బరువు పెరగొద్దు.. పెళ్లికి ముందు నో ప్రెగ్నెన్సీ | Brides Bizarre Contract for Bridesmaids No Weight Gain Pregnancy | Sakshi

‘బరువు పెరగొద్దు.. పెళ్లికి ముందు నో ప్రెగ్నెన్సీ’

Jan 4 2021 6:45 PM | Updated on Jan 4 2021 8:36 PM

Brides Bizarre Contract for Bridesmaids No Weight Gain Pregnancy - Sakshi

వివాహం ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేస్తుంది. అప్పటి వరకు ఎవరికి వారుగా బతికిన వారు పెళ్లి తర్వాత ఒకరి కోసం ఒకరు సర్దుకుపోయి.. కలిసిమెలసి జీవిస్తారు. అయితే ఎక్కువగా అమ్మాయిలే భర్తకు అనుగుణంగా మారతారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వధువు కాబోయే వాడికి కండిషన్‌లు పెడుతుంది. అయితే తాజాగా ఓ పెళ్లి కుమార్తె పెట్టిన కండిషన్‌ల లిస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతూ.. ట్రోలింగ్‌కి గురవుతుంది. ఎందుకంటే ఇక్కడ సదరు వధువు కాబోయే భర్తకు కాకుండా తోటి పెళ్లి కుమార్తెలుగా వ్యవహరించే యువతులకు కొన్ని తలతిక్క కండిషన్స్‌ పెట్టింది. బ్రైడ్స్‌మేడ్‌ కండిషన్‌ లిస్ట్‌ పేరుతో విడుదల చేసిన ఈ ప్రకటనలో 37 నియమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వారి దుస్తులు, అలంకరణ, చేయాల్సిన పనులకు సంబంధించినవి కాగా మరి కొన్ని కాస్త తలతిక్కగా ఉన్నాయి. అవేంటి అంటే తనకు తోటి పెళ్లి కుమార్తెగా వ్యవహరించే యువతి సదరు కాబోయే వధువు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్‌ కాకుడదు.. బరువు మూడు కిలోలకు మించి పెరగకూడదు. ఇక సదరు బ్రైడ్స్‌మేడ్స్‌ పెళ్లికి వచ్చిన మగ అతిథులకు సైట్‌ కొట్టకూడదు.. అలానే వారిని సంతోషంగా ఉంచాలి అని సూచించింది. (చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం‌)

ఇక వివాహం నాడు బ్రైడ్స్‌మేడ్స్‌ తను చెప్పిన దుస్తులే ధరించాలని.. పెదాలకు, గోళ్లకు, తలకు రంగురంగుల లిప్‌స్టిక్‌, నెయిల్‌ పాలిష్‌, కలర్స్‌ వేసుకోకూడదని సూచించింది. ఇక వివాహానికి బయటి వ్యక్తులను తీసుకురాకూడదు. పెళ్లితంతుకు సంబంధించి ఏవైనా కార్యక్రమాలు బయట ప్రాంతంలో జరిగితే.. అక్కడికి వెళ్లడానికి అయ్యే ఖర్చులను తోటిపెళ్లికూతుళ్లే స్వంతంగా భరించాలని సూచించింది. ప్రస్తుతం ఈ వింత నియమాల లిస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక నెటిజనులు ‘నువ్వు ఎంత ఇడియట్‌వో ఈ లిస్ట్‌ చదివితే తెలుస్తుంది... ఇక నిన్ను చేసుకోబోయే వాడి పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మొత్తం పది మందికి ఈ లిస్ట్‌ పంపితే అందులో ఆరుగురు ఈ నియమాలకు అంగీకరించి.. సదరు యువతికి తోటి పెళ్లికూతురుగా ఉండేందుకు తమకు ఇష్టమేనని సంతకం చేశారట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement