రమాల్లోనే ఈ దీక్షలను ఆచరించేవారు. వ్యాస పూర్ణిమ తల్లిదండ్రుల తర్వాత దైవ సమానంగా భావించే గురు పౌర్ణమి ఇదే మాసంలో వస్తుంది. త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమ. వేదాలను సృష్టించిన వ్యాస మహర్షినే ఆదిగురువుగా భావించి వ్యాస పౌర్ణమిని గురు పూజోత్సవంగా జరుపుకుంటారు. పంచమ వేదం మహాభారతం, శ్రీమద్భాగవతం లాంటి పరమోన్నత సంపద అందించిన వేద వ్యాసుడుని తొలి గురు వుగా భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. మగువలు ఇష్టపడే గోరింటాకు ఆషాఢం వచ్చేసింది. అర చేతిలో గోరింటాకు పండుతోంది. మగువల అలంకరణలో గోరింటాకు అగ్రస్థానంలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో విచ్చలవిడిగా మెహిందీలు, కోన్లు దొరుకుతున్నా గోరింటకున్న ప్రాధాన్యం దానిదే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తప్ప పట్టణ ప్రాంతాల్లో గోరింట మొక్కలు దాదాపు కనుమరుగయ్యాయి. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు పల్లెల్లో గోరింటాకు పెట్టుకోవడం మహిళలకు సంప్రదాయంగా వస్తోంది. ఈ మాసంలోనే లేతాకు లభ్యం వాస్తవానికి ఆషాఢ మాసంలోనే లేత గోరింటాకు దొరుకుతుంది. లేతాకైతేనే బాగా పండుతుందని మహిళల నమ్మకం. వర్షాలు పడిన తరువాత చిగురించిన లేత గోరింటాకును నూరి చేతులు, కాళ్లకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. ఇంట్లో పనులన్నీ అయిపోయాక పడుకునే ముందు కుటుంబమంతా ఓ చోట చేరి గోరింటాకు ముద్దను మహిళల చేతులు, కాళ్లకు నచ్చిన డిజైన్లతో అలంకరించి రాత్రంతా ఉంచుకుంటారు. తెల్లవారు జామున పండిన గోరింటాకును చూసుకుంటూ మురిసిపోతారు. నీదెలా పండిందో.. నాదెలా పండిందో చూపించంటూ చిన్నా, పెద్దా తేడా లేకుండా మురిసి పోతుంటారు. కమ్మరేకుకు కూడా ప్రాధాన్యమే.. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోరింటాకు నూరేటప్పుడు కమ్మరేకులకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చేవారు. సిద్ధం చేసుకున్న గోరింట మిశ్రమాన్ని బట్టి మూడిళ్లు లేదా ఆరిళ్ల తాలూకా కమ్మ రేకుల ముక్కలను సేకరించి గోరింటాకులో కలిపి మెత్తగా నూరేవారు. ఇలా చేస్తే బాగా పండటమే కాకుండా ఎక్కువ రోజులు చేతులు, కాళ్లకు పట్టి ఉంటుందని ఉంటుందని మహిళల నమ్మకం. మారుతున్న పరిస్థితుల బట్టి గ్రామాల్లో గోరింటాకును నూరడానికి ఉపయోగించే రోళ్లు కూడా కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో మిక్సీలు వచ్చి పడ్డాయి. శ్రమతో కూడుకున్న పని కావడంతో కాస్తా ఓపికున్న వారు గోరింటాకును మిక్సీలో తయారు చేసుకుంటుంటే, మరికొందరు మెహిందీ, కోన్లను ఉపయోగిస్తూ ఆధునిక పోకడలకు పోతున్నారు. సైన్స్ ఇలా చెబుతుంది గోరింటాకు మంచి యాంటీ బయాటిక్‌గా పని చేస్తుందని సైన్స్ చెబుతుంది. ఒకప్పుడు మన జీవనం పూర్తి వ్యవసాయాధారితం. మృగశిరలో నారుమళ్లు వేయడం, ఆషాఢంలో నాట్లు వేయడమనేది సంప్రదాయంగా వస్తోంది. గతంలో రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పొలం పనుల్లో ఎక్కువగా పాల్గొనేవారు. దీనివల్ల మట్టి, మురుగునీరు కాళ్లు చేతులు ద్వారా శరీరంలోకి ప్రవేశించి జ్వరాలు, చర్మవ్యాధులు వంటి రోగాల బారిన పడటం జరిగేది. ఇప్పటికీ అదే సమస్యను చూస్తూ ఉన్నాం. గోరింటాకు పెట్టుకుంటే యాంటీ బయాటిక్‌గా పనిచేసి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా గోరింటాకుకు ప్రముఖ స్థానముంది. రాన్రానూ దానిస్థానంలో కోన్లు రావడం, మెహిందీలంటూ కొత్త కొత్త డిజైన్లు రావడంతో గోరింటాకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. రసాయనాలు కలిగి ఉండే కోన్ల వల్ల చర్మవ్యాధులు వస్తుండటం గమనర్హం. -
ఆషాడ మాసం...ప్రత్యేకతల సమాహారం
విజయనగరం : ఆచార వ్యవహారాలకు పెద్దపీటవేసే సంప్రదాయంలో ప్రతీనెలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తొలకరి జల్లులతో ప్రకృతి శోభనందించే వేళ వచ్చేదే ఆషాడమాసం. చంద్రగమనంలో పూర్వాషాడ నక్షత్ర సమీపంలో సంచరించే సమయం కాబట్టి ఆషాడ మాసంగా పిలుచుకుంటాం. శుభకర్యాలకు అవకాశం లేకపోయినా... ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న నెల ఆషాడం. జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు, తెలంగాణాలో బోనాలు పండగ, చాతుర్మాస వ్రతాలు.. ఇలా ఎన్నో స్థానిక పండగలతో నెలంతా సందడిగా సాగుతుంది. ఆషాడంలో చేసే దానం, స్నానం, జపం, పారాయణం విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు. ఆషాడంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ముక్తిదాయకమని పెద్దలు చెబుతుంటారు. ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని ప్రజల విశ్వాసం. అతివల అరచేతుల్లో అందాలు.. ఆషాడ మాసం వస్తే చాలు .. ఆడవారి అర చేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. చక్కని లేత గోరింటాకు రుబ్బి, తమ అరచేతిని ఆకాశాన్ని చేసి అందులో చందమామని, చుక్కల్ని అందంగా తీర్చిదిద్దుతారు. మెహందీ కోన్లు తెచ్చి జిగిబిగి అల్లికలా ముచ్చటైన ఆకృతుల్ని వేసుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు తమ చేతులు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు. ఎర్రగా పండితే చాలు తమ చేతుల్ని అందరికీ చూపిస్తున్నప్పుడు ఆ సమయంలో వారి చేతుల కంటే సిగ్గుతో వారి బుగ్గలే ఎర్రబడతాయి. ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే.. ఆషాడంలో గీష్మరుతువు గడిచిపోతోంది. వర్ష రుతువు ఆరంభమవుతుంది. గ్రీష్మంలో శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. ఆషాడంలో మాత్రం వాతావరణం చల్లబడిపోతుంది. ఇలాంటి సమయాల్లో అనారోగ్యాలు తప్పవు. అంతే కాకుండా నిత్యం పనుల్లో ఉండే మహిళల చేతులు, పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసేశక్తి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరీయా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినే టప్పుడు నోటి ద్వారా క్రిములు వెల్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు. అంతేకాదు... గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయంట. నవ దంపతులకు కష్టకాలం ఆషాడమంటే అందరికీ ఇష్టమైనా.. కొత్తగా పెళ్లైన దంపతులకు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. వివాహం అయిన తర్వాత వచ్చే తొలి ఆషాడంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్తగారు ఒకే చోట ఉండకూడదని, ఒకరికొకరు ఎదురు పడకూడదని చెబుతుంటారు. అంతే కాకుండా సాగు పనుల్లో క్షణం తీరికలేకుండా ఉంటారు. కాబట్టి కొత్త అల్లుడికి మర్యాదల విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశంతో ఎడబాటుగా ఉంచుతారు. ఇదిలా ఉండగా శాస్త్రీయ పరమైన కారణమేమిటంటే ఆషాడంలో కొత్త దంపతుల కలయిక వల్ల గర్భం ధరిస్తే... చైత్ర, వైశాఖ మాసంలో పిల్లలు పుడతారు. అంటే ఏప్రిల్, మే నెలల్లో నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కనే అవకాశాలున్నాయి. ఈ కారణంగానే ఆషాడంలో కొత్త జంటకు నెలరోజుల పాటు ఎడబాటు తప్పదు. విభిన్న మార్పుల వాతావరణం ఆషాడాన్ని అనారోగ్యా మాసంగా కూడా పిలుస్తుంటారు. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయమిది. కాలువలు, నదుల్లో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లోకి వచ్చి చేరే నీరు మలినంగా ఉండి మనుషులు అనారోగ్యానికి కారణమవుతుంది. కొత్తనీరు తాగడం, వర్షంలో తడవడం వల్ల చలిజ్వరం, విరేచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు ప్రబలుతుంటాయి. గర్భం దాల్చిన స్త్రీలు తగు ఆహార నియమాలు పాటించాల్సిన సమయమిది.శుభకార్యాలకు సెలవుఆషాడ మాసంలో సాధారణంగా శుభకార్యాలు నిర్వహించరు. పూర్వీకులు దీన్ని శూన్యమాసంగా భావిస్తారు. రుతువులు ఈ మాసంతోనే ప్రారంభమవుతాయి కాబట్టి శుభకార్యాలకు మంచిది కాదంటారు. అంతే కాకుండా వర్షాలు ఈ కాలంలోనే ప్రారంభమవుతాయి కాబట్టి వ్యవసాయ పనులు జోరందుకోవడం వల్ల వేరే వ్యాపకంలో ఉండరు. అందుకే గృహప్రవేశం, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, తదితర కార్యాలు ఆషాడంలో నిర్వహించరు. శ్రావణమాసం వచ్చే వరకూ శుభకార్యాలు ఎక్కడా నిర్వహించకపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోగ్యదాయకం.. గోరింటాకు గోర్లకు పెట్టుకునే ఆకుగా గోరింటాకును వర్ణిస్తారు. రైతులు వ్యవసాయం చేసే సమయమిది. మహిళలు నీటిలో చేతులు పెట్టి వ్యవసాయపనులు చేస్తుంటారు. గోళ్ల ద్వారా వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు గోరింటాకును రాత్రివేళ గోళ్లకు పెట్టుకుంటారు. ప్రస్తుత రోజుల్లో మహిళలు గోళ్లను వదిలేసి, మిగతా చోట మాత్రమే పెట్టుకుంటున్నారు. ఆషాడ మాసంలో గోరింట పెట్టుకోవడం ప్రతి మహిళ అపురూపంగా భావిస్తుంది. ఈ మాసంలో గోరింట పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా మంచిది. అందుకే పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత కూడా ఆషాడ మాసంలో కచ్చితంగా గోరింట పెట్టుకునే అలవాటు ఉంది. –పి. మానస, బ్యూటీషీయన్, విజయనగరం -
ఒకరి జీవితం పండించి తను మాత్రం రాలిపోయే 'గోరింటాకు'
నాటి సినిమా సృష్టిలో ఏమీ ఆశించినవి కొన్ని ఉంటాయి. పైగా ఇవ్వడమే వాటి ధర్మమనుకుంటాయి. పూలు సువాసననిచ్చి వాడిపోతాయి. మబ్బులు చినుకులు రాల్చి కరిగిపోతాయి. ఏరు దప్పిక తీర్చి కదిలెళ్లిపోతుంది. పంట ఫలాన్ని ఇచ్చి లుప్తమైపోతుంది. పురుషుల విషయంలో కొందరు స్త్రీలు కూడా ఇలాగే ఉంటారు. వారి జీవితాన్ని నిస్వార్థంగా పండించి తాము మాత్రం నిశ్శబ్దంగా రాలిపోతారు. రాము (శోభన్‌బాబు) తన జీవితంలో ఇద్దరు స్త్రీలను అలాంటివాళ్లుగా చూశాడు. ఒకరు తల్లి (సావిత్రి). మరొకరు స్నేహితురాలు స్వప్న (సుజాత). తల్లికి భర్త వల్ల జీవితంలో ఎటువంటి సంతోషమూ లేదు. అతడు తాగుబోతు. వ్యసనపరుడు. ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని బంగారం లాంటి ఇంటిని అలక్ష్యం చేసినవాడు. చివరకు ముక్కుపచ్చలారని కన్నకూతురు ఒక రోజు ముచ్చటపడి గోరింటాకు పెట్టుకుంటే అదే రోజున ఆ పిల్ల చావుకు కారణమవుతాడు. అయినా సరే తల్లి అతని బాగే కోరింది. భర్తలో మార్పే ఆశించింది. అతడి కోసం తన జీవితాన్ని గోరింటాకులా మార్చడానికి ప్రయత్నించింది. స్వప్న కూడా అంతే. మెడికల్ కాలేజీలో రాము క్లాస్మేట్. అతడి కాలేజీ ఫీజు ఆమే కట్టింది. అతడు హాస్టల్లో ఉండి అవస్థలు పడుతుంటే తన ఇంటికి తెచ్చి ఔట్‌హౌస్‌లో చోటు చూపించింది. బట్టలు ఉతకడానికి పని మనిషిని పెట్టింది. చెంబు ఇస్త్రీతో అవస్థలు పడుతుంటే కొత్త బట్టలు కొనిచ్చింది. అతడి పట్ల ఆమె మనసులో ఎంతో అనురాగం. ఆమె పట్ల కూడా అతడి మనసులో ఎంతో అనుబంధం. కాని వాళ్లు ఒకటి తలిస్తే స్వప్న తండ్రి మరొకటి తలిచాడు. అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు పెళ్లయ్యాక ఇంకా పెద్ద ఇంటి కోడలు కావాలని భావించాడు. ఇది రాముకు తెలిసింది. తన ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడ్డాడు. అతడు భయపడటంతో ఆమె తెగువ చూపలేకపోయింది. మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రాము డాక్టర్ కావడంలో కీలకపాత్ర పోషించిన ఆమె అతణ్ణి వదులుకొని దూరం వెళ్లిపోయింది. కాని వెళ్లిన ఆమె సుఖంగా లేదు. పెళ్లి చేసుకున్నవాడు ఇది వరకే మరొకరికి తాళి కట్టి ఉన్నాడు. ఇది పెద్ద దెబ్బ. కాని ఆమె భీరువు కాదు. అతడి భరతం పట్టి తిరిగి వచ్చింది. కాని అప్పటికే రాము తనకు ఎదురు పడిన ఒక డిస్ట్రబ్డ్ పేషంట్ (వక్కలంక పద్మ)కు సన్నిహితం అయి ఉంటాడు. నిజమే కావచ్చు. కాని పెళ్లి పెటాకులై తిరిగి వచ్చిన స్వప్నను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంది. చేసుకోమని కోరే హక్కు ఆమెకూ ఉంది. కాని ఆమె అలా చేయదు. రామును చేసుకుంటే అతడు సన్నిహితమైన అమ్మాయికి క్షోభ కలగవచ్చు. ప్రాణం కోల్పోవచ్చు. అందుకే స్వప్న తను ‘కుమారి’గానే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటుంది. రాము జీవితం నుంచి శాశ్వతంగా అడ్డుతొలగిపోతుంది. అతని జీవితాన్ని అన్ని విధాల పండించి ఆమె మాత్రం విధి తరంగాలలో ఎక్కడో తప్పిపోయింది. 1979లో వచ్చిన ‘గోరింటాకు’ ఇప్పటికీ తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచి ఉంది. నిర్మాత మురారి, కథకురాలు కె.రామలక్ష్మి, దర్శకుడు దాసరి నారాయణరావు, సంగీతకారుడు కె.వి. మహదేవన్... ఇంకా నటీనటులు అందరూ కలిసి ఆ సినిమాను తెలుగువారికి ప్రియమైన సినిమాగా మార్చారు. స్త్రీ కోరుకునేది పురుషుడి అనురాగం. అతడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా వంచన చేసినా ఆమె సహనంగా అతడిని ఆదరిస్తుంది. మార్పు కోరుకుంటుంది. అతడి బాగు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతుంది. స్త్రీ తాలూకు లోతైన ఈ భారతీయ స్వభావాన్ని చూపడం వల్లే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అయితే అదే సమయంలో స్త్రీ ఎదురు తిరిగితే ఏమవుతుందో స్వప్న పాత్ర ద్వారా చూపిస్తారు. తనను మోసం చేసి తాళి కట్టిన దొంగ మొగడి ముఖాన తాళి తెంచి విసిరి కొట్టే సన్నివేశం గొప్ప ఇంపాక్ట్ చూపుతుంది. శోభన్‌బాబు, సుజాత ఈ సినిమాలో ఎంతో ముచ్చటగా అందంగా కనిపిస్తారు. నటిస్తారు. అలనాటి సూపర్‌స్టార్ సావిత్రి కథకు నిండుదనం తెస్తుంది. కథకు పెద్ద రిలీఫ్‌గా రమాప్రభ–చలం జంట. ఉత్తరాంధ్ర యాసలో వాళ్లిద్దరూ ఆకట్టుకుంటాడు. ‘ఏటంటావంటే నానేటంటాను... నువ్వేటంటే నానూ అదే అంటాను’ అని రమాప్రభ విజృంభిస్తుంది. దేవులపల్లి – గోరింటా పూచింది కొమ్మా లేకుండా, వేటూరి– కొమ్మకొమ్మకో సన్నాయి, ఆత్రేయ– చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది, శ్రీశ్రీ– ఇలాగ వచ్చి అలాగ తెచ్చి వంటి పాటలు ఈ సినిమాలో మహదేవన్ వల్ల నిలిచి వెలిగాయి. వెలుగుతున్నాయి. విశాఖ అందాలు, ఔట్‌డోర్‌లో తీసిన సన్నివేశాలు ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గా ఉంటాయి.దాసరి సినిమాలు చాలా ఉండొచ్చు. కాని ఇది ప్రత్యేకం. ఎంతో బాగా పండి ఎప్పటికీ రాలిపోని గోరింటాకు ఇది. కూనిరాగం వస్తోంది... ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం... మీరూ కాడుకోండి. – కె