టైటిల్ : అల్లుడు అదుర్స్
జానర్ : రొమాంటిక్ కామెడీ
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ
నిర్మాణ సంస్థ : సుమంత్ మూవీస్
నిర్మాత : గొర్రెల సుబ్రహ్మణ్యం
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : చోటా కె. నాయుడు
ఎడిటర్ : తమ్మిరాజు
విడుదల తేది : జనవరి 14, 2021
వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'రాక్షసుడు' సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్‌తో అతడు ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అల్లుడిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
కథ
శ్రీను( బెల్లం కొండ శ్రీనివాస్ ) చిన్నప్పుడే వసుందర ( అను ఇమాన్యుల్ )ను ప్రేమిస్తాడు. కాని ఆమె మాత్రం ఇతన్ని ఇష్టపడదు. తన తొలి ప్రేమ విఫలం అవడంతో శ్రీను ఇక అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ పెద్దవాడైన తర్వాత కౌముది ( నభనటేష్ )తో మరోసారి ప్రేమలో పడతాడు.ఇదే సమయంలో శ్రీను జీవితంలోకి గజా( సోనూసూద్ ) అడుగు పెడతాడు. మరోవైపు తన ప్రేమను దక్కించుకునే క్రమంలో కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావాల్సి వస్తుంది.అసలు శ్రీను చేసుకున్న ఒప్పందమేంటి? ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగత కథ.
నటీనటులు
గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. రియల్ హీరో సోనూ సూద్ తన నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రకాష్ రాజు ఎప్పటిలాగే తండ్రి పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రను చేజిక్కించుకుంది. కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమ్మక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలపరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
'కందిరీగ' లో కన్ఫ్యూజింగ్ కామెడీ చూపించి హిట్ కొట్టిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఈ సినిమాకు కూడా అలాంటి కామెడినే నమ్ముకున్నాడు. కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించాడు. కందిరీగ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు.సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అలాగే నవ్మశక్యం కాని సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులు తలలు పట్టుకునేలా చేశాడు. అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. ఎడిటింగ్ బాగున్నా, ఎడిటింగ్ బాగున్నా, సెకండాఫ్‌లోని సాగతీత సీన్లను తొలగిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment