చెవులు ఎందుకు కుట్టించాలి? | tradition of ears cut | Sakshi
Sakshi News home page

చెవులు ఎందుకు కుట్టించాలి?

Published Sun, May 20 2018 1:47 AM | Last Updated on Sun, May 20 2018 1:47 AM

tradition of ears cut - Sakshi

చెవులు కుట్టించుకోవడం అనేది కేవలం అందం కోసమేనని చాలామంది భావిస్తారు. మరికొందరు ఇదో మూఢనమ్మకంగా భావిస్తారు. మొరటు చర్యగా, చిన్నారులను హింసించే చర్యగా కొందరు వితండవాదం చేస్తారు. అందుకే ఇటీవల కాలంలో చాలామంది చెవులు కుట్టించే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బయట దుకాణంలో దొరికే కమ్మలను చెవికి అతికిస్తే సరిపోతుందిలే అని సరిపెట్టుకుంటున్నారు. కానీ అది పొరపాటు. ఈ సంప్రదాయం వెనక గొప్ప వైజ్ఞానిక విషయాలనేకం ఉన్నాయి.

చెవులు కుట్టించడం అనేది ఆక్యుపంక్చర్‌ వైద్య విధానానికి సంబంధించినది. అయితే.. ఇలాంటి మెళకువలన్నీ భారతీయులే కనిపెట్టారని, కనక ఇది భారతీయుల సంప్రదాయమని చెబుతున్నారు. ఆ తర్వాతే చైనీయులు మన ఆచారాన్ని తీసుకున్నారంటారు. అదలా ఉంచితే, చెవికి కళ్లు, ముక్కు, పళ్లు వంటి అవయవాలతో సంబంధం ఉంది. కాబట్టి చెవులు కుట్టించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

చెవులు కుట్టించడం వల్ల రుతు సంబంధ అనారోగ్య సమస్యలు రావని, ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందనీ, మెదడు చురుగ్గా పనిచేస్తుందనీ ఆధునికులు కూడా అంగీకరిస్తున్నారు. చెవులు కుట్టడం వల్ల ఆ ప్రాంతంలో నాడీ మండల వ్యవస్థను ఉత్తేజితం చేసే నాడులు ప్రేరణ చెందుతాయి. దీంతో జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

అంతేకాదు, చెవులకు కింది భాగంలో మధ్యలో పోగులు కుట్టడం వల్ల కళ్లకు సంబంధించిన నాడులు ఉత్తేజితమై.. కంటిచూపు మెరుగుపడుతుంది... ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. పూర్వం పురుషులకు కూడా విధిగా చెవులు కుట్టించేవారు. ఇప్పుడు కూడా కొందరు పురుషులు ఫ్యాషన్‌గా చెవులు కుట్టించుకుంటున్నారనుకోండి... మంచి పరిణామమే అనుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement