గురుకుల పోస్టుల స్క్రీనింగ్ టెస్టు వాయిదా
గురుకుల పోస్టుల స్క్రీనింగ్ టెస్టు వాయిదా
Published Wed, Jul 5 2017 2:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM
బోనాల నేపథ్యంలో ఈ నెల 30కి వాయిదా పడిన పరీక్ష
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లోని వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 16న నిర్వహించాల్సిన ప్రిలిమినరీ పరీక్షను (స్క్రీనింగ్ టెస్టు) టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. బోనాల పండుగ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు, జూనియర్ కాలేజీ లైబ్రేరియన్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు జూలై 16న జరగాల్సిన పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు గురుకులాల్లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈటీ), ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, స్టాఫ్ నర్సు పోస్టులకు రాత పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. ఆ పరీక్షలు ఈనెల 31 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement