maids
-
పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!
పెళ్లితంతులో తోడిపెళ్లి కూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా చిన్న పిల్లలను కూర్చొబెడతాం. వాళ్లు సిగ్గుపడిపోతూ..బుల్లి నవ్వులతో ఏదో సాధించిన వాళ్లలా పెట్టే వారి ముఖాలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇలా ఎందుకు కూర్చొబెడతారనేది తెలియదు. అదీగాక ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఆచారిస్తున్నారనేది కూడా కచ్చితంగా తెలియదు. కానీ ఈ సంప్రదాయం గురించి పలు ఆసక్తికర కథనాలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దామా..!పూర్వం తోడి పెళ్లికూతురుగా వధువు స్నేహితురాలు లేదా సన్నిహిత బంధువులు ఉండేవారు కాదట. ఆమె సేవకులు అనుసరించేవారట. అంటే వధువు ఇష్టమైన పనిమనిషి ఆమెను అనుసరించేదట. అంతేగాదు ఆ కాలం పెళ్లైన మహిళ కూడా ఆ సేవకురాలు అత్తారింటిలో అడుగుపెట్టేదట. అక్కడ ఆమెకు కొత్త ప్రదేశం కావాల్సిన పనుల్లో సహయం చేసేదట. అలాగే ఒకవేళ నెలతప్పితే సపర్యలు చేసేందుకు ఇలా తోడి పెళ్లికూతురు అనే సంప్రదాయం వచ్చిందని కథనం. మరొక కథనం ప్రకారం..తోడి పెళ్లికూతురుని దుష్ట శక్తులు, చెడు ఉద్దేశ్యాలు ఉన్నవాళ్లని గందరగోళ పరిచేందుకు లేదా వారి దృష్టి పోవడానికి ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇక్కడ ఇరువురు ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు గానీ, ఆభరణాలు, అలంకరణ హైలేట్‌గా కనిపించేది అసలైన వధువే. అంటే ఇక్కడ వధువు అందమైనదనో లేక హైలెట్‌గా కనిపించేందుకు ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. అంతేకాదు ఈ సంప్రదాయం పురాతన రోమన్ కాలం నుంచి కూడా ఉందట. ఇక పండితుల ప్రకారం..ఇది వరకు కొందరు రాజులు పెద్ద మనిషి అయిన పిల్లలను ఎత్తుకు పోయేవారట. వారే పాలకులు కావడంతో ఎదిరించడం సామాన్య ప్రజల వల్ల అయ్యేది కాదు. అందుకు పరిష్కారంగా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబతున్నారు. అంటే ఇక్కడ ..పెళ్లైన వారిని ఎవ్వరూ కన్నెత్తి చూడటం, ముట్టుకోవడం వంటివి చేసేవారు కాదు. అంతేగాదు ఈ కారణం చేతనే రజస్వల కాకముందే పెళ్లి చేయడం లేదా బాల్య వివాహాలు చేయడం అనే సంప్రదాయం వచ్చిందని చెబుతున్నారు. మన పెద్దవాళ్లు ఏ ఉద్దేశ్యంతో ఈ ఆచారం తీసుకొచ్చారనేది స్పష్టం కాకున్న..చిన్నారులను ఇలా తోడి పెళ్లికూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా సిద్ధం చేయడం, దీనికి తోడు పెద్దలు విసిరే ఛలోక్తులు, జోకులు భలే సరదా సరదాగా ఉంటాయి కదూ..!.(చదవండి: ఆయనే రుషి..అక్షర కార్మికుడు..!: విజ్ఞాన మూలంను గౌరవించే రోజు) -
బరువు పెరగొద్దు.. పెళ్లికి ముందు నో ప్రెగ్నెన్సీ
వివాహం ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేస్తుంది. అప్పటి వరకు ఎవరికి వారుగా బతికిన వారు పెళ్లి తర్వాత ఒకరి కోసం ఒకరు సర్దుకుపోయి.. కలిసిమెలసి జీవిస్తారు. అయితే ఎక్కువగా అమ్మాయిలే భర్తకు అనుగుణంగా మారతారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వధువు కాబోయే వాడికి కండిషన్లు పెడుతుంది. అయితే తాజాగా ఓ పెళ్లి కుమార్తె పెట్టిన కండిషన్ల లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతూ.. ట్రోలింగ్కి గురవుతుంది. ఎందుకంటే ఇక్కడ సదరు వధువు కాబోయే భర్తకు కాకుండా తోటి పెళ్లి కుమార్తెలుగా వ్యవహరించే యువతులకు కొన్ని తలతిక్క కండిషన్స్ పెట్టింది. బ్రైడ్స్మేడ్ కండిషన్ లిస్ట్ పేరుతో విడుదల చేసిన ఈ ప్రకటనలో 37 నియమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వారి దుస్తులు, అలంకరణ, చేయాల్సిన పనులకు సంబంధించినవి కాగా మరి కొన్ని కాస్త తలతిక్కగా ఉన్నాయి. అవేంటి అంటే తనకు తోటి పెళ్లి కుమార్తెగా వ్యవహరించే యువతి సదరు కాబోయే వధువు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ కాకుడదు.. బరువు మూడు కిలోలకు మించి పెరగకూడదు. ఇక సదరు బ్రైడ్స్మేడ్స్ పెళ్లికి వచ్చిన మగ అతిథులకు సైట్ కొట్టకూడదు.. అలానే వారిని సంతోషంగా ఉంచాలి అని సూచించింది. (చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం) ఇక వివాహం నాడు బ్రైడ్స్మేడ్స్ తను చెప్పిన దుస్తులే ధరించాలని.. పెదాలకు, గోళ్లకు, తలకు రంగురంగుల లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, కలర్స్ వేసుకోకూడదని సూచించింది. ఇక వివాహానికి బయటి వ్యక్తులను తీసుకురాకూడదు. పెళ్లితంతుకు సంబంధించి ఏవైనా కార్యక్రమాలు బయట ప్రాంతంలో జరిగితే.. అక్కడికి వెళ్లడానికి అయ్యే ఖర్చులను తోటిపెళ్లికూతుళ్లే స్వంతంగా భరించాలని సూచించింది. ప్రస్తుతం ఈ వింత నియమాల లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక నెటిజనులు ‘నువ్వు ఎంత ఇడియట్వో ఈ లిస్ట్ చదివితే తెలుస్తుంది... ఇక నిన్ను చేసుకోబోయే వాడి పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మొత్తం పది మందికి ఈ లిస్ట్ పంపితే అందులో ఆరుగురు ఈ నియమాలకు అంగీకరించి.. సదరు యువతికి తోటి పెళ్లికూతురుగా ఉండేందుకు తమకు ఇష్టమేనని సంతకం చేశారట. -
గల్ఫ్ గోస; ఓ భారతీయురాలి దీనగాథ
సాక్షి, న్యూఢిల్లీ : అరబ్ దేశమైన ఓమన్ రాజధాని మస్కట్ నగరంలో మే నాలుగవ తేదీన ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న 38 ఏళ్ల శీజా దాస్ తన యజమానురాలు పెడుతున్న చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా రెండంతస్తుల మేడ మీది నుంచి దూకేశారు. దాంతో ఆమెకు వెన్నుముకతోపాటు రెండు కాళ్లు విరిగాయి. ఎడమ వైపు నడుము నుంచి పాదం వరకు శరీరం పూర్తిగా చచ్చుపడి పోయింది. ఓమన్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం ఆమెను మే 26వ తేదీన భారత్‌లోని కేరళకు పంపించారు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురం జిల్లా, చిరాయింకీజు గ్రామంలోని చిన్న ఇంటిలో జీవచ్చవంలా రోజులు లెక్కపెడుతోంది. కదలలేని మెదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెకు ఆమె భర్త బిజుమన్ సదాశివన్ సపర్యలు చేస్తున్నారు. శీజా దాస్ ఇంతటి దుస్థితికి కారణమైన ఆమె యజమానురాలి నుంచి మాత్రం ఆమెకు నష్టపరిహారంగా ఒక్క పైసా రాలేదు. అందుకు ప్రస్తుత భారత ప్రభుత్వం కారణమవడం బాధాకరం. నేడు శీజా దాస్‌కు జరిగిన అన్యాయం.. 2015లో తమిళనాడుకు చెందిన 58 ఏళ్ల కస్తూరి మునిరత్నంకు సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఎదురైన దారుణాన్ని గుర్తుచేస్తోంది. అతి తక్కువ డబ్బులకు తనతో అరవచాకిరి చేయిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు యజమాని ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినందుకు 2015, అక్టోబర్ 8వ తేదీన ఆమె కుడిచేతిని ఇంటి యజమాని నరికేశారు. ఈ సంఘటనపై నాడు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వార్త తెల్సిన మరుక్షణమే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆమె అక్టోబర్ 9వ తేదీన తొమ్మిది గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే: ‘గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ కంట్రీస్’గా పిలిచే ఓమన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు పని మనుషులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిలో శీజా దాస్, మునిరత్నంలాంటి బాధితులు కూడా వేలల్లో ఉంటారని అక్కడి భారతీయ సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఉన్న ఉద్యోగం ఊడిపోతుందని, ప్రాణాలకే ముప్పు ముంచు కొస్తోందనే భయంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయరని వారు చెబుతున్నారు. పస్తులు, వీపు దెబ్బలు శీజా దాస్ 2016వ సంవత్సరం నుంచి మస్కట్‌లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిచేస్తున్నారు. అదే యజమాని కింద 2013 నుంచి ఆమె భర్త శివదాసన్ పనిచేస్తుండడంతో తన జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని శీజా భావించారు. ఇద్దరి జీతాల నుంచి కూడ బెట్టుకున్న సొమ్ముతో ఓ చిన్న ఇల్లు కూడా కట్టుకోవచ్చని వారు కలలుగన్నారు. గత వేసవి సెలవుల్లో వారు తమ ఇద్దరు పిల్లల (13 ఏళ్ల శ్రీరప్, రెండేళ్ల శోభిత్)ను తీసుకొని మస్కట్ వెళ్లారు. ఎంత పనిచేసినా సరిగ్గా పనిచేయడం లేదంటూ ఇంటి యజమానురాలు కర్రతో ఎప్పుడూ శీజా వీపుపై బాదేదట. పస్తులు ఉంచేదట. మే నాలుగవ తేదీన ఏదో సాకుతో చితకబాదడం మొదలు పెట్టిందట. ఎంత వేడుకున్నా వదిలి పెట్టలేదట. తరిమి తరిమి కొట్టిందట. ఆ దెబ్బలను తప్పించుకునేందుకు రెండో అంతస్తు మేడ మీదకు పరుగెత్తిందట. అయినా వెంటపడడంతో తప్పించుకునేందుకు మరో మార్గం లేక కిందకు దూకేసిందట. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మస్కట్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారట. మస్కట్‌కు రాకముందు తన భార్య శీజా 48 కిలోల బరువు ఉండేదని, ఆస్పత్రిలో చేరనాటికి ఆమె బరువు 30 కిలోలే ఉందని భర్త శివదాసన్ తెలిపారు. తన భార్యకు నెలకు 50 ఓమన్ రియల్స్ (8,750 రూపాయలు) ఇస్తానన్న హామీతో పనిమనిషిగా ఉద్యోగంలో పెట్టుకున్నారని, యజమాని ప్రతి నెల ఆమె బ్యాంక్ ఖాతాలో ఆ జీతం మొత్తాన్ని జమచేసి మళ్లీ అదే రోజు విత్‌డ్రా చేయించి తీసుకునే వారని ఆయన తెలిపారు (అక్కడ పని మనుషుల జీతాలను తప్పనిసరిగా బ్యాంకుల ద్వారానే చెల్లించాలి). అంతా కలిపి మళ్లీ భారత్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తానని చెప్పేవారని, అనుమానం ఉన్నా చేసేదేమీ లేక ఊరుకున్నామని ఆయన చెప్పారు. తనకు మాత్రం నెలకు 17,500 రూపాయలు వచ్చేదని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన తన భార్యకు నష్టపరిహారం చెల్లించకపోగా, జీతంగా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. భారత్‌కు పంపించేందుకు తన భార్య శీజాకు మాత్రమే తమ యజమాని విమాన టిక్కెట్టు కొన్నారని, తనకు, తమ పిల్లలకు కొనలేదని శివదాసన్ తెలిపారు. వీరి పరిస్థితి గురించి ఓమన్‌లో సామాజిక, సాంస్కతి సంస్థగా రిజిస్టర్ అయిన ‘ఇండియన్ సోషల్ క్లబ్’ అధ్యక్షుడు, ‘కేరళ నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డ్’ డైరెక్టరయిన పీఎం జబీర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు. ఆమె ఆదేశం మేరకు మస్కట్‌లోని భారతీయ ఎంబసీ జోక్యం చేసుకొని బిజూమన్, ఇద్దరు పిల్లలకు కూడా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసి భారత్‌కు పంపించారు. ఒక్క నయాపైసా కూడా యజమాని నుంచి శీజాకు రాలేదు. చట్టాలు ఏమి చెబుతున్నాయి? విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం కోసం 2011లో విదేశాల్లో భారతీయుల వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంది. వాటిల్లో షరతులు, మార్గదర్శకాలు ఉన్నాయి. భారతీయులను పని మనిషిగా పెట్టుకునే విదేశీ యజమానికి నెలకు కనీసం 2,600 డాలర్ల ఆదాయం ఉండాలి. సదరు యజమాని ఒక్కో పని మనిషికి 2,850 డాలర్ల (దాదాపు రెండు లక్షల రూపాయలు) చొప్పున భారత అంబసీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. దీన్ని అంబసీ సెక్యూరిటీ డిపాజిట్‌గా పరిగణిస్తుంది. యజమాని జీతాలు చెల్లించనప్పుడు, న్యాయపరమైన పోరాటం అవసరమైనప్పుడు, నష్టపరిహారం కోసం బాధితుడికి అంబసీ ఈ సొమ్మును ఖర్చు పెడుతుంది. ఇక నెలకు కనీస జీతాన్ని 280 డాలర్లు (దాదాపు 18,800 రూపాయలు)గా నిర్దేశించింది. అంతేకాకుండా యజమాని ఉచిత భోజన సౌకర్యంతోపాటు ఉచిత వసతి కూడా కల్పించాలని షరతు విధించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుతో మొబైల్ ఫోన్ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఏడాదికోసారి భారత్ వచ్చిపోయేందుకు ప్రయాణ ఖర్చులు భరించాలి. 2015లో భారత ప్రభుత్వం ఈమ్రైగ్రేషన్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. పని మనుషులకు సంబంధించిన అన్ని వీసా కార్యకలాపాలు ఈ వెబ్సైట్ ద్వారానే నిర్వహించాలి. నష్టపరిహారం ఎత్తివేశారు విదేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండంతో భారతీయ అంబసీ కోరుతున్న బ్యాంక్ గ్యారంటీ అందుకు కారణం అవుతుందని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో గల్ఫ్‌తోపాటు మొత్తం 18 దేశాల్లో ఈ షరతు ఎత్తివేసింది. పర్యవసానంగా నేడు శీజా దాస్‌కు నష్టపరిహారం అందకుండా పోయింది. ‘ఇంటి కల ఎలాగు చెదిరిపోయింది. నా వైద్యానికి ఉన్నదంతా ఖర్చయిపోయింది. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఇక నేనా లేవలేను. నేను ఎప్పుడు కన్నుమూసినా ఫర్వాలేదు. కానీ ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత, బరువు నా భర్తపై పడింది. ఎలా నెట్టుకొస్తాడో ఏమో’ అంటూ ఆమె మీడియాతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భారతీయ పని మనుషులకు సరైన భద్రత కల్పించాలి. లేకపోతే శీజా లాంటి కథలు వింటూనే ఉంటాం’ అని పీఎం జబీర్ వ్యాఖ్యానించారు. -
షాకింగ్.. సినీ సెలబ్రిటీలు ఇంత దారుణమా?
ముంబై: బాలీవుడ్ నటీనటులు సినిమాల్లో గొప్ప పాత్రల్లో కనిపిస్తుంటారు. పబ్లిక్‌లోనూ, మీడియా సమావేశాల్లోనూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతారు. సినీ కార్యక్రమాల్లో అయితే అభిమానులే దేవుళ్లు అని చెబుతుంటారు. నిజజీవితంలో కూడా వారు హుందాగా మంచితనంతో ప్రవర్తిస్తారా అంటే చాలామంది కాదనే చెప్పవచ్చు. పనిమనుషులతో బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రవర్తించే తీరు తెలిస్తే విస్మయం చెందుతారు. కొందరు మినహా చాలామంది సినీ ప్రముఖులు పనివాళ్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తారట. పనివాళ్లను కొట్టడం, తిట్టడం, సరిగ్గా భోజనం పెట్టకపోవడం, జీతం ఇవ్వకపోవడం వంటి సంఘటనలు చాలా వెలుగు చూశాయి. అయితే ఇవన్నీ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లలేదు. సినీ ప్రముఖులపై కేసు పెట్టడానికి పనివాళ్లు భయంతో వెనుకంజ వేయడమే దీనికి కారణం. ముంబైలోని హౌస్ కీపింగ్ సర్వీస్ ప్రొవైడర్లు.. బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో పనిచేసేందుకు సిబ్బందిని పంపడానికి వెనకడుగు వేస్తున్నారు. సినీ ప్రముఖులు పెట్టేబాధలను సిబ్బంది తమతో గోడు వెళ్లబోసుకోవడమే కారణం. సిబ్బంది నుంచి వారికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. హ్యాపీ మెయిడ్స్ సర్వీస్ డైరెక్టర్ అభిషేక్ సాబ్లె మాట్లాడుతూ.. బాలీవుడ్ వాళ్లతో కాంట్రాక్టులను ఆపివేశానని చెప్పాడు. 'నా అనుభవంలో తెలిసిన మేరకు కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే మంచివారు. చాలామంది పనివాళ్లకు మంచి భోజనం పెట్టరు. ఒకవేళ వంటవాళ్లు చేసిన భోజనం నచ్చకపోతే ప్లేట్‌ను వాళ్ల మొహంపైకి విసురుతారు' అని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో ఓ సెలబ్రిటీ వంటమనిషిని కాలితో తన్ని లేపి, పనిచేయమని డిమాండ్ చేశాడని సాబ్లె వెల్లడించాడు. మరో నటుడు పనిమనిషిపై తప్పుడు దొంగతనం కేసు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లానని, బాధితురాలు తనకు తెలిసిన మంత్రితో గోడు వెళ్లబోసుకోవడంతో కేసును కొట్టివేశారని తెలిపాడు. ఓ మరాఠీ నటి కులం విషయంలో గొడవ పడుతుందని, తనకు అంబేడ్కర్ కులానికి చెందినవాళ్లు వద్దని షరతు పెట్టిందని చెప్పాడు. ఓ సారి ఆమె తనను హత్య చేయిస్తానని బెదిరించిందని, ఓ మంత్రితో కూడా ఫోన్ చేయించిందని సాబ్లే తెలిపాడు. సినీ ప్రముఖులు సరిగా జీతాలు చెల్లించరని, వారిని మూడ్‌ను బట్టి ప్రవర్తిస్తుంటారని ఓ సర్వీస్ ప్రొవైడర్ చెప్పాడు. పోలీసు కేసు పెడతామన్నా వాళ్లు భయపడరని, పోలీసులు కూడా ఈ విషయంలో సాయం చేయరని తెలిపాడు. ఇలాంటి ఘటనలు పెద్ద స్టార్ల నుంచే గాక చిన్న నటులు, మోడల్స్, టీవీ నటుల నుంచి కూడా తమకు ఎదురవుతుంటాయని వాపోయాడు. బుక్ మై బాయ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ సిన్హాల్ మాట్లాడుతూ.. 'బాలీవుడ్ ప్రముఖులు పనివాళ్లను దారుణంగా తిడతారు. కొడతారు. నెలల కొద్దీ జీతాలు ఇవ్వరు. ఇలాంటి వాళ్లలో జాతీయ అవార్డు విజేతలు, రోల్ మోడల్స్ కూడా ఉన్నారు. వారి పేరు చెబితే నా కంపెనీపై పరువు నష్టం కేసు వేస్తారు. ఇలాంటి సందర్భాల్లో నా సిబ్బంది నా వెంట ఉండాలి. పోలీసు స్టేషన్‌కు వెళ్లి వాళ్లపై కేసు పెట్టాలి. లేకపోతే నేను చేయగలినది ఏమీ లేదు. పనివాళ్లు పోలీసు కేసు పెట్టడానికి వెనుకాడుతారు. ఎందుకంటే వాళ్లు బతకడం కోసం, డబ్బు సంపాదించేందుకు వచ్చారు. కేసులు, గొడవలు తమకెందుకని భయపడుతారు' అని చెప్పాడు. -
కోడల్నీ కుటుంబ సభ్యురాలుగా చూడాలి..
కోడలికి కుటుంబంలో కనీస గౌరవం కూడ దక్కడం లేదని, కోడల్ని బయటి వ్యక్తిగాకాక, కూతురుగా చూసే సంప్రదాయం అలవరచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వైవాహిక జీవితాల్లో వచ్చే గొడవల్లో కోడల్ని పరాయి మనిషిగా చూస్తున్నారని, ఆమెను ఓ అద్దెకు తెచ్చుకున్న సేవకురాలిగానే తప్పించి స్వంత మనిషిగా స్వీకరించలేకపోతున్నారని, ముఖ్యంగా భారత దేశంలో కోడళ్ళు అనేక సందర్భాల్లో తీవ్ర వేధింపులకు గురౌతున్నారని భారత ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. వివాహం తర్వాత అత్తవారింటికి వచ్చే కోడలు... ఎట్టిపరిస్థితుల్లోనూ బయటి వ్యక్తి కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అంతేకాక ఆమెను భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు, కోడలుగా కాక కూతురుగా చూడాలని సూచించింది. కోడలికి ఇచ్చే సమానత్వం, గౌరవం నాగరిక సమాజంలోని సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్త చేతిలో చిత్రహింసలకు గురై ఆత్మ హత్య చేసుకున్న భార్య కేసుకు తీర్పు ఇచ్చిన సందర్భంలో, భర్తకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు... అత్తవారింట్లో కోడల్ని చూడాల్సిన విధానానంపై ప్రకటన చేసింది. వరకట్నదాహం, దురాశతో మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడంతో ఒక్కోసారి వధువులు ప్రాణాలను సైతం తీసుకోవడం క్రూరత్వానికి నిదర్శనమని, ఇది అత్యంత సిగ్గు పడాల్సిన విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నో కోరికలతో, కలలుగన్న జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన వధువులు అవమాన భారంతోనో, భరించలేని బాధలతోనో ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా అత్తింటి రాక్షసత్వానికి పరాకాష్ట అని అభిప్రాయపడింది. కొందరు బాధలను భరిస్తూ బానిసలుగా బతుకుతున్నారని అటువంటి పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయమూర్తులు రాధాకృష్ణన్, దీపక్ మిశ్రాల ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు ప్రకటనను దేశవ్యాప్తంగా మహిళా సంఘాలే కాక, ప్రజలు సైతం స్వాగతించారు.