bonala festival
-
మది నిండుగా.. శ్రావణ బోనం!
ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో బోనాల పండుగ ్రపారంభం అవుతుంది. గోల్కొండ జగదాంబికకు తొలిబోనం సమర్పణతో మొదలై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి, లాల్ దర్వాజ బోనాలతో నగరం పల్లె రూపం నింపుకుంటుంది. ఆషాఢమాసంలో బోనాలు హైదరాబాద్‌లో ముగుస్తాయి. శ్రావణమాసం ్రపారంభం అవుతూనే అమావాస్య ఆదివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన బోనాల పండుగ ప్రతి ఇంట సంబరమవుతుంది. మన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలూ బోనాల పండగను జరుపుకోవడం విశేషం.సామూహిక చైతన్యం..గ్రామదేవతలకు వండి పెట్టే భోజనమే బోనం అంటారు. బోనాన్ని గుడిలో అమ్మవారికి సమర్పించడంతో నైవేద్యం అవుతుంది. బోనాన్ని జేజ బువ్వ అని కూడా (తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో్ల) అంటారు. వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, రుతుమార్పుల వల్ల వచ్చే అంటురోగాలు, ఆనారోగ్యాల పాలు కాకుండా ఉండాలని అమ్మ దేవతలకు మొక్కుకుంటారు. ్రపాచీన కాలం నుంచి ఒక ఆచారాన్ని తీసుకువచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కూడా ఈ బోనం సంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు.గిరులలో సిరులు కురవాలని..గిరిజనులు సంవత్సరానికి ఒకసారిపోడు వ్యవసాయం ద్వారా పంట పండిస్తారు. దున్నే సమయంలో ముందు కొట్టే చెట్టుకు మొక్కుతారు.‘నేను వ్యవసాయం కోసమే నిన్ను కొడుతున్నాను. నీమీద నాకేం కోపం లేదు క్షమించమ్మా! రెండు రోజుల తర్వాత వస్తాన’ని చెప్పి మూడోరోజు దుక్కి దున్ని గింజలు నాటుతారు. చిక్కుడుపంట పండితే చిక్కుళ్ల పండుగ చేసుకుంటారు. ఇంటిపాదుల్లో పెట్టిన విత్తనాలు మొలకలే, తీగలై పారితే ఎంతో సంతోషిస్తారు. ఆ పాదుల్లో మొదటగా పూసిన బీరపువ్వుకు బొట్లు పెడతారు. ఏడుగురు అక్క చెల్లెళ్లు..పూర్వకాలంలో నిరక్షరాస్యులైన ప్రజలు, గిరిజనులు రాయిని కడిగి పసుపు కుంకుమతో బొట్లుపెట్టి దేవత అని మొక్కేవారు. ప్రపంచమంతటా ఈ అమ్మ దేవతల పూజ ఉంది. రూపాలు లేవు కాని వివిధ పేర్లతో అమ్మవార్లను పూజించుకుంటారు. దేవతల్లో ప్రధానంగా ఏడుగురు అక్కా చెల్లెళ్లు. సప్తమాతృకల్లో ఉండే చాముండి దేవతను సౌమ్య రూపంగా గుళ్లల్లో ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు.పోషణ ఇచ్చేదిపోచమ్మ తల్లి అని తెలంగాణలో కొలుస్తారు. గ్రామాల్లో ..పోచమ్మ, మైసమ్మ, ఊరమ్మ, ఊరడమ్మ, కట్ట మైసమ్మ, సరిహద్దులపోచమ్మ, వనంపోచమ్మ, దుర్గమ్మ, మహంకాళమ్మ, బద్ది΄ోచమ్మ, పెద్దమ్మ,పోలేరమ్మ, ఎల్లమ్మ, మాతమ్మ.. ఇలా రక రకాల పేర్లతో ఉన్న ఎందరో అమ్మ తల్లులకు బోనాలు సమర్పిస్తారు. కాటమరాజు, బీరప్ప, మల్లన్న.. తొట్టెలు,పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ప్రజల విశ్వాసాలకు అద్దం పడతాయి. బోనాల పండుగకు అత్తగారింటినుంచి తల్లిగారింటికి వచ్చిన ఆడపిల్లలు బోనం ఎత్తుకోవడం అంటే ఆ ఇంటికి లక్ష్మీదేవే వచ్చినట్టుగా భావిస్తారు. – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
ఫిలింనగర్ వినాయకనగర్ బస్తీలో ఈదమ్మ ఆలయంలో బోనాల వేడుకలు (ఫొటోలు)
-
బోనాల పండుగకు వస్తుండగా.. తీవ్ర విషాదం!
వరంగల్: బోనాల పండుగకు వస్తుండగా స్కూటీ అదుపు తప్పి కిందపడడంతో ఓ యువకుడు మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన పులి రవీందర్(30) హనుమకొండ కోర్టులో జ్యుడీషియల్ క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తూ తన చిన్నమ్మ చిర్ర పద్మ ఇంట్లో ఉంటున్నాడు. స్వగ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల పండగ ఉండడంతో తన స్కూటీపై చిన్నమ్మ పద్మను తీసుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో చింతలపల్లి రైల్వేగేట్ వద్దకు రాగానే స్కూటీ అదుపు తప్పడంతో ఇద్దరు కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలలైన క్షతగాత్రులను వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా రవీందర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పద్మ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మృతుడి సోదరుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.భరత్ తెలిపారు. రవీందర్‌కు జిల్లా జడ్జి కృష్ణమూర్తి నివాళి.. హనుమకొండ జిల్లా కోర్టులో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్న పులి రవీందర్ ఆదివారం సంగెం మండల కేంద్రంలోని చింతలపల్లి రైల్వే గేట్ వద్ద స్కూటీపై నుంచి పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కృష్ణమూర్తి సతీసమేతంగా వరంగల్ ఎంజీఎం మార్చురీలో రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో వరంగల్, హనుమకొండ జ్యుడీషియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బుజ్జి బాబు, మల్లికార్జున్, కోర్టు సిబ్బంది, సర్పంచ్ల ఫోరం సంగెం మండల అధ్యక్షుడు డేటి బాబు తదితరులు ఉన్నారు. -
నేడు విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడానికి శనివారం భక్తులు అక్కడికి తరలి వెళ్లారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించే తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని పాతబస్తీ గౌలిపురా కోట మైసమ్మ దేవాలయం నుంచి మార్కెట్ వరకు బాజా భజంత్రీలతో కళా బృందాలు, పోతరాజుల నృత్య ప్రదర్శనలతో దారిపొడవునా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా గౌలిపురా కోట మైసమ్మ దేవాలయంలో అమ్మవారి వద్ద బంగారు పాత్రను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు బయలుదేరారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర
ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో మెల్బోర్న్ సిటీ రాక్బ్యాంక్ ప్రాంతానికి చెందిన దుర్గా మాత దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించి మొక్కుల్ని చెల్లించుకున్నారు . ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో పోతురాజుల నృత్యంతో సందడి నెలకొంది. బోనాల పాటలకు మనదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల భక్తులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ వేడుకల్ని ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తెలంగాణ న్యూస్ సంస్థ నిర్వాహకులు మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి,దీపక్ గద్దెలు గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం అంగరంగ వైభవంగా బోనాల జాతర జరపడంపై భక్తులు.. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. -
ఆ విషయంలో ఏమీ చెప్పలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: బోనాల ఘటాల ఊరేగింపు అనుమతి విషయంలో తానేమీ చేయలేనని హైకోర్టు స్పష్టం చేసింది. అక్కన్న, మాదన్న ఆలయ నిర్వాహకులు సౌత్ జోన్ డీసీపీకి మళ్ళీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాతబస్తీ హరిబౌలి శాలిబండలోని చారిత్రాత్మక కట్టడం అక్కన్న మాదన్న ఆలయంలో ఏటా బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కరోనా సాకు చూపి తమతో సంప్రదించకుండా ప్రభుత్వం బోనాల పండుగను నిలిపివేసిందంటూ ఆలయ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. బోనాల ఘటాల ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సంప్రదాయాలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాల పండుగ జరుపుతామని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది. ఈ క్రమంలో కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో ఊరేగింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని దేవాదాయ శాఖ కోర్టుకు తెలిపింది. ఇప్పటికే జరిగిన గోల్కొండ, సికింద్రాబాద్ బోనాలకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇందుకు బదులుగా... 72 సంవత్సరాలు గా అమ్మవారిని అంబారీపై ఉరేగిస్తున్నారని కోర్టుకు తెలిపిన పిటిషనర్... జూన్ 22 న పురీ జగన్నాథ్ యాత్రకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఘటాలతో పాటు అమ్మవారిని 3 కిలోమీటర్ల వరకు సామాజిక దూరం పాటిస్తూ ఏనుగు మీద ఉరేగిస్తామని తెలిపారు. ఈ విషయం గురించి ఇప్పటికే హైదరాబాద్ సీపీ, డీసీపీలకు అనుమతి ఇవ్వాలని కోరామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అర్చకులు వెళ్లి పూజలు చేసుకోవడానికి అనుమతి ఉందన్న దేవాదాయ అధికారులు... ఘటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇరువాదనలు విన్న కోర్టు.. సంబంధిత అధికారులకు మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించింది. పూరీ జగన్నాథ్ రథయాత్ర కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ విషయాన్ని పరీశీలించాలని సూచించింది. -
ఇళ్లలోనే బోనాలు: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది బోనాల పండుగను ప్రజలం తా ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శ్రీజగదాంబ అమ్మవారు, శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజ ఉమ్మడి దేవాలయాల్లో సాంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు, అలంకరణ, బోనం చేయాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం తలసాని అధ్యక్షతన బోనాల ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిటీ సభ్యుల సలహాల మేరకు ఈ ఏడాది బోనాలను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. బోనాల పండుగ జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, అందువల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామూహికంగా జరుపుకోవడం మంచిది కాదని చెప్పారు. నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించిందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, రాజాసింగ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు నాయిని నరసింహారెడ్డి, ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, పోలీ సు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, దేవాదాయశాఖ కమిషనర్లు లోకేశ్, అనిల్‌కుమార్, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అమెరికాలో బంగారు బోనం
చార్మినార్: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు అనుగుణంగా నగర భక్తులు అమెరికాలో తెలంగాణ బోనాల జాతర వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అమెరికాలోని హస్టన్ నగరంలో జరిగిన ‘వరల్డ్ తెలంగాణ కన్వేన్షన్–2018’ కార్యక్రమంలో మహిళా భక్తులు అమ్మవారికి బంగారు పాత్రలో తెలంగాణ బోనాన్ని సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అ«ధ్యక్షులు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో భక్తులు అమెరికాలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చర ణల నడుమ పూర్ణకుంభంతో ఆట ప్రతినిధులు బోనాలకు ఘనంగా స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి అమెరికాలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణలతో పాటు ఆట అ«ధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ఆట కన్వీనర్ బంగారు రెడ్డి తదితరులు పాల్గొన్నారని కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా తయారు చేయించిన బం గారు పాత్రకు మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో గత నెల 26న ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 27వ తేదీన తెల్లవారు జామున విమానంలో అమెరికా బయలుదేరి వెళ్లామన్నారు. -
గురుకుల పోస్టుల స్క్రీనింగ్ టెస్టు వాయిదా
బోనాల నేపథ్యంలో ఈ నెల 30కి వాయిదా పడిన పరీక్ష సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లోని వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 16న నిర్వహించాల్సిన ప్రిలిమినరీ పరీక్షను (స్క్రీనింగ్ టెస్టు) టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. బోనాల పండుగ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు, జూనియర్ కాలేజీ లైబ్రేరియన్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు జూలై 16న జరగాల్సిన పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు గురుకులాల్లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈటీ), ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, స్టాఫ్ నర్సు పోస్టులకు రాత పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. ఆ పరీక్షలు ఈనెల 31 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సందడి సందడిగా బోనాల పండుగ
అనంతపురం కల్చరల్ : నగరంలోని నాయక్‌నగర్‌లోని బంజారాల ప్రాచీన ఆలయంలో మంగళవారం సీతలాయ్యాడి బోనాల పండుగ వేడుకగా జరిగింది. ఏడాదికోసారి వచ్చే ఉత్సవాన్ని బంజారాలు ఘనంగా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన జనసందోహంతో నగర వీధులు కోలాహలంగా మారాయి. దాదాపు 200 మంది మహిళలు తలపై బోనాలు పెట్టుకుని జాతరగా వెళ్ళి అమ్మవారికి సమర్పించారు. అంతకు ముందు బంజారా పూజారులు నాయకుల కులదైవమైన మారెమ్మ తల్లి ప్రతిరూపాలైన పెద్దమ్మ, కాంకాళి, మరియమ్మ, సుంకులమ్మ, నాన్‌బాయి, హింగిలా భవానీ, మత్రాళీ తదితర అక్కమ్మ దేవతలను సర్వంగ సుందరంగా అలంకరించి ప్రతిష్టించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు, వృద్ధులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు చంద్రీబాయి, కృష్ణానాయక్ మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా లంబాడీలుగా, సుగాళీలుగా, నాయక్‌లుగా పిలవబడుతున్న బంజారాలు ఏ ప్రాంతంలో ఉన్నా తమ సంస్కృతిని మరచిపోకుండా చేసుకునే పండుగలకు నిదర్శనమే సీతాలయ్యాది ఉత్సవమన్నారు. కార్యక్రమంలో శంకరశివరావు రాథోడ్, లక్ష్మణా నాయక్, కళావతి తదితరులు పాల్గొన్నారు. -
వారికి ముందస్తు ‘పండగే’!
►బోనాల పనుల పేరిట రూ.10 కోట్లకు ‘టెండర్’ ►జీహెచ్ఎంసీలో ఏటా ‘తంతు’గా వ్యవహారం ►పైపై పనులతో నిధుల స్వాహాకు రంగం సిద్ధం సిటీబ్యూరో : ప్రతియేటా బోనాల పండుగంటే జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లకు పండగే! బోనాల పేరిట ఏటా దాదాపు రూ.10 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు చూపించడం.. పైపై పూతలతో పనుల్ని మమ అనిపించడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా రూ.10 కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి కేవలం మూడు జోన్లకు సంబంధించిన పనులకే. ఇంకా రెండు జోన్ల ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉంది. ప్రతిపాదనలు ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. బోనాల పేరిట నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, ఏ సంవత్సరం కూడా బోనాల పండగ నాటికి పనులు పూర్తిచేసిన పాపాన పోలేదు. ముందస్తుగానే ప్రతిపాదనలు, నిధుల మంజూరు జరిగినప్పటికీ, తీరా పండగ తేదీలు సమీపించేదాకా పనులు చేపట్టకపోవడం.. చేసే కొన్ని పనులు సైతం తూతూమంత్రంగా చేయడం పరిపాటిగా మారింది. బోనాల సందర్భంగా ఆయా ఆలయాలకు వెళ్లే స్థానిక భక్తుల సౌకర్యార్థం ఆలయాలకు దారి తీసే మార్గాలన్నింటికి మరమ్మతులు చేయడం, గుంతలు పూడ్చటం వంటి పనులు చేస్తారు. వీటితోపాటు ఆలయాలకు సున్నాలు వేయడం, దెబ్బతిన్న ప్రాంతాల్లో షాబాద్ ఫ్లోరింగ్ వంటి పనులు చేస్తారు. ఇంకా ఆలయాలకు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణలు సైతం చేస్తారు. ఇవి చిన్న చిన్న పనులు కావడం.. మరమ్మతులే ఎక్కువగా ఉండటం, నాణ్యత పరీక్షల వంటివాటికి ఆస్కారం లేకపోవడంతో ఖర్చు చేయకుండానే బిల్లులు పొందడం పరిపాటిగా మారింది. బోనాల పేరిట జరిగే పనుల్ని పండగలోపే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, పూర్తి చేయరు. ఇంకా పనులు జరుగుతున్నట్లు రికార్డుల్లో పేర్కొని మళ్లీ బోనాల పండగ వచ్చేంతదాకా జాప్యం చేస్తారు. మళ్లీ పండగొస్తే మళ్లీ నిధులు మంజూరవుతాయి కనుక పాతవాటి గురించి ప్రశ్నించే వారుండరు. ఏటా ఇదో తంతుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో బోనాల పేరిట మంజూరైన నిధులతో ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్నట్లు చూపెడతారు. బోనాల సందర్భంగా ఆలయాల వద్ద మాత్రమే పనులు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఎక్కడో అక్కడ చేస్తున్నట్లు చూపెడతారు. అవైనా పూర్తిగా చేస్తారో,..చేయరో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకే తెలియాలి. ఏటా వందల కోట్ల పనులు చేసే జీహెచ్ఎంసీలో రూ.10 కోట్లు పెద్ద లెక్కలోవి కాకపోవడంతో వీటి గురించి పెద్దగా పట్టించుకుంటున్న వారు లేరు. దీంతో పండగ నిధులు పక్కదారి పట్టేందుకు ఎంతో అవకాశం ఉంది. ఈసారైనా అలా జరగకుండా పక్కాగా పనులు చేపట్టాలని, పండగలోపునే మంజూరైన నిధులన్నీ ఖర్చు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఏ మేరకు పనులు చేస్తారో వేచి చూడాల్సిందే. -
పరవశం
-
కళాత్మక బోనాలు
బోనాల పండుగ కళాత్మకంగా జరగనుంది. మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు ‘చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ’లో తెలంగాణ ఆర్టిస్టులు ఈ ‘బోనాలు’ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఇందులో ప్రవుుఖ చిత్రకారులు తవు చిత్రాలు ప్రదర్శిస్తారు. పెయింటింగ్స్, స్కల్చర్, డ్రాయింగ్స్, సినిమా, ఫొటోగ్రఫీ, పోయెట్రీ... ఇలా భిన్న కళల ద్వారా బోనాల ప్రాశస్త్యాన్ని వివరించనున్నారు కళాకారులు. మనోహర్ చిలువేరు పెయింటింగ్స్, స్కల్ప్చర్, లింగమ్మ చిలువేరు డ్రాయింగ్స్ కొలువుదీరనున్నాయి. దూలం సత్యనారాయణ సినిమాతో పాటు రమ వీరేశ్‌బాబు ఫొటోగ్రఫీ కూడా ప్రదర్శనలో ఉంటుంది. తెలంగాణ కవి శ్రీనివాస్ దెంచనాల కవిత్వం వినిపిస్తారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ బి.నర్సింగరావు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. - సవుయుం: ఈ రోజు సాయుంత్రం 5 గంటలు స్థలం: చిత్రవురుు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ -
ముంబైలో బోనాలు
సాక్షి, ముంబై: నగరంలో తెలుగు ప్రజలు ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసం ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ శ్రావణ మాసాన్ని కచ్చితంగా పాటించేవారు గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. దీంతో మాంసాహారం తినేవారు ఈ శనివారం లోపు పోచమ్మ పండుగ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రకారం ఇదే ఆఖరు ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పోచమ్మ పండుగను జర్పుకున్నారు. పోచమ్మ గుడులన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడాయి. కామాటిపుర, వర్లీలోని భోగాదేవి తదితర పోచమ్మ ఆలయాలన్నీ సందడిగా కనిపించాయి. ఎంతో ఓపిగ్గా మహిళలు, పిల్లలు క్యూలో నిలబడి పోచమ్మకు కోళ్లు, మేకలు, నైవేద్యాలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భాజాబజంత్రీలతో తలపై బోనాలు పెట్టుకుని గుడికి చేరుకున్నారు. పూజలుచేసి నైవేద్యాలు సమర్పించారు. మరికొందరు స్థానికంగా ఉంటున్న వారందరు కలిసికట్టుగా ఒకేచోటా ఈ పండుగను జరుపుకున్నారు. ఠాణేలో... ఠాణేలోని తెలుగు సేవా మండలి సభ్యులు ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయమే పిల్లలు, మహిళలు,ృవద్ధులు శాస్త్రినగర్‌లో ఉన్న జానకీమాత దేవి మందిరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలుగు ప్రజలు జానకీమాత దేవినే పోచమ్మ తల్లిగా భావిస్తారు. వెంట తెచ్చుకున్న మేకలు, కోళ్లు బలిచ్చారు. నైవేద్యాలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నట్లు ఆ సంస్థ సభ్యులు మెంగు రమేశ్, మెంగు లింగన్న, గుండారపు పుల్లయ్య, గంగాధరి శంకర్ తదితరులు చెప్పారు. ఘాట్కోపర్లో... కామ్‌రాజ్‌నగర్‌లోని తెలుగు రహివాసి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ గుడిలో ఆదివారం ఉదయం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇక్కడుంటున్న దాదాపు 500లకుపైగా తెలుగు కుటుంబాలు కలిసి ఈ పండగను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మేకలు బలిచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాటుచేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు గుల్లే గంగాధర్, శంకర్ నాయక్, బాస శంకర్, జక్కుల తిరుపతి, కట్ట అశోక్, గుర్రం శ్రీనివాస్, తిక్కు నాయక్, సత్యనారాయణ తదితరులు చెప్పారు. బోరివలిలో.. బోరివలి, న్యూస్‌లైన్: మలాడ్‌లోని తెలంగాణ ప్రజలు ఆదివారం అశోక్‌నగర్‌లోని బాన్ డోంగిరిలో తెలుగు సమాజ్ సొసైటీ ఆధ్వర్యంలో పోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లకు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ 650 గజాల స్థలంలో నలుగురు అమ్మవార్ల మందిరాలు ఉన్నాయి. స్థానిక ఆగన్న కుటుంబం నుంచే మొదట పెద్ద బోనం వెళుతుంది. తర్వాత మిగతా బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. కాగా, ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉంటారు. అమ్మవారికి ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో పి.ప్రభాకర్ రావు, జి.రాజ్ కుమార్, డి.కిషన్ రావు, డి.పాపారావు, వి. చిన్నికిష్టయ్య, ఎల్.కిషన్ రావు, పి.శ్రీనివాసరావు, జె.తిరుపతిరావు, బి.రాజన్న, ఎం.రవీందర్రావు, జి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మహంకాళి బోనాలు
కాజీపేటలో సందడే సందడి * అమ్మవారికి మొక్కులు * చెల్లించుకున్న భక్తులు * ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు కాజీపేట: పట్టణ శివారు సోమిడిలోని మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢమాసం చివరి ఆదివారం ఎంతో అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని ద ర్శించుకున్నారు. ఆలయ పూజారి ముత్యాల సరస్వతి, రాజు, లక్ష్మణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో దేవాలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. విష్ణుపురి సబర్మతి పాఠశాల, వెంకటాద్రినగర్, బాపూజీనగర్, ప్రశాంత్‌నగర్‌లో అమ్మవారికి మహిళలు మంగళహారతులతో ఎదురేగి మొక్కులు సమర్పించుకున్నారు. కాంగ్రెస్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి సాంబయ్య, టీఎన్టీయూసీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అంకూస్ అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకట్టుకున్న నృత్యాలు.. డప్పు వాయిద్యాల మోతలు, చిందు కళాకారులు, పోతరాజులు చేసిన నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. దేవతామూర్తుల వేషధారణలతో చిందు కళాకారులు ఊరేగింపు అగ్రభాగాన నిలిచి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరూరి సాంబయ్య, గౌని సాంబయ్యగౌడ్, రాంచరణ్‌తేజ్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్, బక్కతట్ల మోహన్, బుర్ర తిరుపతి, స్థానిక పెద్దలు ధర్మయ్య, శ్రీనివాస్, ఎండీ అలీసాహెబ్, యాదగిరి, గద్దె సతీష్ పాల్గొన్నారు. -
నగరం భక్త జనసంద్రం
-
‘మహంకాళి’ మురిసేలా..
దోమకొండ : అమ్మవారికి భక్తితో బోనాలు సమర్పించడానికి తరలివచ్చిన భక్తులతో మండల కేంద్రంలోని మహంకాళి అమ్మవారి మందిరం పోటెత్తింది. నైవేధ్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మహంకాళి ఆలయంగా పేరుగాంచిన దోమకొండలోని ఆల యం వద్ద ఆదివారం బోనాల పండుగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉద యం అమ్మవారికి అభిషేకాదులు నిర్వహించారు. 7 గంటలకు ఘటం మొదలైంది. పోతరాజులు సందడి చేశారు. 11 గంటలకు రంగం ప్రారంభమైంది. భవిష్యవాణి వినడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు భావి కృష్ణమూర్తి శర్మ, ఇతర పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు గండ్ర మధుసూదన్‌రావు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, స్థానిక సర్పంచ్ దీకొండ శారదతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవం లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాంచంద్రం, ప్రతినిధులు శ్రీనివాస్, రాజేందర్, నర్సయ్య, శేఖర్, రాజు, నర్సింలు, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కులు చెల్లిస్తేనే.. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని రంగనాయకి భవిష్యవాణి వినిపించింది. అదీ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటేనే వానదేవుడు కరుణిస్తాడని కండిషన్ పెట్టిం ది. దోమకొండలో బోనాల పండుగ సందర్భంగా రంగనాయకి భవిష్యవా ణి వినిపించింది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని పేర్కొంది. శివుడికి అభిషేకాలు చేయాలని సూ చించింది. పూజలతో దేవతలు కరుణిస్తేనే వర్షాలు కురుస్తాయని, పాడిపంటలు, పిల్లా పాపలతో ప్రజలు సుభిక్షంగా ఉంటారని పేర్కొంది. -
సల్లగసూడు తల్లీ!
రాజధానితోపాటు భివండీ ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పోచమ్మకు బోనాలు, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు. సాక్షి, ముంబై: తెలంగాణ ప్రజల పర్వదినాల్లో ముఖ్యమైన బోనాల ఉత్సవాల్లో భాగంగా ముంబై, ఇతర ప్రాంతాల్లోని తెలంగాణ ప్రజలు పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏటా ఆశాఢమాస పౌర్ణమి మరుసటి రోజు నుంచి దాదాపు 15 రోజుల వరకు పోచమ్మకు బోనాలు, జంతుబలులతో తెలంగాణవాసులు మొక్కులు తీర్చుకుంటా రు. కామాటిపుర, వర్లీ, దాదర్, పరేల్ తదితర ప్రాం తాలకు చెందిన అనేక మంది వేడుకలకు వచ్చారు. వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని బ్యాండుమేళాలతో ఊరేగింపుగా మందిరాలకు వెళ్లారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా చేసిన బోనాలతోపాటు నైవేద్యం సమర్పించి పూజలు చేసి కోళ్లు, మేకలను బలిచ్చారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజ లు పోచమ్మ బోనాలను జరుపుకుంటున్నారు. ఈయేడు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు కావడంతో వీరిలో కొత్త ఉత్సాహం కనిపించింది. బోయివాడలో... పరేల్ బోయివాడలో ‘టర్నర్ సానెటోరియం తెలు గు సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా కు చెందిన ప్రజలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నారు. వీరంతా సుమారు 50 ఏళ్ల కిందటే సం ఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి బోయివాడ అవరణలో శ్రీ పోచమ్మ దేవిని కొలుస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢమాసంలో ప్రత్యేకంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు నిర్వహించినట్టు సంఘం ప్రధాన కార్యదర్శి కొండ సత్యనారాయణ తెలిపారు. పోచమ్మ పండుగను పురస్కరించుకుని పిల్లపాపలతోపాటు కుటుంసభ్యులంతా పోచమ్మకు ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో తెలంగాణలో ఉన్న అనుభూతి కలిగింది. ఇక్కడి పోచమ్మ తల్లిని స్థానిక భక్తులే కాకుండా ముంబైలోని ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలకు సంఘం అధ్యక్షుడు తీరందాస్ సత్యనారాయణ, కార్యదర్శులు శ్రీపతి సహదేవ్, ఆడెపు దయానంద్, కోశాధికారి సంగిశెట్టి ధనంజయ్ ఏర్పాట్లు చేశారు. భివండీలో.. పట్టణంలోని తెలుగు ప్రజలు పోచమ్మ పండుగను ఆదివారం వైభంగా నిర్వహించారు. పద్మనగర్‌లో ఉంటున్న తెలుగు ప్రజలు వరాలదేవి మందిరం వద్ద అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బారులు తీరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్థానిక తెలుగు కార్పొరేటర్ మురళి మచ్చ, లక్ష్మీ అశోక్ పాటిల్ వరాలదేవి మందిరం వద్ద భక్తులు ఇబ్బం దులు పడకుండా తగు చర్యలు చేపట్టారు. భివండీచుట్టు పక్కల ప్రాంతాలు కామత్‌ఘర్, బండారి కంపౌండ్, పద్మనగర్, కన్నేరి వంటి దూర ప్రాం తాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు వర్షంలో తడవకుండా మందిర ప్రాంగణంలో మండపాలు వేసి మంచినీటి సదుపాయాలు కల్పించారు. భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కార్యవర్గ సభ్యులు..భక్తులు దొంగలబారిన పడకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. -
గోల్కొండంత జనం
-
అమ్మా బెలైల్లినాదో..
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బోనాల పండుగ - కిటకిటలాడుతున్న పోచమ్మ మందిరాలు సాక్షి, ముంబై : రాష్ట్రవ్యాప్తంగా పోచమ్మ పండుగలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రాంతాల్లో మాదిరిగానే ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసం నుంచి తెలుగువారు ఈ పోచమ్మ పండుగను ఎన్నో యేళ్లుగా జరుపుకుంటున్నారు. కామాటిపురాలో చాలా యేళ్ల కిందటే పోచమ్మ గుడిని నిర్మించి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కామాటిపురాతోపాటు వర్లీ, దాదర్, బోరివలి, ఘాట్కోపర్, ఠాణే, భివండీ, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో పోచమ్మ గుడులు వెలిశాయి. ఈసారి ఆషాఢ మాసం జూన్ 27వ తేదీన ఆషాఢ అమావాస్యతో ప్రారంభంకాగా జూలై 26వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో అందరికీ సెలవు దినాలైన జూలై 6, 13, 20 తేదీల్లో పెద్ద ఎత్తున పోచమ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ కన్పించనుంది. వర్షాకాలంలో వచ్చే కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరుగకుండా, పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని పోచమ్మతల్లిని వేడుకుంటూ బోనాల పండుగను నిర్వహిస్తారు. పోచమ్మ పండుగ సందర్భంగా కొందరు పోచమ్మ దేవికి బోనాలు సమర్పించగా, మరికొందరు జంతుబలిని ఇస్తారు. ఆషాఢ మాసంలో పోచమ్మతల్లి పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తమ కూతుళ్లు పుట్టింటికివస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్లే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకుంటారు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే తెలుగు వారి పండుగ కావడంతో భక్తులు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. ముంబైలో ఈ పండుగను ఒకే రోజు కాకుండా జ్యేష్ట మాసం ముగిసిన అనంతరం శ్రావణం ప్రవేశించక ముందే వీలున్న రోజుల్లో, సెలవు దినాల్లో బంధుమిత్రులను ఆహ్వానించి ఘనంగా జరుపుకుంటారు. శ్రావణంలో ఉపవాసాలు మొదలవుతాయి కాబట్టి పోచమ్మ ఉత్సవాలు ఈ మాసానికి ముందే ముగుస్తాయి. పోచమ్మ తల్లికి సమర్పించే సామగ్రిలో టెంకాయలు, పసుపు-కుంకుమ, పూలు, ఫలాలు, పాలతోపాటు బెల్లం లేదా పంచదారతో కలిపి వండిన ప్రత్యేకమైన పరమాన్నం ఉంటాయి. వీటిని ఒక పాత్రలో పెట్టి, ప్రమిద వెలిగించి తీసుకొస్తారు. పోచమ్మకు భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తారు. అదేవిధంగా సంప్రదాయంగా వస్తున్న జంతుబలి(కోళ్లు, మేకలు)ని సైతం కొనసాగిస్తున్నారు. బోరివలిలో ఘనంగా ‘బోనాలు’ బోరివలి, న్యూస్‌లైన్: నగరంలో తెలుగు ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తూర్పుబోరివలిలోని హనుమాన్ నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం సాయంత్రం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లో కొలువైన పోచమ్మ తల్లికి సంఘం అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ నేతృత్వంలో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని పలు వీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లారు. ఎస్పీ రోడ్ నుంచి కార్టన్ రోడ్ నం-2లో నుంచి గావ్‌దేవి మందిరం వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అమ్మవారికి మహిళలు నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడూతూ.. 1976లో బోనాల పండుగను ముంబైలో ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండగగా బోనాలను ప్రకటించడంతో ఈ ఏడాది బోనాలను చాలా ఘనంగా నిర్వహించామని గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, గాజుల నర్సారెడ్డి, నీరటి భూమన్న, సేకుట పోచవ్వ, భూమల్ల గంగవ్వ, అదరవేని కుంటమల్లు, అవురకొండ నర్సవ్వ, లంబ లింగవ్వ, దేశవేని రవి, ఇడుగునూరి రాాజవ్వ, జయ సుతార్, సాయిల గంగవ్వ, వేగుర్ల లక్ష్మి, అదరవేని పద్మ, పెద్ద పద్మ తదితరులు పాల్గొన్నారు. -
బోన మెత్తిన ఇందూరు
జిల్లా కేంద్రంలో బోనాల పండగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకుని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. కరుణను వర్షించు తల్లీ నిజామాబాద్ కల్చరల్ : వర్షాలను సమృద్ధిగా కురిపించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ప్రార్థిస్తూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం నగరంలో బోనాల పండుగ నిర్వహించారు. పోచమ్మగల్లి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మగల్లి సంఘం వద్ద బోనాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి స్థానిక పెద్దపోచమ్మ దేవాలయం, దేవిరోడ్డులోని చిన్న పోచమ్మ(దేవిమాత) ఆలయం, వినాయక్‌నగర్‌లోని ఐదు చేతుల పోచమ్మతల్లి, మత్తడి పోచమ్మతల్లి, మహాలక్ష్మీనగర్‌లోని మహాలక్ష్మి ఆలయం వరకు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నగర అధ్యక్షుడు ఈర్ల రవీందర్, కార్యదర్శి లక్ష్మీనారాయణ, సభ్యులు జాలిగం గోపాల్, అంబెం సాయిలు, సతీశ్, ఈర్ల శేఖర్, ఈర్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
బోనమెత్తిన నగరం
అంగరంగ వైభవంగా గోల్కొండలో ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో తొలి పండుగకు పోటెత్తిన భక్త జనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ర్ట పండుగగా గుర్తించిన బోనాల ఉత్సవం ఆదివారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో అంగరంగవైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు ఈసారి కొత్త శోభను సంతరించుకున్నాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లంగర్‌హౌస్ చౌరాస్తా నుంచి అమ్మవారి తొట్టెలను, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ప్రథమ నజర్ బోనాలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పోతరాజుల నృత్యాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు నగినాబాగ్లోని నాగదేవత పుట్టకు పూజలు నిర్వహించి తలలపై బోనం పెట్టుకుని అమ్మవార్ల ఆలయానికి చేరుకున్నారు. 23 కుల వృత్తుల వారు అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంసృ్కతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని వాటి వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటుదామని ఉత్సవాలను ప్రారంభించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బోనాలు, రంజాన్ పండుగలకు భారీ భద్రత బోనాలు, రంజాన్ పండుగలను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాటుచేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు, అన్ని జిల్లాల ఎస్పీలకు తెలంగాణ రాష్ర్ట డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ఆదేశాలు జారీచేశారు.అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని, గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో నిఘా విభాగం సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. -
బోనభాగ్యం.. ఇక నుంచి అధికారిక సంబరం
* తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం * ఇక నుంచి అధికారిక సంబరం * ‘అమ్మా బెలైల్లినాదో నాయనా.. తల్లీ బయలెల్లినాదో నాయనా..’ ఏటా ఆషాఢ మాసంలో ఈ గానం భాగ్యనగరాన్ని పులకింపజేస్తుంది. ఆధ్యాత్మికతలో ఓలలాడిస్తుంది. నాలుగు శతాబ్దాల పైచిలుకు నగరంలో అన్ని వర్గాల ప్రజలు, విభిన్న సంస్కృతులను ఐక్యం చేసే మహోన్నత చారిత్రక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. జాతీయ ఖ్యాతి గడించిన విశిష్ట వేడుక. ఆషాఢంలోని తొలి ఆదివారం లేదా గురువారం ప్రారంభమయ్యే పండుగను నెల రోజులు నిర్వహిస్తారు. రాష్ర్టప్రభుత్వం అధికారిక ఉత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నేడు గోల్కొండ కోటలో బోనాలకు శ్రీకారం. వచ్చే నెల 27 వరకు కోటపై తొమ్మిది రకాల పూజలు నిర్వహిస్తారు. ఇవే రోజుల్లో పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలూ ప్రారంభమవుతాయి. నగరమంతటా సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ప్రత్యేక కథనం.. గోల్కొండ రాజధానిగా పాలించిన కుతుబ్‌షాహీల కాలంలోనే బోనాలకు శ్రీకారం చుట్టారు. అబుల్ హసన్ తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నల సలహాతో తానీషా తన కోటపైన శ్రీ జగదాంబిక, మహంకాళి అమ్మవార్ల ఆలయాన్ని కట్టి ఉత్సవాలు ప్రారంభించాడు. తరువాత అధికారంలోకి వచ్చిన అసఫ్జాహీలు వాటిని కొనసాగించారు. ఇది ఆనవాయితీగా మారింది. కోటపై ఉన్న అమ్మవారిని గోల్కొండ ఛోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో తిరిగి కోటపైన ప్రతిష్టిస్తారు. నవాబు పూజతో శాంతించిన మూసీ 1908 సెప్టెంబర్‌లో మూసీ వరదల కారణంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వరద నీరొచ్చింది. వరదలో అప్పటికే వేలాది మంది చనిపోయారు. నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి రాజా కిషన్ పర్షాద్ లాల్‌దర్వాజా అమ్మవారి మహత్యాన్ని నిజాం నవాబుకు వివరించారు. ఆలయంలో పూజలు చేస్తే అమ్మవారు శాంతించి వరదలు తగ్గుముఖం పడతాయన్నారు. దీంతో నవాబు ఒక బంగారు చాటలో కుంకుమ, పసుపు, మేలిమి ముత్యాలు తీసుకొని పూజలు చేశారు. అలా ఈ ఆలయంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. 1968లో కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖరేంద్ర సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. 2008 ఏప్రిల్‌లో అప్పటి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వర్ణ శిఖరం, వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్యమంత్రం బోనాల వేడుకల్లో ప్రతీ ఘట్టం ఆరోగ్య పరిరక్షణతో ముడిపడిందే. తొలకరి వర్షాలతో పాటే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. దీంతో రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. నీటి కాలుష్యం వల్ల కలరా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అలాంటి కలుషిత వాతావరణాన్ని శుభ్రం చేసే అద్భుతమైన ప్రక్రియ బోనాల పండుగలో ఉంది. ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రం చేసుకొని పసుపు, గుగ్గిలం, మైసాక్షి వంటి వాటిని పొగ వే యడం వల్ల వ్యాధికారక క్రిములు నశిస్తాయి. ఇక వేపచెట్టు గొప్పతనం అందరికీ తెలిసిందే. వేపాకు ముద్దను ఒంటికి పట్టించి స్నానం చేస్తే చర్మవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులకు వేప దివ్య ఔషధం. బోనాల పండుగ రోజు వేప కొమ్మలతో బోనాలను అలంకరించినా, గుమ్మానికి, దర్వాజలకు వాటిని వేలాడదీసినా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇక బోనం. కొత్త కుండలో పసుపుతో కలిపి అన్నం వండడం కూడా ఆరోగ్య పరిరక్షణలో భాగమే. ఈ వేడుకల్లో ఆరోగ్యభాగ్యం కూడా ఇమిడి ఉందని నగరానికి చెందిన ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అభిప్రాయపడ్డారు. వరాల వల్లి.. ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 13, 14వ తేదీల్లో జరుగుతాయి. ఈ వేడుకలకు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 1813లో కలరా సోకింది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇది అక్కడ మిలటరీ విధులు నిర్వహిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరటి అప్పయ్యను కలచి వేసింది. వెంటనే ఆయన ఉజ్జయినీ మహంకాళిని... కలరాను తగ్గించమనీ, అలా చేస్తే తన స్వస్థలంలో ఆలయం నిర్మిస్తామని వేడుకున్నారు. కలరా అదుపులోకి వచ్చింది. దీంతో అప్పయ్య సహచరుల సాయంతో 1815లో సికింద్రాబాద్‌లో కర్ర విగ్రహాన్ని ప్రతిష్టించి ‘ఉజ్జయినీ మహంకాళి’గా నామకరణం చేశారు. 1864లో ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అప్పయ్యే చేయించి, ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. 1953 నుంచి దేవాదాయ శాఖ వేడుకలు నిర్వహిస్తోంది. చల్లని చూపుల... శీతల్‌మాత పిల్లా పాపలను ఆయురారోగ్యాలతో చల్లంగా చూసే అమ్మవారు శీతల మాత. సుల్తాన్‌షాహీలో వెలసిన ఈ అమ్మవారిని భక్తులు శీతల్ మాతగా... సిత్లా మాతగా కొలుస్తున్నారు. వందేళ్ల కిందట నిజాంల పాలన లో ఆర్థిక లావాదేవీలు చూసే అధికారిగా ఉన్న శాలిబండ దేవ్డీ నివాసి రాజా కిషన్ పర్షాద్ ఈ దేవాలయాన్ని సుల్తాన్‌షాహిలో నిర్మించారు. పిల్లలకు మశూచి, ఆటలమ్మ (చికెన్‌పాక్స్)లు వచ్చినప్పుడు అమ్మవారికి సాక పెట్టి పూజించేవారు. 1976లో ఆలయ కమిటీ ఏర్పడిన అనంతరం శ్రీ జగదాంబ దేవాలయంగా నామకరణం చేశారు. మీరాలంమండి అమ్మ నిజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతీరోజు రైతులు కూరగాయలు,ధాన్యం ఎడ్ల బండ్లపై మీరాలం మండికి తీసుకువచ్చిన రైతులు తమ ఎడ్ల బండ్లను ‘బండిఖానా’ లో నిలిపేవారు. ఇక్కడే ఒక రావిమొక్కను నాటి దాని వద్ద అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు చేశారు. 1960లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేసినప్పటి నుంచి ఆషాఢ మాసం మూడో బుధవారం రోజు బోనాల పండుగ జరుగుతుంది. ఐదు తరాలుగా.. అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత జరిగే రెండో ప్రధాన ఘట్టం రంగం. ఇందు లో ఏటా స్వర్ణలత చెప్పే ‘భవిష్యవాణి’కి ఎంతో ప్రాముఖ్యత. ఆ వివరాలు ఆమె వూటల్లోనే... వూ అమ్మపేరు ఎరుపుల ఇస్తారమ్మ. నాన్న నరసింహ. అక్క స్వరూప. తమ్ముడు దినేష్. నాతో కలిపి అమ్మ నాన్నలకు ముగ్గురు పిల్లలం. ప్రస్తుతం మారేడుపల్లిలో ఉంటున్నాం. మా ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే అమ్మవారికి అంకితం చేసే ఆచారం అనాదిగా వస్తోంది. అక్క స్వరూపను, నన్ను ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి అంకితం చేశారు. బడికి వెళ్లినా పెద్దగా చదువుకోలేదు. అక్క స్వరూప చనిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర రంగంలో భవిష్యవాణి వినిపించే బాధ్యత తీసుకున్నా. అక్కన్న,మాదన్నలు కొలిచిన తల్లి హరిబౌలిలోని అక్కన్న మాదన్నల మహంకాళి దేవాలయం హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నం. పాతబస్తీలోని ఈ ఆలయం లోని అమ్మవారికి భక్తులు 17వ శతాబ్దం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ రాజు తానీషా వద్ద కీలక హోదాల్లో పనిచేసిన అక్కన్న, మాదన్నలిరువురు అన్నదమ్ములు. వారు విధినిర్వహణలో భాగంగా రోజూ కోటకు వెళ్లే ముందు ఇక్కడ పూజలు నిర్వహించే వారు. 1948లో జరిగిన సైనిక చర్య తరువాత అప్పటి ఆర్యసమాజ్ ఈ ఆలయాన్ని గుర్తించింది. కోటకు రక్షణగా.. మైసవ్ము శాలిబండ హరిబౌలిలోని శ్రీ బంగారు మైసవ్ము దేవాలయుం పాతబస్తీ భక్తుల పాలిట కొంగుబంగారం. నిజాం పరిపాలనలో ప్రధాని కిషన్ పర్షాద్ దేవిడీలోనే శ్రీ బంగారు మైసమ్మ ఆలయం వెలసింది. కోట రక్షణ గోడకు ఎడమ వైపున అమ్మవారి దేవాలయం ఉంటే అన్ని విధాల కలిసొస్తుందనే నమ్మకంతో నిజాం కాలంలో ఇక్కడ అమ్మవారి దేవాలయం ఏర్పాటు చేశారు. హనుమంతు ఉరఫ్ పోతరాజు..! అతను అమ్మవారికి అంగరక్షకుడు. గ్రామదేవతల తోబుట్టువు. వారికి కావలి. ఇదీ పోతరాజు పరిచయం. అదంతా కథల్లోనే.. కానీ పాతబస్తీ ప్రజలకు ఎనిమిది దశాబ్దాలుగా తెలిసిన పోతరాజు మాత్రం హనుమంతే. నిలువెత్తు విగ్రహం, చక్కని శరీర సౌష్ఠవం.. కోర మీసాలు, జులపాల జుత్తు.. పెద్ద కళ్లు. భీతి గొలిపే రూపం.. మెడలో నిమ్మకాయల హారం. ఒంటినిండా పసుపు.. నుదుటిన పొడవాటి కుంకుం బొట్టు. చేతిలో కొరడా.. కాళ్లకు గజ్జెలు. బోనాల ఊరేగింపులో అగ్రభాగాన ఉండి ఎగిరి గెంతులేస్తూ, నృత్యం చేస్తూ జనాన్ని అదిలిస్తూ, బెదిరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ ‘పోతరాజు’ చెప్పే వివరాలు ఆయన మాటల్లోనే... మూసీనదికి వరదలొచ్చినప్పుడు పుట్టిన్నట.. మాయమ్మ చెప్పింది. ఆ వరదలు ఊర్ని ముంచెత్తుతా ఉంటే నన్నెత్తుకొని గంగబాయి గుట్ట మీదకు పరుగెత్తిందట. ఒక చింతచెట్టెక్కి ప్రాణాలు దక్కించింది. నా పుట్టుక గురించి నాకు తెలిసింది ఇంతే. మాయమ్మ పేరు నర్సమ్మ. నాయిన రామన్న. చిన్నప్పటి నుంచి ధూల్‌పేట్‌లోనే. మా పెద్దనాయిన నర్సింహ్మ. చెట్టుమీదికెక్కి సిగాలు ఊగేవాడు. మా పెద్దనాయిన నీడ నాకు (దేవత ఆవహించింది) పడింది. అప్పుడు నాకు పదిహేనేళ్లు. మస్తు బలంగా ఉండేవాణ్ణి. గోకుల్ప్రసాద్ అనే పూజారి నాతో తొలిసారి పోతరాజు వేషం వేయించిండు. ఇప్పటి వరకు ఆ ఆచారాన్ని తప్పలేదు. పురాణాపూల్, మంగల్హాట్, ధూల్‌పేట, గౌలిగూడ, గోడీ కీ కబర్, జిన్సీ చౌరాయి.పాతబస్తీలో ఎక్కడ బోనాల పండుగైనా పరుగెత్తుకొని పోయిన. అప్పట్లో యాటను (మేకపోతును) గావు (గొంతు కొరికేయడం) పట్టేవాణ్ణి.అమ్మవారి పండుగొచ్చిందంటే నాకు నిమిషం తీరిక ఉండేది కాదు. పూరానాపూల్‌లో మహంకాళమ్మ గుడి కట్టించిన. యాదగిరిగుట్ట నుంచి గాంధీ బొమ్మ తెప్పించి ఇక్కడ పెట్టించింది కూడా నేనే. ఎన్నెన్నో అపురూప ఘట్టాలు మహంకాళి జాతరలో అనేక అపురూపమైన ఘట్టాలుంటాయి. ఈ నెల 29వ తేదీన ఘటాల ఎదుర్కోలుతో వేడుకలు ప్రారంభమవుతాయి. జాతర సందర్భంగా సికింద్రాబాద్ జనసంద్రాన్ని తలపిస్తుంది. పుట్టింటి నుంచి వచ్చే అమ్మవారికి ఘటం తో స్వాగతం పలుకుతూ తోడ్కొని వచ్చేదే ఘటోత్సవం. ఆలయం నుంచి పసుపు, కుంకుమ,పూలను తీసుకెళ్లి కర్బలమైదాన్లో ఘటాన్ని అలంకరిస్తారు. వెదురు దబ్బల మధ్యలో రాగి చెంబు ఉంచి, అమ్మవారి వెండి విగ్రహాన్ని పెడతారు. అలా ఊరి పొలిమేర నుంచి బయలుదేరిన తల్లి భక్తజనం నడుమ ఆలయానికి విచ్చేస్తుంది. 9 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తుంది. బోనాల చివరి రోజు జరిగే అంబారీ ఊరేగింపుతో తల్లిని సాగనంపుతారు. కుస్తీలకూ పోయేవాణ్ని... ఆ రోజుల్లో లాల్ పహిల్వాన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న. కుస్తీపోటీలకు పోయేవాణ్ని. గద్వాల్ మహారాణి దగ్గర కూడా పోటీలల్ల పాల్గొన్నం. బతికినన్ని రోజులు బాగానే బతికిన. నవాబులకు కూడా క్షవరాలు చేసిన. ‘సర్కార్ క్యా హై’ అంటే చాలు చేతికి ఎంతొస్తే అంత డబ్బు ఇచ్చే వాళ్లు. నాకు ఇద్దరు భార్యలు కమలమ్మ, యాదమ్మ. కమలమ్మ చనిపోయింది. ఇద్దరికీ కలిపి 15 మంది పిల్లలు. వారిని నేనూ, యాదమ్మ సాది పెంచి పెద్ద జేసినం. చాలా కష్టపడ్డం. కడుపు మాడ్చుకొని బతికినం. కానీ ఏం లాభం. అంతా చెట్టుకొకలు, పుట్టకొకలు పోయిండ్రు.హైదరాబాద్‌ల ఎవ్వరు ఎక్కడ ఉంటండ్రో తెల్వదు. నా పెద్దకొడుక్కే 75 ఏళ్లు ఉంటది. ఎంతమంది పిల్లలు ఉంటే మాత్రం ఏమైంది. నా బతుకు నేనే బతకుతున్నా. పిల్లలకు మంత్రం వేయమని నా దగ్గరకొస్తరు. పైసో,ఫలమో ఇస్తరు. ఆ డబ్బులతోనే బతుకుతున్న...’ అని ముగించాడు హనుమంతు. ఉజ్జయినీ మహంకాళి రంగం చెప్పడానికి ముందుగా పెళ్లి (మాంగల్యధారణ) జరగాల్సి ఉంది. అందరికీ జరిగే పెళ్లిలాగే నాకూ జరిగినా పెళ్లి కొడుకు ఉండడు. ఖడ్గంతో నాకు మాంగల్యధారణ చేయించి ఆ తంతు పూర్తి చేశారు. నాటి నుంచి నా జీవితం అమ్మవారికే అంకితమైంది. అలా పదహారేళ్లుగా భవిష్యవాణి వినిపిస్తున్నా. ఆదివారం బోనాలు సమర్పించడం పూర్తికాగానే సోమవారం రంగం ఏర్పాట్లుంటారుు. ఆ రోజు తెల్లవారు జామునే లేచి స్నానం చేసి దుస్తులు ధరించి ఆలయానికి వస్తా. రోజంతా ఉపవాసమే. ముఖానికి పసుపు రాసుకుంటా.మహంకాళి ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ ఎదురుగా పచ్చి కుండపై నన్ను నిలబెడతారు.అప్పుడు అమ్మవారు నన్ను ఆవహిస్తారు. అటు తర్వాత ఏం జరిగిం దనేది నాకు గుర్తుండదు. టీవీల్లో చూసి అసలు నేనేనా ఇదంతా చెప్పిందనిపిస్తుంది. అవ్మువారి సేవకు అంకితమైన నాకు కుటుంబం, పిల్లలు వంటి ఆలోచనలు ఉండవు. ఆలయం నుంచి కొన్నేళ్లుగా నెలకు రూ.3వేలు వస్తున్నాయి. నా జీవనం కోసం కుట్టు పనిచేస్తుంటా. ప్రతి శుక్ర, మంగళవారాల్లో అమ్మవారి దేవాలయానికి వచ్చి ముత్తయిదువులకు పసుపు కుంకుమ అందిస్తుంటా. తొలుత మా పూర్వీకురాలు జోగమ్మ భవిష్యవాణి వినిపించేది. అటు తర్వాత బాలమ్మ, పోచమ్మ, మా నాన్నమ్మ బాగమ్మ, మా అక్క స్వరూపరాణి దాన్ని కొనసాగించారు. ఐదు తరాల నుంచి మేవుు తల్లిసేవలో కొనసాగుతున్నాం. - దార్ల వెంకటేశ్వరరావు