ఆగస్ట్ 4 నుంచి తెలంగాణలో శ్రావణ మాసం బోనాలు
ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో బోనాల పండుగ ్రపారంభం అవుతుంది. గోల్కొండ జగదాంబికకు తొలిబోనం సమర్పణతో మొదలై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి, లాల్ దర్వాజ బోనాలతో నగరం పల్లె రూపం నింపుకుంటుంది. ఆషాఢమాసంలో బోనాలు హైదరాబాద్‌లో ముగుస్తాయి. శ్రావణమాసం ్రపారంభం అవుతూనే అమావాస్య ఆదివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన బోనాల పండుగ ప్రతి ఇంట సంబరమవుతుంది. మన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలూ బోనాల పండగను జరుపుకోవడం విశేషం.
సామూహిక చైతన్యం..
గ్రామదేవతలకు వండి పెట్టే భోజనమే బోనం అంటారు. బోనాన్ని గుడిలో అమ్మవారికి సమర్పించడంతో నైవేద్యం అవుతుంది. బోనాన్ని జేజ బువ్వ అని కూడా (తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో్ల) అంటారు. వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, రుతుమార్పుల వల్ల వచ్చే అంటురోగాలు, ఆనారోగ్యాల పాలు కాకుండా ఉండాలని అమ్మ దేవతలకు మొక్కుకుంటారు. ్రపాచీన కాలం నుంచి ఒక ఆచారాన్ని తీసుకువచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కూడా ఈ బోనం సంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు.
గిరులలో సిరులు కురవాలని..
గిరిజనులు సంవత్సరానికి ఒకసారిపోడు వ్యవసాయం ద్వారా పంట పండిస్తారు. దున్నే సమయంలో ముందు కొట్టే చెట్టుకు మొక్కుతారు.‘నేను వ్యవసాయం కోసమే నిన్ను కొడుతున్నాను. నీమీద నాకేం కోపం లేదు క్షమించమ్మా! రెండు రోజుల తర్వాత వస్తాన’ని చెప్పి మూడోరోజు దుక్కి దున్ని గింజలు నాటుతారు. చిక్కుడుపంట పండితే చిక్కుళ్ల పండుగ చేసుకుంటారు. ఇంటిపాదుల్లో పెట్టిన విత్తనాలు మొలకలే, తీగలై పారితే ఎంతో సంతోషిస్తారు. ఆ పాదుల్లో మొదటగా పూసిన బీరపువ్వుకు బొట్లు పెడతారు.
ఏడుగురు అక్క చెల్లెళ్లు..
పూర్వకాలంలో నిరక్షరాస్యులైన ప్రజలు, గిరిజనులు రాయిని కడిగి పసుపు కుంకుమతో బొట్లుపెట్టి దేవత అని మొక్కేవారు. ప్రపంచమంతటా ఈ అమ్మ దేవతల పూజ ఉంది. రూపాలు లేవు కాని వివిధ పేర్లతో అమ్మవార్లను పూజించుకుంటారు. దేవతల్లో ప్రధానంగా ఏడుగురు అక్కా చెల్లెళ్లు. సప్తమాతృకల్లో ఉండే చాముండి దేవతను సౌమ్య రూపంగా గుళ్లల్లో ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు.పోషణ ఇచ్చేదిపోచమ్మ తల్లి అని తెలంగాణలో కొలుస్తారు.
గ్రామాల్లో ..పోచమ్మ, మైసమ్మ, ఊరమ్మ, ఊరడమ్మ, కట్ట మైసమ్మ, సరిహద్దులపోచమ్మ, వనంపోచమ్మ, దుర్గమ్మ, మహంకాళమ్మ, బద్ది΄ోచమ్మ, పెద్దమ్మ,పోలేరమ్మ, ఎల్లమ్మ, మాతమ్మ.. ఇలా రక రకాల పేర్లతో ఉన్న ఎందరో అమ్మ తల్లులకు బోనాలు సమర్పిస్తారు. కాటమరాజు, బీరప్ప, మల్లన్న.. తొట్టెలు,పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ప్రజల విశ్వాసాలకు అద్దం పడతాయి. బోనాల పండుగకు అత్తగారింటినుంచి తల్లిగారింటికి వచ్చిన ఆడపిల్లలు బోనం ఎత్తుకోవడం అంటే ఆ ఇంటికి లక్ష్మీదేవే వచ్చినట్టుగా భావిస్తారు. – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి
Comments
Please login to add a commentAdd a comment