Alludu Adhurs
-
కొత్త అల్లుడికి ‘శత’ పిండి వంటల భోజనం
కిర్లంపూడి: ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం రానేవచ్చింది.. ఎక్కడ చూసినా కొత్త అల్లుళ్ల సందడే సందడి. అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదారోళ్ల (గోదావరి జిల్లాలు) తర్వాతే ఎవరైనా అంటారు పెద్దలు. ఈ నానుడికి అద్దం పట్టేలా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన ఉద్దగిరి వెంకట రామారావు, రమణి దంపతులు కొత్త అల్లుడికి శనివారం ‘శత’ పిండి వంటల భోజనం స్వయంగా వడ్డించి తమ ప్రేమను చాటుకు న్నా రు. అత్తారింట్లో తమ కుమారుడికి లభించిన మర్యాదలను చూసి కాకినాడకు చెందిన బాదం సతీష్, కుమారి దంపతులు మురిసిపోయారు. -
మరో స్పెషల్ సాంగ్?
ఇటీవలే ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు ‘బిగ్‌బాస్’ ఫేమ్ మోనాల్ గజ్జర్. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేయబోతున్నారని టాక్. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తీ సురేశ్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటలో మోనాల్‌తో స్టెప్స్ వేయించాలని చిత్రబృందం భావిస్తోందట. మరి సూపర్ స్టార్‌తో మోనాల్ మాస్ స్టెప్స్ వేస్తారా? చూడాలి. ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. -
స్పెషల్ సాంగ్..మోనాల్‌కు అంత రెమ్యునరేషనా?
బిగ్‌బాస్ సీజన్-4 అనంతరం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. అప్పటివరకు ఐదారు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిగ్‌బాస్‌తో సొంతం చేసుకుంది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ఇది మోనాల్‌కు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. (ఇల్లు కొనబోతున్న మోనాల్?!) ఇటీవలె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మరింత పబ్లిసిటీని తెచ్చుకుంది ఈ గుజరాతీ భామ. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ 50 లక్షల రూపాయల భారీ రెమ్యునరేషన్ అందుకుందట. ప్రస్తుతం ఆమెకున్న ఫేమ్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు కూడా మోనాల్ అడిగినంత మొత్తంలో ఇవ్వడానికి ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఏదైనా షాపు ఓపెనింగ్‌కి సైతం 10 లక్షలు ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు అవకాశాలు ఉన్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకుంటే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (ఆరేళ్లు రిలేషన్షిప్, డిప్రెషన్లోకి వెళ్లిపోయా) -
కిల్ రాజు అంటావా..సినిమా ఎవడు ఇస్తాడు?
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుపై డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్రంగా ఖండించారు. దిల్‌రాజు గురించి మాట్లాడే అర్హత శ్రీను లేదన్నారు. శనివారం ఆయన అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను అనే వ్యక్తి ఈరోజు దిల్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. అసలు శ్రీను అనే వ్యక్తికి దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత ఉందా? శిరీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. వాళ్లతో మాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది.. అసలు దిల్ రాజు-శిరీష్ అనేవాళ్లు నైజాం ఏరియాలో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యుసర్ అనేవాళ్లే ఉండరు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నారు. వాళ్లు కనుక పక్కకు తప్పుకుంటే సినిమాలు చేయలేం బాబోయ్ అనే ప్రొడ్యుసర్లు ఉన్నారు. వాళ్లదగ్గరకు వెళ్లి సినిమా ఆగిపోతుంది.. రిలీజ్ కష్టంగా ఉంది అంటే ఎంత డబ్బు ఇచ్చి అయినా రిలీజ్ చేస్తారు. నాకు కూడా చాలా డబ్బు ఇచ్చారు. నాలా చాలామంది ఉన్నారు. (చదవండి : దిల్ రాజుపై ఫైరైన క్రాక్ డిస్ట్రిబ్యూటర్) ఇప్పుడేదో క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతున్నాడు.. నేను ఆరేళ్లలో ఆరు సినిమాలు చేశాను అని. నువ్ ఆరు చేస్తే వాళ్లు వంద సినిమాలు చేశారు. మొత్తం ఎగ్జిబిటర్స్‌కి లైఫ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ థియేటర్స్‌కి రప్పించారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకి కావాలి. శిరీష్-దిల్ రాజు అనే వ్యక్తులు లేకపోతే.. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే నాశనం అయిపోయేది. తెలిసీ తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నేను హుషారు సినిమా చేశానంటున్నాడు. హుషారు సినిమా బెక్కం వేణుగోపాల్ అనే చిన్న నిర్మాత చేశారు. ఇప్పటికీ ఆయన డబ్బులు కోసం తిరుగుతూనే ఉన్నాడు. కనీసం జీఎస్టీ కూడా కట్టలేదట. అలాంటి వ్యక్తి నేను ఎడ్యుకేటెడ్, పవర్ ఫుల్ మేన్‌ని అని పక్కన ఓయూ జేఏసీ విద్యార్థుల్ని పెట్టుకుని మాట్లాడుతున్నాడు.ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఉన్నారు.. ఇండస్ట్రీ పుట్టకు ముందు నుంచి ఉన్నారు. అన్యాయం జరిగితే వాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు.. బోలెడు అసోసియేషన్స్ ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్. నీ సినిమాలో దమ్ము ఉంది. ఆడుతుంది.. నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్ కనీసం జీఎస్టీ కట్టలేదు.. నీకు నెక్స్ట్ సినిమా ఎవడు ఇస్తాడు. ఇచ్చినా ఇలాగే ఉంటుంది. ఓయూ జేఏసీ వాళ్లకి చెప్తున్నా.. మీరు అన్నీ తెలుసుకుని ఇలాంటి జీఎస్టీ కట్టని వాళ్లకోసం మాట్లాడొద్దు. మీరు వెనకేసుకుని వస్తున్న ఆ వ్యక్తితో ముందు జీఎస్టీ కట్టించి.. అప్పుడు మాట్లాడండి. నేను ప్రెస్ మీట్ ఈ విషయం మాట్లాడాలని అనుకున్నా. కానీ సందర్భం కాదని అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్లో మళ్లీ చెప్తున్నా.. దిల్ రాజు, శిరీష్ లేకపోతే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది కాదు. ఆయనకి ఇంగ్లీష్ రాకపోతే నీకు ఎందుకు? తమిళ్ వస్తే నీకెందుకు? ఆయన మంచి సినిమాలు తీస్తున్నాడు. జనాలు ఆదరించే సినిమాలు చేస్తున్నాడు. అతన్ని పట్టుకుని కిల్ రాజు అంటావా? మేం వాళ్లతో 20 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాం.. ఇలాంటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీలో ఉండాలి’ అని బెల్లంకొండ సురేష్ ఫైర్ అయ్యారు. కాగా, ఇటీవల క్రాక్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను దిల్‌రాజు తనకు థియేటర్లు ఇవ్వడంలేదని మండిపడ్డ సంగతి తెలిసిందే. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తనకు థియేటర్లు ఇవ్వకుండా ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశాడు. దిల్ రాజు నియంతలా వ్యవహరిస్తూ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని బానిసలుగా చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. -
‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్
-
ఈ అల్లుడు బెదుర్స్!
చిత్రం: ‘అల్లుడు అదుర్స్’; తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్, ప్రకాశ్ రాజ్, సోనూసూద్, అనూ ఇమ్మాన్యుయేల్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కెమేరా: ఛోటా కె. నాయుడు; ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, స్టన్ శివ; ఎడిటింగ్: తమ్మిరాజు; నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం; దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్; రిలీజ్: జనవరి 14 అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్ ఎలిమెంట్. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? విలన్ మామ గారిని ఒప్పించి, హీరోయిన్‌తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది. కథేమిటంటే..: ఫ్యాక్షనిస్ట్ తరహా లీడర్ – నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాశ్ రాజ్). అతనికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి వసుంధర (అనూ ఇమ్మాన్యుయేల్). చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయంటే శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)కు ఇష్టం. కానీ, ఆమె రియల్ ఎస్టేట్ గజ (సోనూసూద్)ను ప్రేమిస్తుంది. ఇది ఇలా ఉండగా, తెలియకుండానే వసుంధర చెల్లెలు కౌముది (నభా నటేశ్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడతాడు హీరో. ఆ పెళ్ళి వద్దనే ఆడపిల్ల తండ్రిని మన హీరో ఎలా మెప్పించి, ఒప్పించాడన్నది కథ. సోనూసూద్‌కూ, ప్రకాశ్ రాజ్‌కూ మధ్య సినిమా కథలో సంబంధం ఏమిటి? సోనూసూద్ విఫల ప్రేమకథ ఎలా చివరకు సక్సెసైంది అన్నది ఓపిగ్గా చూడాల్సిన మెయిన్ కథలోని కీలక ఉపకథ. ఎలా చేశారంటే..: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటిలానే డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ ఉన్నందు వల్లనో ఏమో – ఒకటి రెండు హిందీ డైలాగులూ చెప్పారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ‘‘శీనుగాడు నా ఫ్రెండు. యాక్షన్ సీన్లలో వీడిది సెపరేట్ ట్రెండు’’ (హీరో గురించి వెన్నెల కిశోర్) లాంటి మాస్ డైలాగులూ పెట్టారు. ఫైట్స్‌తో పాటు కామెడీ పండించేందుకు హీరో తెగ ప్రయత్నించారు. నభా నటేశ్ ఓకే అనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ది నిడివి పరంగా చిన్న పాత్రే. ప్రకాశ్ రాజ్, సోనూసూద్ తదితరులు – ఈ పాత్రల్లో ప్రత్యేకించి చేయడానికీ, నిరూపించుకోవడానికీ ఇవాళ కొత్తగా ఏమీ లేదు. హీరో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ, హీరో ఇంట పనిమనిషి రత్తాలుగా హరితేజ లాంటి వాళ్ళూ ఉన్నారు. ఎలా తీశారంటే..: సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం వైపు వచ్చిన సంతోష్ శ్రీనివాస్‌కు దర్శకుడిగా ఇది నాలుగో సినిమా. తొలి చిత్రం ‘కందిరీగ’ విజయంతోనే ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఆయన... ఆ సక్సెస్ ఫార్ములాను ఇవాళ్టికీ వదులుకోలేకపోవడం అర్థం చేసుకోదగినదే. అందుకే, ఆ ఫార్ములానే వీలైనంత తిరగేసి, మరగేసి, బోర్లేసి... ‘అల్లుడు అదుర్స్’గా మరోసారి వండి వడ్డించారు. దానికి లారెన్స్ ‘కాంచన’ సినిమాతో పాపులరైన హార్రర్ కామెడీని కలిపారు. కానీ, ఎంత సక్సెస్ఫుల్ సూత్రమైనా, పదే పదే వాడితే చీకాకే. అది ఈ సినిమాకున్న పెద్ద ఇబ్బంది. దానికి తోడు ప్రేమకథను సాఫీగా కాకుండా, పలు పాత్రలు, సంఘటనల మధ్య అటూ ఇటూ తిప్పి, తిప్పి చెప్పే కథనం సహనానికి పరీక్ష పెడుతుంది. సెకండాఫ్‌లో వచ్చే హార్రర్ కామెడీ, ప్రకాశ్ రాజ్ – సత్యల ఊహా ప్రపంచం సీన్లు మాత్రం హాలులో అడపాదడపా బాగానే నవ్వులు పూయిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమాలో ఛోటా కె. నాయుడు కెమెరా వర్క్, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ప్రత్యేకించి స్పష్టంగా తెలుస్తాయి. సినిమాకు కొంత బలంగా నిలుస్తాయి. తెర నిండా సుపరిచితులైన నటీనటులు కనిపిస్తారు. వినోదం కోసం సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, చమ్మక్ చంద్ర – ఇలా చాలామందే వస్తూ పోతూ ఉంటారు. ఇటీవల కరోనా కాలంలో మరణించిన నటులు జయప్రకాశ్ రెడ్డి, కమెడియన్ వేణుగోపాల్ కోసూరి లాంటి వాళ్ళూ తెరపై తమ చివరి సినిమాల్లో ఒకటిగా ఇందులో ఎదురవుతారు. ‘బిగ్ బాస్4’ ఫేమ్ మోనాల్ గజ్జర్ చేసిన ఐటమ్ సాంగ్ ‘రంభ ఊర్వశి మేనక అందరు కలిసి నేనిక...’ లాంటివి మాస్‌ను ఆకర్షిస్తాయి. కాశ్మీర్‌లోని పహల్ గావ్ ప్రాంతాల్లో ఇటీవలే ఈ జనవరి చలిలో తీసిన హీరో, హీరోయిన్ల డ్యుయట్... మంచు కురిసే దృశ్యాలు విజువల్‌గా బాగున్నాయి. ఏ విదేశాల్లోనో తీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే, అన్నీ ఉన్నా... అల్లుడి... అదేదో అన్నట్టు స్క్రిప్టులోని బలహీనతలు ఈ సినిమాకు శాపం. కామెడీ చేస్తున్నాం అనుకొని దర్శక, రచయితలు కథన విధానంలో లేనిపోని కన్ఫ్యూజన్లు పెట్టుకున్నారు. ఎంత సక్సెస్ఫుల్ ఫార్ములా వాడుకున్నా, దాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి ప్రయత్నించకపోవడంలో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇది ‘కందిరీగ’కు మరో రీమేక్ అనే కామెంట్‌నూ భరించాల్సి వస్తుంది. వెరసి, రెండున్నర గంటల సాగదీతను భరించాలంటే... జనం బెదుర్స్ అనాలనిపిస్తుంది. కొసమెరుపు: ‘కందిరీగ’ ఫార్ములా + ‘కాంచన’ హార్రర్ కామెడీ = ‘అల్లుడు అదుర్స్’ బలాలు: ∙హీరో చేసిన డ్యాన్సులు, ఫైట్లు ∙తెర నిండా నటీనటులు, నిర్మాణ విలువలు ∙నేపథ్య సంగీతం, కెమెరా వర్కు బలహీనతలు: ∙చాలా ప్రిడిక్టబుల్ ఫార్ములా ∙పాత సినిమాలే చూస్తున్న ఫీలింగిచ్చే స్క్రిప్టు ∙సహనాన్ని పరీక్షించే సా....గ దీత కథనం ∙దర్శకత్వ లోపం ∙కన్ఫ్యూజింగ్... కామెడీ -రివ్యూ: రెంటాల జయదేవ -
అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ
టైటిల్ : అల్లుడు అదుర్స్ జానర్ : రొమాంటిక్ కామెడీ నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ నిర్మాణ సంస్థ : సుమంత్ మూవీస్ నిర్మాత : గొర్రెల సుబ్రహ్మణ్యం దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : చోటా కె. నాయుడు ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : జనవరి 14, 2021 వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'రాక్షసుడు' సినిమాతో కెరీర్లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్‌తో అతడు ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అల్లుడిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ శ్రీను( బెల్లం కొండ శ్రీనివాస్ ) చిన్నప్పుడే వసుందర ( అను ఇమాన్యుల్ )ను ప్రేమిస్తాడు. కాని ఆమె మాత్రం ఇతన్ని ఇష్టపడదు. తన తొలి ప్రేమ విఫలం అవడంతో శ్రీను ఇక అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ పెద్దవాడైన తర్వాత కౌముది ( నభనటేష్ )తో మరోసారి ప్రేమలో పడతాడు.ఇదే సమయంలో శ్రీను జీవితంలోకి గజా( సోనూసూద్ ) అడుగు పెడతాడు. మరోవైపు తన ప్రేమను దక్కించుకునే క్రమంలో కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావాల్సి వస్తుంది.అసలు శ్రీను చేసుకున్న ఒప్పందమేంటి? ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగత కథ. నటీనటులు గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. రియల్ హీరో సోనూ సూద్ తన నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రకాష్ రాజు ఎప్పటిలాగే తండ్రి పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రను చేజిక్కించుకుంది. కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమ్మక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలపరిధి మేరకు నటించారు. విశ్లేషణ 'కందిరీగ' లో కన్ఫ్యూజింగ్ కామెడీ చూపించి హిట్ కొట్టిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఈ సినిమాకు కూడా అలాంటి కామెడినే నమ్ముకున్నాడు. కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించాడు. కందిరీగ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు.సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అలాగే నవ్మశక్యం కాని సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులు తలలు పట్టుకునేలా చేశాడు. అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. ఎడిటింగ్ బాగున్నా, ఎడిటింగ్ బాగున్నా, సెకండాఫ్‌లోని సాగతీత సీన్లను తొలగిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.