బంగారు బోనానికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న ప్రతినిధులు
చార్మినార్: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు అనుగుణంగా నగర భక్తులు అమెరికాలో తెలంగాణ బోనాల జాతర వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అమెరికాలోని హస్టన్ నగరంలో జరిగిన ‘వరల్డ్ తెలంగాణ కన్వేన్షన్–2018’ కార్యక్రమంలో మహిళా భక్తులు అమ్మవారికి బంగారు పాత్రలో తెలంగాణ బోనాన్ని సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అ«ధ్యక్షులు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో భక్తులు అమెరికాలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చర ణల నడుమ పూర్ణకుంభంతో ఆట ప్రతినిధులు బోనాలకు ఘనంగా స్వాగతం పలికారు.
భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి అమెరికాలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణలతో పాటు ఆట అ«ధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ఆట కన్వీనర్ బంగారు రెడ్డి తదితరులు పాల్గొన్నారని కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా తయారు చేయించిన బం గారు పాత్రకు మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో గత నెల 26న ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 27వ తేదీన తెల్లవారు జామున విమానంలో అమెరికా బయలుదేరి వెళ్లామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment