Miss World title
-
మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చింది. -
మిస్ వరల్డ్ ఫైనల్స్.. కిరీటం రేసులో ఇండియన్ బ్యూటీ
ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు భారత్‌లో జరుగుతున్నాయి. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు. భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ వరల్డ్ కోసం బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న టాప్ 20లో ఉన్నారు. 1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ భారతీయుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ కిరీటాన్ని ఆమె అందుకుని ఇప్పటికి మూడు దశాబ్దాలు అవుతుంది. ఈ సందర్భంగా 2024 మిస్ వరల్డ్ 'టాలెంట్ ఫైనల్స్' రౌండ్లో ఐశ్వర్యారాయ్ హిట్ సాంగ్స్‌కు 'సినీ శెట్టి' డ్యాన్స్ చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా నుంచి నింబుడా సాంగ్‌తో తాల్, బంటీ ఔర్ బబ్లీ వంటి మూవీలలోని హిట్ పాటలకు అద్భుతమైన డ్యాన్స్ చేసి ఐశ్వర్యకు అంకితం చేశారు సినీ శెట్టి. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య వారసత్వానికి గుర్తుగా భారతీయ శాస్త్రీయ, బాలీవుడ్ నృత్య రీతుల కలయికతో సినీ శెట్టి నృత్యం చేసింది. దీంతో పలువురు ఆమె ప్రతిభను పలువురు మెచ్చుకున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌పై అందరి దృష్టి ఉంది. ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. 2017లో మానుషి చిల్లర్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024లో మన సినీ శెట్టి కూడా ఆ కిరీటాన్ని తప్పకుండా అందుకుంటారని ఊహాగానాలు మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Sini Shetty (@sinishettyy) View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
ప్రపంచ సుందరి పోటీలు.. నా జెండా గుండెల్లో ఉంది: సినీ శెట్టి
సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. నా దేశపు జెండాను గుండెల్లో పెట్టుకున్నా: సినీ శెట్టి భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ వరల్డ్ కోసం బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఆమె దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె జాతిని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పేర్కొన్నారు. ' తూ హీ మేరీ మంజిల్ హై, పెహచాన్ తుజ్ హై సే!" అనే పోస్ట్‌ను పంచుకున్నారు. (నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు) ఈ ప్రయాణంలో ఈరోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నాను.. నా దేశపు త్రివర్ణ పతాకాన్ని చేతిలోనే కాదు, గుండెల్లో పెట్టుకున్నాను..' అంటూ గర్వం వ్యక్తం చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముంబైలో జన్మించిన సినీ శెట్టి స్వస్థలం కర్ణాటక. అకౌంటింగ్, ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేట్ చేసిన ఈ బ్యూటీ భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నందున విభిన్న మార్గాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. నేను నా దేశపు గర్వాన్ని: సినీ శెట్టి 71వ మిస్ వరల్డ్ పోటీలకు తొలి అడుగు పడింది. ' నేను నా కలలతో అడుగులు వేస్తున్నాను. నేను నా దేశపు గర్వాన్ని.. ఈ క్షణం నుంచి నేను సినీ శెట్టిని మాత్రమే కాదు.. నేను భారతదేశాన్ని. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట, నన్ను పెంచిన ఈ నేల, నన్ను తీర్చిదిద్దిన భారత సంస్కృతి, నన్ను నమ్మిన ప్రజల ప్రతిబింబాన్ని. నేను మన జాతీయ జెండాను ఎంతో గర్వంగా, గౌరవంగా పట్టుకుని నిల్చున్నాను. ఇది నా కోసం, మన కోసం, భారతదేశం కోసం.' అని సినీ శెట్టి క్యాప్షన్ ఇచ్చారు. భారత్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లోకి అడుగు పెట్టిన ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. 1966లో భారత్‌కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్ 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. 2022లో నిర్వహించిన పోటీల్లో పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించనున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
ఆ శుభదినాన తల్లితో కలిసి.. ఐశ్వర్యరాయ్ ఫోటో వైరల్.. గంటల వ్యవధిలోనే
అందమంటే ఏంటీ? అని హఠాత్తుగా పది మందిని అడిగితే.. కనీసం ఐదుగురు ఐశ్వర్య రాయ్ పేరు చెబుతారట. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఓ విషయం ఇది. నిజమే.. భువి నుంచి దిగి వచ్చినట్టుండే ఐశ్వర్య రాయ్ అత్యంత ప్రసిద్ధ మోడల్స్ లో ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్.. అటుపై బాలీవుడ్, హాలీవుడ్.. ఎన్నో సినిమాలు.. మరెన్నో పాత్రలు. ఇదీ ఐశ్వర్య కెరియర్. ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటో ఇది. 21 years ago aishwarya rai gave one of her best performances ever. pic.twitter.com/HLDx9KKzyV — ً (@SheethalS5) July 13, 2023 ఈ ఫొటోను చూస్తూ ‘ఇది అంతర్జాల విందు’ అన్నారు ఒక యూజర్. 21 సంవత్సరాల వయసులో ‘మిస్ వరల్డ్’ అందాల కిరీటాన్ని గెలుచుకుంది ఐశ్వర్యరాయ్. ఆ శుభదినాన తల్లితో కలిసి ఫ్లోర్ మ్యాట్‌పై కూర్చొని భోజనం చేస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. how can someone who has seen this, not be an aishwarya rai stan ?#aishwaryarai • #devdas pic.twitter.com/MmvHSIzGZT — 𝒂𝒚𝒖𝒔𝒉𝒊. (@_ayushi_saran) July 13, 2023 భారతీయతకు, భారతీయ భోజన సంప్రదాయాలకు అద్దం పట్టే ఫొటో ఇది. పాపులర్ పేజ్ ‘హిస్టారిక్ విడ్స్’లో షేర్ చేసిన ఈ ఫొటో గంటల వ్యవధిలోనే 2.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘సో...ప్యూర్ అండ్ జెన్యూన్’‘మన విలువలు, సంప్రదాయాలు భూమాతను, భోజన సంప్రదాయాలను గౌరవిస్తాయి’... ఇలా నెటిజనులు రకరకాలుగా స్పందించారు. Gorgeous Aishwarya Rai in Her Early Age. pic.twitter.com/qTUK8Jr58R — 🫶𝙌𝙃𝘿❤️🔥 (@QHDposts) July 10, 2023 ఐశ్వర్యారాయ్ నవంబర్ 1 న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించారు. 1994లో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. అప్పటినుంచి ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2007లో అభిషేక్ బచ్చన్ ను వివాహామాడి అమితాబ్ ఇంట కోడలిగా అడుగుపెట్టారు. 21 Years of Aishwarya Rai as Iconic Paro. ❤#AishwaryaRaiBachchan #21YearsOfDevdas https://t.co/CvKCHCMztn pic.twitter.com/2pwbHEIGVM — Name! why? (@Whatever820082) July 12, 2023 -
మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి
-
మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి
లండన్: జమైకాకు చెందిన టోనీ–ఆన్ సింగ్ మిస్ వరల్డ్–2019 కిరీటం దక్కించుకున్నారు. లండన్‌లోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. గత ఏడాది మిస్ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్.. టోనీ–ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్ రావ్ నిలిచారు. నవంబర్ 20వ తేదీ నుంచి మొదలైన 69వ మిస్ వరల్డ్–2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పలు వడబోతల అనంతరం ఫైనల్స్ కోసం 10 మందిని ఎంపిక చేశారు. అంతిమంగా ఎంపికైన ఐదుగురికి ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ నేతృత్వంలోని బృందం పలు ప్రశ్నలు సంధించింది. అందగత్తెల సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్‌కు చెందిన రన్నరప్ సుమన్ రావ్ అన్నారు. జమైకా నుంచి మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ–ఆన్ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది. సుమన్ రావ్ ► జననం: 1998 నవంబర్ 23 ► స్వస్థలం: రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ సమీపంలోని అయిదానా ► తల్లి: సుశీలా కున్వర్ రావ్, గృహిణి ► తండ్రి: రతన్ సింగ్, నగల వ్యాపారి ► విద్య: నవీముంబైలోని మహాత్మా స్కూల్ ఆఫ్ అకాడెమిక్స్ అండ్ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నారు. ► భాషలు: ఇంగ్లిష్, హిందీతోపాటు మాతృభాష మేవారీ ► వృత్తి: మోడల్, డ్యాన్సర్(కథక్) ► 2018లో మిస్ నవీముంబై పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్ తరఫున పాల్గొని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ –2019ను, ఆ పోటీల్లోనే మిస్ ర్యాంప్‌వాక్ అవార్డు గెలుచుకున్నారు. -
ప్రపంచ సుందరిగా ‘మిస్ మెక్సికో’
బీజింగ్: 2018 సంవత్సరానికి గానూ ప్రపంచసుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డి లియోన్(26) గెలుచుకున్నారు. చైనాలోని సన్యా పట్టణంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రపంచసుందరి, భారత్‌కు చెందిన మానుషీ ఛిల్లర్.. వెనెస్సాకు ప్రపంచసుందరి కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్స్నుకన్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. మారియా వసిల్విచ్(బెలారస్), కదీజా రాబిన్సన్(జమైకా), క్విన్ అబేనక్యో(ఉగాండా)లు తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. కాగా, భారత్ నుంచి ఈసారి పోటీపడ్డ అనుకృతి వాస్(19) టాప్–30లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచసుందరి టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం వెనెస్సా మాట్లాడుతూ..‘దీన్ని నమ్మలేకపోతున్నా. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి , మెక్సికో ప్రజలందరికీ ఈ గెలుపు అంకితం. నేను వాళ్లను గర్వపడేలా చేశాననే భావిస్తున్నా’ అని తెలిపారు. ఈ పోటీల్లో 118 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు. -
భారత్‌కు 'మిస్ వరల్డ్'
సాన్యా(చైనా): ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి(మిస్ వర్డల్) కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్ వశమైంది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. చైనాలోని సాన్యా నగరంలో శనివారం రాత్రి ఎంతో అట్టహాసంగా నిర్వహించిన 67వ మిస్ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణురాలు కావాలనుకుంటున్న ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లో సేవా దృక్పథంతో పనిచేసే ఆస్పత్రుల్ని నిర్వహించడం జీవిత లక్ష్యమని మిస్ వరల్డ్ వెబ్సైట్లో పేర్కొంది. మా అమ్మే అతి పెద్ద ఆదర్శం 2016 మిస్ వరల్డ్ విజేత ప్యూర్టోరికోకు చెందిన స్టెఫానీ డెల్ కిరీటాన్ని అలంకరించగానే ఛిల్లర్ ఆనందం తట్టుకోలేక ఉబ్బితబ్బిబైంది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా మిస్ ఇంగ్లాండ్ స్టెఫానీ హిల్, రెండో రన్నరప్‌గా మిస్ మెక్సికో ఆండ్రియా మెజాలు నిలిచారు. పోటీలో మొదటి నుంచి ఛిల్లర్‡ తన అందచందాలు, తెలివి తేటలతో న్యాయ నిర్ణేతల్ని ఆకట్టుకుంది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెన్యా, మెక్సికో అందగత్తెలతో పాటు తుది ఐదుగురి జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక న్యాయ నిర్ణేతలు వేసిన ప్రశ్నకు ఛిల్లర్ ఎంతో తెలివిగా, సమయస్ఫూర్తితో సమాధానం చెప్పింది. ప్రపంచంలో ఏ వృత్తికి అత్యధిక వేతనం ఇవ్వాలి? ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రపంచంలో తల్లికే ఎక్కువ గౌరవం దక్కాలని నేను భావిస్తున్నా. ఇక వేతనం గురించి మాట్లాడినప్పుడు.. అది డబ్బు గురించే కానక్కర్లేదు. ఒకరిపై చూపే ప్రేమ, వారికిచ్చే గౌరవం కూడా కావచ్చు. నా జీవితంలో నా తల్లే అతి పెద్ద ఆదర్శం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తారు. అందుకే తల్లి ఉద్యోగానికే ఎక్కువ వేతనం దక్కాలని నేను భావిస్తున్నా’ అని ఛిల్లర్ చెప్పగానే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. పోటీ అనంతరం 2017 కిరీటాన్ని మానుషి ఛిల్లర్ గెలుచుకుందని మిస్ వరల్డ్ పోటీల కమిటీ అధికారిక ఫేస్బుక్, ట్వీటర్ పేజీల్లో వెల్లడించింది. ‘2017 మిస్ వరల్డ్ విజేత ఛిల్లర్’ అంటూ ట్వీటర్లో పోస్టుచేసింది. బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ మిస్ వర్డల్ – 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్‡ సెమిఫైనల్‌కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం ఛిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు. రీటా ఫారియా నుంచి ఛిల్లర్ వరకూ మానుషి ఛిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని భారత్‌లోని అందగత్తెల సొగసును ప్రపంచానికి చాటిచెప్పారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు. మిస్ వరల్డ్ గెలుచుకున్నాక రీటా ఫారియా వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇక ఐశ్వర్య బాలీవుడ్ నటిగా కొనసాగారు. డయానా, యుక్తా ముఖీలు బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా విజయాలు దక్కలేదు. ప్రియాంకా చోప్రాకు మొదట్లో సినిమా విజయాలు వెక్కిరించినా.. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోను ఆమె రాణిస్తున్నారు. భారత్‌కు రెండు సార్లు ‘మిస్ యూనివర్స్’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు మిస్ యూనివర్స్‌లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి. రాజారెడ్డి, రాధారెడ్డిల వద్ద కూచిపూడి శిక్షణ చిన్నప్పటి నుంచి మానుషి ఛిల్లర్‌కు చదువుతో పాటు నాట్యం, చిత్రలేఖనం, ఆటల్లో కూడా అభిరుచి ఉంది. 1997, మే 14న హరియాణాలో జన్మించిన ఆమె పాఠశాల విద్యాభ్యాసం ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూలులో సాగగా, ప్రస్తుతం సోనేపట్‌లోని భగత్ ఫూల్ సింగ్ ప్రభుత్వ మహిళా వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఛిల్లర్ తండ్రి డాక్టర్ మిత్రా బసు ఛిల్లర్ డీఆర్డీఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తల్లి డాక్టర్ నీలమ్ ఛిల్లర్‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, అండ్ అల్లైడ్ సెన్సెన్స్’లో న్యూరో కెమిస్ట్రీ విభాగం హెడ్‌గా ఉన్నారు. ప్రముఖ నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యా రెడ్డిల వద్ద మానుషి కూచిపూడి నృత్యం అభ్యసించారు. పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, స్నోర్కెల్లింగ్, స్కూబా డైవింగ్ల్లో చురుగ్గా పాల్గొనడమంటే ఛిల్లర్‌కు ఎంతో ఇష్టం. స్కెచింగ్, చిత్రలేఖనంలో కూడా ప్రవేశముంది. అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటనలో మెలకువలు నేర్చుకున్నారు. ముంబైలో జరిగిన 54వ 2017 –మిస్ ఇండియా పోటీల్లో హరియాణా తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలో మిస్ ఇండియాగానే కాకుండా మిస్ ఫొటోజెనిక్‌గా కూడా నిలిచారు. -
కర్త.. కర్మ.. క్రియాంక
బయోగ్రఫీ ప్రియాంక సక్సెస్‌లోని కర్త, కర్మ, క్రియ.. అన్నీ ఆమె స్వయంకృషే! పని ప్రియాంక శక్తి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది... ఆడుతూనో, పాడుతూనో. సమాజం కోసం పాటు పడుతూనో! ప్రియాంక దగ్గర చాలా కిరీటాలు ఉన్నాయి. అందాల కిరీటం.. సినిమాల కిరీటం.. సరిగమల కిరీటం.. సేవల కిరీటం. వీటిని మించిన కిరీటం.. ఆమె క్రియాశీలత. అందుకే ఆమె .. క్రియాంక! రెడ్! ప్రియాంకకు ఇష్టమైన రంగు. కానీ ఆమెకు ‘రెడ్ కార్పెట్’ అంటే భయం. టెన్షన్. మొన్న ఆస్కార్‌కు వెళ్లినప్పుడు కూడా ఆ ఎరుపు రంగు తివాచీని తొక్కుకుంటూ వెళ్లడానికి ఆమె కొంతసేపు మానసికంగా సిద్ధం కావలసి వచ్చింది! చీర! ప్రియాంకకు ఇష్టమైన వస్త్రధారణ. కానీ ఆమె ఎంతో అరుదుగా మాత్రమే చీరలో కనిపిస్తారు. మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ ప్యాంటులో ఆమెను చూసినప్పుడు ఇంతకీ ఈమెకు ఇష్టమైనది సంప్రదాయమా? ఆధునాతనమా అనే డైలమాలో పడిపోతాం! పెళ్లి! ప్రియాంకకు వివాహ వ్యవస్థమీద ఎంతో గౌరవం ఉంది. పెళ్లిలో ఉన్నంత గాఢమైన బంధం సహ జీవనంలో ఉండదని ఆమె నమ్ముతారు. కానీ ‘నాలుగేళ్ల వయసులో’ తప్ప, ఆ తర్వాత ఎప్పుడూ ఆమె పెళ్లి ఆలోచనే చేయలేదు! ఇవే కాదు... ప్రియాంకా చోప్రాలో చాలా వైరుధ్యాలున్నాయి. ప్రకృతిలోని రమణీయత అంతా వైరుధ్యాల నుంచి వచ్చిందే. అలాగే ప్రియాంక వ్యక్తిత్వంలోని సౌందర్యం కూడా. విరుద్ధతే ప్రియాంక అందం, విజయ రహస్యం. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారో కచ్చితంగా చెప్పడం కష్టం. మనకైతే ఇప్పుడు థియేటర్స్‌లో కనిపిస్తున్నారు. ‘జై గంగాజల్’ ఈమధ్యనే కదా రిలీజ్ అయింది. అందులో పోలీస్ ఆఫీసర్. మరీ ఈమధ్యనైతే ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ప్రెజెంటర్ గా తెల్లటి చేప గౌన్‌లో దర్శనమిచ్చారు. ‘వెంటిలేటర్’, ‘బమ్ బమ్ బోల్ రహా హై కాశీ’, ‘ఏక్ ఓంకార్’, ‘బేవాచ్’.. ఈ నాలుగూ ఇప్పుడు మేకింగ్‌లో ఉన్నాయి. ఇవి ఆమె చేస్తున్న, తీస్తున్న సినిమాలు. ‘ఐ లైక్ విన్నింగ్’ అని పెద్దగా నవ్వుతారు ప్రియాంక. నిజమే. నిరంతరం నడిచేవాళ్లు, నడిపేవాళ్లే చివరికి విన్ అవుతారు. మొబిలిటీ... ‘కదలడం’ ముఖ్యం ఆమెకు. ఆ చలనశీలతే ప్రియాంకను చలన చిత్రాలనుంచి, ఆ తర్వాతి హైట్స్‌కి నడిపిస్తోంది. ఓ హైట్ హాలీవుడ్. ఇంకో హైట్ అమెరికన్ టెలివిజన్. అప్డేట్ ఆమె పేరు! ‘బేవాచ్’కీ, ‘క్వాంటికో’కి మధ్య ప్రియాంక ఇప్పుడు అటో మేకప్, ఇటో మేకప్ వేసుకుంటున్నారు. క్వాటికో.. అమెరికన్ టీవీ ధారావాహిక. రెండో సీజన్ మొదలైంది. అందులో ప్రియాంక ఎఫ్.బి.ఐ. ఏజెంట్. మాంట్రియల్లో షూటింగ్ జరుగుతోంది. ఇక ‘బేవాచ్’. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న అమెరికన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. అందులో ‘విక్టోరియా లీడ్స్’ అనే పాత్రను వేస్తున్నారు ప్రియాంక. ప్రియాంక వయసు 33 ఏళ్లు. అందులో సగం సినిమా రీళ్లు. ప్రపంచానికి ఆమె తొలి పరిచయం 17 ఏళ్ల వయసులో. మిస్ వరల్డ్ 2000 పేజెంట్ విజేతగా ఒక తాజా పువ్వై పరిమళించారు ప్రియాంక. ఆ అందాల పోటీలు లండన్వి. అక్కడ నెగ్గారు ప్రియాంక. చీమ కుట్టి కొద్దిగా వాచిన ట్లుండే పెదవులతో, చురుకైన కళ్లతో ఆమె అతి కొద్ది సమయంలోనే భారతదేశపు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. కశ్మీర్ గుబాళింపులు బిహార్‌ను, ప్రియాంక చోప్రాను కలిపిచూస్తే అదొక దుష్ట సమాసంలా అనిపిస్తుంది. మనకు తెలిసిన బీహార్, మనం చూస్తున్న ప్రియాంక ఏ కోశానా కలవని పోలిక. కానీ ఆమె అక్కడే జార్ఖండ్‌లో... జార్ఖండ్‌కు జెంషెడ్పూర్ అనే పేరు ఉన్నప్పుడు 1982 జూలై 18న జన్మించారు. నాన్న అశోక్. అమ్మ మధు చోప్రా. ఇద్దరూ ఇండియన్ ఆర్మీలో డాక్టర్లు. అశోక్ పంజాబీ. మధు బిహారీ. ప్రేమ వివాహం. ప్రియాంక, ఆమె తమ్ముడు. ఇద్దరే పిల్లలు. తమ్ముడు ప్రియాంక కన్నా ఏడేళ్లు చిన్న. పరిణీతి చోప్రా, మీరా చోప్రా, మన్నారా.. వీళ్లు ప్రియాంక కజిన్స్. ఆర్మీలో ఉన్నవాళ్లకు దేశమంతా స్వస్థలమే. ఢిల్లీ, ఛండీఘర్, అంబాలా, లడఖ్, లక్నో, బరేలీ, పుణె.. ఇన్ని తిరిగారు ప్రియాంక.. అమ్మానాన్నల వెంట. లక్నోలో స్కూలు, బరేలీ లో కాలేజ్. ప్రియాంక బాల్య స్మృతులు ఉన్నది మాత్రం లేహ్ (జమ్ము కశ్మీర్) లోయలో. దేశవిదేశాల్లో ఆమె ఎక్కడ తిరిగినా ఆ లోయ నుంచి ఆ స్మృతులు ఆమెను వెంటాడుతూనే వస్తుంటాయి. అందుకే ప్రియాంక అంత ఫ్రెష్‌గా ఉంటారట. తన కష్టమే తన కాన్ఫిడెన్స్ యూ.ఎస్.లో ప్రియాంక ఆంటీ వాళ్లు ఉండేవారు. పదమూడేళ్ల వయసులో ప్రియాంక ఆవిడ దగ్గరకు వెళ్లారు. కొన్నాళ్లు అక్కడే చదువు. ఆంటీ వాళ్లదీ ఇదే వరుస. ఒక చోట ఉండేవాళ్లు కాదు. వాళ్లతో పాటు ప్రియాంక కూడా వెళ్లేవారు. మసాచుసెట్స్‌లో ఉన్నప్పుడు ప్రియాంక వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నారు. వెస్ట్రన్‌లో శాస్త్రీయ సంగీతం. నాటకాలు వేశారు. పాటలు పాడారు. కథక్ డాన్స్ కూడా నేర్చుకున్నారు. కానీ కాన్ఫిడెన్సే కాస్త తక్కువగా ఉండేది. ఓ ఆఫ్రికన్-అమెరికన్ క్లాస్మేట్ ప్రియాంకను ఎప్పుడూ ఏడిపిస్తుండేవాడు. దాంతో ఆమె ఆత్మవిశ్వాసం ఇంకా దెబ్బతింది. ప్రతిదానికీ వణుకే. మాట్లాడడానికీ, మాటకు మాట చెప్పడానికీ! పైగా తన కాళ్లపై తెల్లటి మచ్చలు ఉండేవి. ఇప్పుడు అవే కాళ్లు 12 బ్రాండ్ల ఉత్పత్తులకు యు.ఎస్.పి. (యునీక్ సెల్లింగ్ పాయింట్) అయ్యాయి! ప్రియాంక ఏ పని చేసినా కష్టపడి చేస్తారు. అదే ఆమెను జీవితంలో నిలబడేలా చేసింది. అమ్మాయి బాగుండేది! అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పటికి ప్రియాంక వయసు 16 ఏళ్లు. పదహారేళ్ల అమ్మాయిలు బరేలీలో చాలామందే ఉన్నారు కానీ, వాళ్లలో ప్రియాంక స్పెషల్‌గా ఉండేది. బరేలీలో ‘మై క్వీన్’ అందాల పోటీలు జరిగితే వాటిల్లో ఫస్ట్ వచ్చింది. ఆ ఈవెంట్ తర్వాత ప్రియాంక వాళ్లు ఉంటున్న ఇంటికి ప్రొటెక్షన్ అవసరమైంది. అంతగా అభిమానించేవారు, ఆరాధించేవారు, ఇంటి బయట వేచి ఉండేవారు ఎక్కువయ్యారు. కాలేజీలో చేరింది కానీ, కాలేజీకి వెళ్లలేకపోయింది. సినిమాలు ఆమె ఆకర్షణలో పడిపోయి, ఆమెను చదువుకోనివ్వలేదు. నాన్న కూతురు ప్రియాంకలో ఇద్దరు అమ్మాయిలున్నారు. ఒకరు ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తున్న అమ్మాయి. ఇంకొకరు కుటుంబం నుంచి ఆనందాన్ని పొందుతున్న అమ్మాయి. ప్రియాంకకు వాళ్ల నాన్నంటే ఇష్టం. తమ్ముడంటే ప్రేమ. అమ్మంటే గౌరవం. కొంచె భయం కూడా. తమ్ముడు సిద్ధార్థ్ ఇప్పటికీ ప్రియాంక ఉంటున్న ఇంట్లోనే ఉంటాడు. ప్రియాంక తండ్రి 2013లో చనిపోయారు. అంతకు ముందు ఏడాదే ప్రియాంక ఆయన చేతిరాతతో తన చేతిపై ‘డాడీస్ లిటిల్ గాళ్’ పచ్చబొట్టు వేయించుకున్నారు. ప్రియాంక తల్లి గైనకాలజిస్ట్. కూతురికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాక తనకు సహాయంగా ఉండడం కోసం వైద్యవృత్తిలోని తన ఆసక్తిని వదిలేసుకున్నారు ఆమె. తమిళ సినిమా ‘తమిళన్’ (2002)తో సినిమాల్లోకి వచ్చారు ప్రియాంక. మనసు మరింత అందమైనది ప్రియాంక చేసిన సినిమాల కంటే కూడా, ఆమె చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే ఎక్కువ. ఇప్పటికే ఆమె లెక్కలేనన్ని చారిటీ షో లు, ప్రసంగాలు, కార్యక్రమాలు ఇచ్చారు. స్త్రీవాదాన్ని (ఫెమినిజం) ప్రియాంక విశ్వసిస్తారు. అనుసరిస్తారు. అవలంబిస్తారు. (జీవితంపై ప్రియాంక మనోభావాలు) నిజాయితీ ధైర్యానిస్తుంది ►తప్పులు, పొరపాట్లు ఊరికే జరుగుతాయా? ఏదో ఒక పని చేస్తుంటేనే కదా అవి దొర్లేది. పనిలో ఉండడం అన్నది జీవితంలోని గొప్ప విషయం. నేను చేసే తప్పులకైతే లెక్కేలేదు. తప్పులు జీవితాన్ని అందంగా మారుస్తాయి. ►నేనొక మామూలు అమ్మాయిని. భయభక్తులు, వినయవిధేయతలు, భావోద్వేగాలు, కొంత తెలివితక్కువ తనం.. నాలో ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు డైనమిక్‌గా ఉండడం ఇష్టం. ►నాలుగేళ్ల వయసులో నా జీవిత లక్ష్యం.. పెళ్లి చేసుకోవడం! ► ‘మిస్ వరల్డ్’ టైటిల్ వచ్చినప్పుడు.. నమ్మలేకపోయాను. నిద్రలోనూ ఆ కిరీటం నా పక్కలోనే ఉండేది. ఎవరైనా దొంగిలిస్తారని భయం! ►స్క్రీన్ మీద కొన్ని సీన్లు చేయలేను. (ముద్దు సీన్ల గురించి). ►గృహిణిగా ఉండిపోవడం అనేది కూడా నా టీనేజ్ లక్ష్యాలలో ఒకటి. అలాగే ఇంజినీర్ కావాలని, పైలట్ కావాలని ఉండేది. చివరికి సినిమాల్లోకి వచ్చేశాను. జీవితం తన లక్ష్యానికి ఎన్నుకున్న అమ్మాయిలలో నేనూ ఒక దాన్ని అనుకుంటాను. ►బటర్ పనీర్, పరాటాతో పరిష్కారం కాని సమస్య ఈ లోకంలోనే లేదు. ►నా బలం, బలహీనత రెండూ నా కుటుంబమే. ►స్వయం కృషి, దేవుడి కరుణ.. ఈ రెండూ లేకుండా మనం దేన్నీ సాధించలేం. ►ఐ హేట్ రెడ్ కార్పెట్. ఆ ఒత్తిడిని తట్టుకోలేను. అందుకే చివరి నిమిషం వరకు దాని గురించి ఆలోచించను. ► నీకు నువ్వు నిజాయితీగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. నిజాయితీ నుంచి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మళ్లీ నిన్ను, నీ నిజాయితీని నిలబెడుతుంది. ►సృజనశీలురు నాకు స్ఫూర్తినిస్తారు. జీవితానికి వాళ్లు ఉద్వేగాలను, వర్ణాలను అద్దుతారు. అందుకే స్ఫూర్తి పొందుతాను. (ప్రేమపై ప్రియాంక అభిప్రాయాలు) పద్ధతి, భద్రత నాకు నచ్చవు ►నేను ప్రేమను నమ్ముతాను. ఏళ్లూ పూళ్లూ గడిచిపోతాయి. కానీ ప్రేమ మాత్రం మారదు. మనుషులూ మారిపోతారు. కానీ ప్రేమ మారదు. ►ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండేది మాత్రమే కాదు. ప్రతి అనుబంధంలోనూ ప్రత్యేకమైన ఒక ప్రేమ బంధం ఉంటుంది. ► సహ జీవనం మీద నాకు ఆసక్తి లేదు. పెళ్లిని ఒక దృఢమైన బంధంగా నేను విశ్వసిస్తాను. ► మగాళ్ల మొదట నేను కళ్లను చూస్తాను. ఆ తర్వాత పాదాలు. పాదాలను శుభ్రంగా ఉంచుకునే మగాళ్లను నేను ఇష్టపడతాను. ► భద్రమైన జీవితానికి అలవాటు పడిన పద్ధతి గల పురుషులు నాకు నచ్చరు. నాలో రగిలే సాధనేచ్ఛకు ఆజ్యం పోసే వాళ్లు నాకు కావాలి. వాళ్లకూ నన్ను మించిన సాధనేచ్ఛ ఉండాలి. నన్నెప్పుడూ పరుగులు పెట్టించే మగాడే నా మనసు గెలుచుకోగలడు.