వధువు జంప్‌..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్‌ | Twist: Bride Runs Away With Her Boyfriend, Groom Marries Her Sister | Sakshi
Sakshi News home page

వధువు జంప్‌..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్‌

Published Fri, Feb 19 2021 8:05 PM | Last Updated on Sat, Feb 20 2021 3:02 AM

Twist: Bride Runs Away With Her Boyfriend, Groom Marries Her Sister - Sakshi

భువనేశ్వర్‌ : మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వధువు ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో ముహూర్తం సమయానికి పెళ్లి జరగాల్సిందేనని, వధువు చెల్లెలిని అయినా తనకు కట్టబెట్టాలని వరుడు కోరగా వేరే గత్యంతరం లేక అమ్మాయి కుటుంబసభ్యులు కూడా ఇందుకు ఒప్పుకుంటారు. అనుకున్న సమయానికి పెళ్లికొడుకు..వధువు చెల్లిలో మెడలో తాళి కట్టి అత్తారింటికి తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే అతనికి అసలు సిసలు ట్విస్ట్‌ ఎదురైంది. ఈ పెళ్లి చెల్లదని అధికారులు తేల్చి చెప్పడంతో వరుడు బిత్తెరపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మాల్పాడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది.

మరికొద్ది సేపట్లో  పెళ్లి తంతు జరగాల్సి ఉండగా..వధువు తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. దీంతో తమ పరువు పోతుందని, వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలని వరుడు తరుపు వాళ్లు పట్టుబట్టారు.  దీంతో వేరే దారి లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. అయితే తంతు ముగిసి అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లాకా అధికారులు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి వయస్సు 15 ఏళ్లే కావడంతో ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని,చట్టారీత్యా ఇది నేరమని పేర్కొన్నారు. 18 ఏళ్లు వచ్చేదాకా అమ్మాయిని అత్తారింటికి పంపొద్దని చెప్పడంతో వారు కూడా అంగీకరించారని జిల్లా పిల్లల రక్షణ అధికారి సుకాంతి బెహెరా తెలిపారు. మైనర్‌ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. 

చదవండి : (వైరల్‌: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్‌)

               (నగ్నంగా ఏనుగెక్కిన మోడల్‌!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement