అరచేతిలో అందాల మెహంది
ఆషాఢంలో మహిళలు ఆనందంగా జరుపుకునే పండుగ
అతివలకు అందం.. ఆరోగ్యం
ఆరంభమైన ఆషాఢ మాసం
సప్తగిరికాలనీ(కరీంనగర్): గోరింట పూసింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గా తొడిగింది.. అన్నాడో సినీ కవి. ఆషాఢం వచి్చందంటే చాలు.. గోరింటాకు గుర్తుకొస్తుంది. ఈ మాసం గడిచేలోపు ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. అతివలు అరచేతులకు పెట్టుకొని మురిసిపోతుంటారు. శుభకార్యాలు, పండుగలు, ఆషాఢ మాసంలో మైదాకు పెట్టింది పేరు. అంతేకాదు.. ఔషధ గుణాలు గోరింటాకులో మెండు.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సంబరంగా చేసుకొనే పండుగ. ఇటీవల కాలంలో మహిళలందరూ ఒకచోట చేరి మెహందీ పండుగను చేసుకోవడం, కిట్టీ పార్టీల్లో కూడా ఆషాఢ మెహందీ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లోని మగువ కిట్టీ పార్టీ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలను నగరంలోని మున్సిపల్ పార్క్‌లో ఘ నంగా చేసుకున్నారు. అందరూ ఒకచోట చేరి గోరింటాకును తయారు చేసి చేతులకు పెట్టుకుంటూ సందడి చేశారు. ఆషాఢ మాసం ఆరంభమైన సందర్భంగా ఆషాఢ మెహందీపై సాక్షి స్పెషల్ స్టోరీ.
చర్మవ్యాధులు రాకుండా..
వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధు ల బారి నుంచి రక్షించుకోవచ్చనేది ఆరోగ్య రహస్య ం. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట పొలాలు బురదమయమై క్రిమికీటకాలు పె రుగుతాయి. మహిళలు పొలంలో వరినాట్లు వేయ డం వల్ల చేతులు, కాళ్లకు బురద అంటుకుంటుంది. ఈ మాసంలో మైదాకు పెట్టకుంటే చర్మవ్యాధులు రా కుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఆషాఢ ప్రత్యేకత..
ఆషాఢంలో ఏదో ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలన్నారు మన పూర్వీకులు. ఆనాటి సంప్రదాయాలు నేటికీ కొనసాగుతున్నాయి. గోళ్లకు రంగునిచ్చే గోరింటాకుకు సఖరంజని అని కూడా పేరుంది. నేటి ఆధునిక కాలంలో గోరింటాకు పేరుతో కోన్లు, పేస్టులు వస్తున్నాయి. అవి రంగును, అందాన్ని ఇస్తాయి తప్పా.. ఔషధ గుణాలుండవు.
ప్రయోజనాలు..
మైదాకు వేళ్లకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెలుసుబారి పోకుండా కాపాడుతుంది. ఆకులే కాకుండా పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు కూడా ఔషధ యుక్తాలే. వీటితో శరీరంలో అలర్జీలను దూరం చేసుకోవచ్చు. బోధకాల వ్యాధి, ఏనుగు కాలు(లింపాటిక్ పైలేరియాసిస్) దరి చేరదు. ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకును బాగా నూరి పూస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నెలకోసారి గోరింటాకు ముద్దను తలకు ప్యాక్ వేసుకుంటే జట్టు బలపడి రాలదు. గోరింటాకు పాడి కాచిన నూనెను వాడడం చిట్కా వైద్యంలో ఒకటి. గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని తాకటం వల్ల అందులోని లాసోన్ అనే సహజమైన రసాయనంతో ఎరుపు రంగు ఏర్పడుతుంది. కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగు కలిగించే రసాయనాలు కలపడం వల్ల ఆరోగ్యం మాటెలా ఉన్నా.. కొన్ని అలర్జీలు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.
తయారు చేసే విధానం
మైదాకులో చింతపండు వేసి మధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ రోట్లో రుబ్బాలి. నాణ్యమైన గోరింటాకు ఎంచుకొని ఆకులు లేదా పొడిని వేడి నీళ్లలో కలిపి రాత్రంతా నానబెడితే మంచి రంగులో పండుతుంది. మెహందీ, హెన్నాకు కాఫీ పొడిని కలిపి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు పెట్టుకోవాలి. దీంతో కాఫీ బ్రౌన్ కలర్‌లో పండుతుంది. నిమ్మ రసంలో పంచదార వేసి చిక్కటి సిరప్ తయారు చేసుకోవాలి. మెహందీ చేతులకు పెట్టుకున్నాక తడారే సమయంలో లెమన్ షుగర్ సిరప్‌ను చేతులకు పెట్టుకోవాలి.
మైదాకుతో ఆరోగ్యం
పొలాల్లో పని చేసే మహిళలకు గోరింటాకు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఇ ప్పుడు రెడీమెడ్ రావడం, రసాయనిక పేస్టులు వాడటంతో చర్మవ్యాధు లు వస్తున్నాయి. కొత్తగా పెళ్లయిన యువతులు ఆషాఢంలో తల్లిగారింటికి వచ్చి గోరింటాకు పెట్టుకొని మురిసిపోవడం ఆనవాయితీ. పట్టణాల్లో చాలామంది కోన్లను ఉపయోగిస్తున్నారు.
– శ్వేత
మగువ కిట్టీ పార్టీ ఆధ్వర్యంలో..
మా మగువ కిట్టీ పార్టీ ఆ« ద్వర్యంలో ప్రతి సంవత్స రం ఒక పెద్ద పండుగ లా గా నిర్వహించుకుంటాం. అందరం ఒకచోట కలు సుకొని పూజలు నిర్వహిస్తాం. అనంతరం మెహందీని చేతులనిండా పె ట్టుకుంటాం. రోజంతా సంబరంగా గడుపుతాం.
– చకిలం స్వప్న
సంప్రదాయం.. ఔషధం
మైదాకు చేతులకు పెట్టుకోవడం సంప్రదాయంతోపాటు మంచి ఔషధం. ఇది పూర్వం నుంచి వస్తు న్న ఆచారం. నేడు కోన్లు వచ్చాయి. యువతులు కావాలంటే కోన్లను వాడాల్సి వస్తుంది. మంచి కంపెనీలకు చెందిన గోరింటాకు కోన్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులుండవు. శుభకార్యాలకు మహి ళలు తప్పక మైదాకు పెట్టుకుంటున్నారు.
– ఉమ
అనాదిగా వస్తున్న ఆచారం
గోరింటాకులో మంచి ఔష ధ గుణాలున్నాయి. ఇది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం మాత్రమే కాకుండా.. వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల సంభవించే శరీర రుగ్మతలను తొలగించే చక్కటి ఔషధం కూడా. అందుకే ఆషాఢంలో గోరింటాకును తప్పకుండా పెట్టుకుంటా.
– సాహితి
ఇష్టమైన పండుగ
మెహందీ అంటే ఇష్టపడని మహిళలుండరు. పసి పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలివారి వరకు ప్రతిఒక్కరూ మైదాకును ఇష్టపడతారు. ప్రస్తత కాలంలో కోన్లు వచ్చినా ఆషాఢంలో మాత్రం గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటారు.
– ప్రవళిక
ఆషాఢ మాసంలో..
ఊహ తెలిసిన నుంచి ప్రతీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటున్నా. ఆ షాఢం వచి్చందంటే మా ఇంట్లో మైదాకు పండగ వాతావరణం అలుముకుంటుంది. ఆషాఢ మాసంలో మా చేతులన్నీ మెహందీలమయమవుతాయి. నెల మొత్తం పెట్టుకుంటాం. – లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment