
రాణీ జాకెట్
మహారాజులు...
మహారాణులు... ఉండే సినిమాల్లో...
ఏదీ... ఇంగ్లీషు సినిమాల్లో...
రాకుమారి వేసుకొనే జాకెట్టు...
అచ్చు ఇలాగే ఉంటుంది!
ఇప్పుడు ఈ సై్టల్ ‘రాణి’స్తోంది!
ఈ జాకెట్‌ను ‘కోర్‌సెట్’ అంటారు.
వేసుకుంటే... మీరూ రాకుమారిలా
‘సెట్’ అయిపోతారు!
► శారీ మీదకు కోర్‌సెట్ బ్లౌజ్ ధరిస్తే, సంప్రదా యంలోనూ ఆధునికత కళ్లకు కడుతుంది
► ధోతీశారీకి అటాచ్ చేసిన కోర్‌సెట్ ఫ్యాషన్ వేదికల మీదా వైవిధ్యంగా రూపుకడుతుంది.
► లేస్ కోర్‌సెట్ బ్లౌజ్, షిఫాన్ శారీ కాంబినేషన్ గ్రేస్‌ఫుల్‌గా ఆకట్టుకుంటుంది
► మెరూన్ కలర్ శారీకి పైన ఎంబ్రాయిడరీ చేసిన కోర్‌సెట్ బ్లౌజ్‌ను ధరిస్తే ఎంత ట్రెడిషన్ అయినా సై్టలిష్‌గా కనిపిస్తారు.
► ఆధునికపు అమ్మాయిలకు చీరకట్టు పరిచయం చేయాలంటే కోర్‌సెట్ ఉండాల్సిందే!
► ఏంజిల్‌లో మెరుపులీనే చిరు నవ్వుతో పోటీపడుతున్న కోర్ సెట్ బ్లౌజ్