
కిర్లంపూడి: ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం రానేవచ్చింది.. ఎక్కడ చూసినా కొత్త అల్లుళ్ల సందడే సందడి. అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదారోళ్ల (గోదావరి జిల్లాలు) తర్వాతే ఎవరైనా అంటారు పెద్దలు. ఈ నానుడికి అద్దం పట్టేలా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన ఉద్దగిరి వెంకట రామారావు, రమణి దంపతులు కొత్త అల్లుడికి శనివారం ‘శత’ పిండి వంటల భోజనం స్వయంగా వడ్డించి తమ ప్రేమను చాటుకు న్నా రు. అత్తారింట్లో తమ కుమారుడికి లభించిన మర్యాదలను చూసి కాకినాడకు చెందిన బాదం సతీష్, కుమారి దంపతులు మురిసిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment