Miss World 1994: Aishwarya Rai Eating Lunch Breaks The Internet - Sakshi
Sakshi News home page

Aishwarya Rai: ఆ శుభదినాన తల్లితో కలిసి.. ఐశ్వర్యరాయ్‌ ఫోటో వైరల్‌.. గంటల వ్యవధిలోనే

Published Sun, May 28 2023 12:38 AM | Last Updated on Tue, Jul 18 2023 7:56 PM

Miss World 1994: Aishwarya Rai Eating Lunch Breaks The Internet - Sakshi

అందమంటే ఏంటీ? అని హఠాత్తుగా పది మందిని అడిగితే.. కనీసం ఐదుగురు ఐశ్వర్య రాయ్ పేరు చెబుతారట. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఓ విషయం ఇది. నిజమే.. భువి నుంచి దిగి వచ్చినట్టుండే ఐశ్వర్య రాయ్ అత్యంత ప్రసిద్ధ మోడల్స్ లో ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్.. అటుపై బాలీవుడ్, హాలీవుడ్.. ఎన్నో సినిమాలు.. మరెన్నో పాత్రలు. ఇదీ ఐశ్వర్య కెరియర్. ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటో ఇది.

ఈ ఫొటోను చూస్తూ ‘ఇది అంతర్జాల విందు’ అన్నారు ఒక యూజర్‌. 21 సంవత్సరాల వయసులో ‘మిస్‌ వరల్డ్‌’ అందాల కిరీటాన్ని గెలుచుకుంది ఐశ్వర్యరాయ్‌. ఆ శుభదినాన తల్లితో కలిసి ఫ్లోర్‌ మ్యాట్‌పై కూర్చొని భోజనం చేస్తున్న ఫొటో వైరల్‌గా మారింది.

భారతీయతకు, భారతీయ భోజన సంప్రదాయాలకు అద్దం పట్టే ఫొటో ఇది. పాపులర్‌ పేజ్‌ ‘హిస్టారిక్‌ విడ్స్‌’లో షేర్‌ చేసిన ఈ ఫొటో గంటల వ్యవధిలోనే 2.6 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘సో...ప్యూర్‌ అండ్‌ జెన్యూన్‌’‘మన విలువలు, సంప్రదాయాలు భూమాతను, భోజన సంప్రదాయాలను గౌరవిస్తాయి’... ఇలా  నెటిజనులు రకరకాలుగా స్పందించారు.

ఐశ్వర్యారాయ్ నవంబర్ 1 న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించారు. 1994లో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. అప్పటినుంచి ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2007లో అభిషేక్ బచ్చన్ ను వివాహామాడి అమితాబ్ ఇంట కోడలిగా అడుగుపెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement