ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు భారత్‌లో జరుగుతున్నాయి. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు. భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ వరల్డ్ కోసం బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న టాప్ 20లో ఉన్నారు.
1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ భారతీయుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ కిరీటాన్ని ఆమె అందుకుని ఇప్పటికి మూడు దశాబ్దాలు అవుతుంది. ఈ సందర్భంగా 2024 మిస్ వరల్డ్ 'టాలెంట్ ఫైనల్స్' రౌండ్‌లో ఐశ్వర్యారాయ్ హిట్ సాంగ్స్‌కు 'సినీ శెట్టి' డ్యాన్స్ చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా నుంచి నింబుడా సాంగ్‌తో తాల్, బంటీ ఔర్ బబ్లీ వంటి మూవీలలోని హిట్ పాటలకు అద్భుతమైన డ్యాన్స్ చేసి ఐశ్వర్యకు అంకితం చేశారు సినీ శెట్టి. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్య వారసత్వానికి గుర్తుగా భారతీయ శాస్త్రీయ, బాలీవుడ్ నృత్య రీతుల కలయికతో సినీ శెట్టి నృత్యం చేసింది. దీంతో పలువురు ఆమె ప్రతిభను పలువురు మెచ్చుకున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌పై అందరి దృష్టి ఉంది. ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. 2017లో మానుషి చిల్లర్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024లో మన సినీ శెట్టి కూడా ఆ కిరీటాన్ని తప్పకుండా అందుకుంటారని ఊహాగానాలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment