పెళ్లితంతులో తోడిపెళ్లి కూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా చిన్న పిల్లలను కూర్చొబెడతాం. వాళ్లు సిగ్గుపడిపోతూ..బుల్లి నవ్వులతో ఏదో సాధించిన వాళ్లలా పెట్టే వారి ముఖాలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇలా ఎందుకు కూర్చొబెడతారనేది తెలియదు. అదీగాక ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఆచారిస్తున్నారనేది కూడా కచ్చితంగా తెలియదు. కానీ ఈ సంప్రదాయం గురించి పలు ఆసక్తికర కథనాలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దామా..!
పూర్వం తోడి పెళ్లికూతురుగా వధువు స్నేహితురాలు లేదా సన్నిహిత బంధువులు ఉండేవారు కాదట. ఆమె సేవకులు అనుసరించేవారట. అంటే వధువు ఇష్టమైన పనిమనిషి ఆమెను అనుసరించేదట. అంతేగాదు ఆ కాలం పెళ్లైన మహిళ కూడా ఆ సేవకురాలు అత్తారింటిలో అడుగుపెట్టేదట. అక్కడ ఆమెకు కొత్త ప్రదేశం కావాల్సిన పనుల్లో సహయం చేసేదట. అలాగే ఒకవేళ నెలతప్పితే సపర్యలు చేసేందుకు ఇలా తోడి పెళ్లికూతురు అనే సంప్రదాయం వచ్చిందని కథనం.
మరొక కథనం ప్రకారం..తోడి పెళ్లికూతురుని దుష్ట శక్తులు, చెడు ఉద్దేశ్యాలు ఉన్నవాళ్లని గందరగోళ పరిచేందుకు లేదా వారి దృష్టి పోవడానికి ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇక్కడ ఇరువురు ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు గానీ, ఆభరణాలు, అలంకరణ హైలేట్‌గా కనిపించేది అసలైన వధువే. అంటే ఇక్కడ వధువు అందమైనదనో లేక హైలెట్‌గా కనిపించేందుకు ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. అంతేకాదు ఈ సంప్రదాయం పురాతన రోమన్ కాలం నుంచి కూడా ఉందట.
ఇక పండితుల ప్రకారం..ఇది వరకు కొందరు రాజులు పెద్ద మనిషి అయిన పిల్లలను ఎత్తుకు పోయేవారట. వారే పాలకులు కావడంతో ఎదిరించడం సామాన్య ప్రజల వల్ల అయ్యేది కాదు. అందుకు పరిష్కారంగా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబతున్నారు. అంటే ఇక్కడ ..పెళ్లైన వారిని ఎవ్వరూ కన్నెత్తి చూడటం, ముట్టుకోవడం వంటివి చేసేవారు కాదు.
అంతేగాదు ఈ కారణం చేతనే రజస్వల కాకముందే పెళ్లి చేయడం లేదా బాల్య వివాహాలు చేయడం అనే సంప్రదాయం వచ్చిందని చెబుతున్నారు. మన పెద్దవాళ్లు ఏ ఉద్దేశ్యంతో ఈ ఆచారం తీసుకొచ్చారనేది స్పష్టం కాకున్న..చిన్నారులను ఇలా తోడి పెళ్లికూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా సిద్ధం చేయడం, దీనికి తోడు పెద్దలు విసిరే ఛలోక్తులు, జోకులు భలే సరదా సరదాగా ఉంటాయి కదూ..!.
(చదవండి: ఆయనే రుషి..అక్షర కార్మికుడు..!: విజ్ఞాన మూలంను గౌరవించే రోజు)
Comments
Please login to add a commentAdd a comment