చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడానికి శనివారం భక్తులు అక్కడికి తరలి వెళ్లారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించే తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని పాతబస్తీ గౌలిపురా కోట మైసమ్మ దేవాలయం నుంచి మార్కెట్ వరకు బాజా భజంత్రీలతో కళా బృందాలు, పోతరాజుల నృత్య ప్రదర్శనలతో దారిపొడవునా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా గౌలిపురా కోట మైసమ్మ దేవాలయంలో అమ్మవారి వద్ద బంగారు పాత్రను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment