ears cut
-
గన్నుతో భర్త చెవులు కాల్చేసి..
కోల్‌కతా : భర్త తనను వదిలి ఇంటి నుంచి తరుచూ పారిపోతున్నాడనే కోపంతో గన్నుతో అతని రెండు చెవులను కాల్చేసిందో భార్య. ఈ ఘటన మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతాకు సమీపంలోని నర్కెల్‌గంగకు చెందిన తన్వీర్(20) రెండు సంవత్సరాల క్రితం తనకంటే వయస్సులో 20 సంవత్సరాలు పెద్దదైన ముంతాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ముంతాజ్ తన్వీర్‌ను తరుచూ చిత్రహింసలకు గురిచేసేది. ముంతాజ్ పెట్టే బాధలు భరించలేక అతను ఇంటి నుంచి పారిపోయిన ప్రతిసారి వెనక్కు పట్టుకువచ్చి చిత్రహింసలు పెట్టేది. తమ కొడుకును విడిచి పెట్టాల్సిందిగా తన్వీర్ తల్లిదండ్రులు ఆమెను బ్రతిమాలినా వినలేదు. భర్త ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బులు సైతం తీసుకుని అతన్ని ఇంటికి పంపించలేదు. తన్వీర్ గత కొద్దిరోజులుగా ముంతాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. అతన్ని సొంత ఊరికి పోనివ్వకుండా, తల్లిని కలవనీయకుండా ఆంక్షలు విధించింది. కొద్దిరోజుల క్రితం అతడు ఆ ఇంటి నుంచి మల్లిక్‌పుర్‌కు పారిపోయినా.. తన మనషుల సహాయంతో వెనక్కి రప్పించిన ముంతాజ్, ఆమె చెల్లెళ్లు అతన్ని తీవ్రంగా హింసించారు. మంగళవారం రాత్రి ముంతాజ్ గన్నుతో తన్వీర్ రెండు చెవులను కాల్చేసింది. దీంతో తన్వీర్ చనిపోయాడని అక్కాచెల్లెళ్లు భావించారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ తన్వీర్ అక్కడినుంచి తప్పించుకుని దగ్గరలోని ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. తన్వీర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముంతాజ్, ఆమె చెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
చెవులు ఎందుకు కుట్టించాలి?
చెవులు కుట్టించుకోవడం అనేది కేవలం అందం కోసమేనని చాలామంది భావిస్తారు. మరికొందరు ఇదో మూఢనమ్మకంగా భావిస్తారు. మొరటు చర్యగా, చిన్నారులను హింసించే చర్యగా కొందరు వితండవాదం చేస్తారు. అందుకే ఇటీవల కాలంలో చాలామంది చెవులు కుట్టించే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బయట దుకాణంలో దొరికే కమ్మలను చెవికి అతికిస్తే సరిపోతుందిలే అని సరిపెట్టుకుంటున్నారు. కానీ అది పొరపాటు. ఈ సంప్రదాయం వెనక గొప్ప వైజ్ఞానిక విషయాలనేకం ఉన్నాయి. చెవులు కుట్టించడం అనేది ఆక్యుపంక్చర్ వైద్య విధానానికి సంబంధించినది. అయితే.. ఇలాంటి మెళకువలన్నీ భారతీయులే కనిపెట్టారని, కనక ఇది భారతీయుల సంప్రదాయమని చెబుతున్నారు. ఆ తర్వాతే చైనీయులు మన ఆచారాన్ని తీసుకున్నారంటారు. అదలా ఉంచితే, చెవికి కళ్లు, ముక్కు, పళ్లు వంటి అవయవాలతో సంబంధం ఉంది. కాబట్టి చెవులు కుట్టించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెవులు కుట్టించడం వల్ల రుతు సంబంధ అనారోగ్య సమస్యలు రావని, ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందనీ, మెదడు చురుగ్గా పనిచేస్తుందనీ ఆధునికులు కూడా అంగీకరిస్తున్నారు. చెవులు కుట్టడం వల్ల ఆ ప్రాంతంలో నాడీ మండల వ్యవస్థను ఉత్తేజితం చేసే నాడులు ప్రేరణ చెందుతాయి. దీంతో జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. అంతేకాదు, చెవులకు కింది భాగంలో మధ్యలో పోగులు కుట్టడం వల్ల కళ్లకు సంబంధించిన నాడులు ఉత్తేజితమై.. కంటిచూపు మెరుగుపడుతుంది... ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. పూర్వం పురుషులకు కూడా విధిగా చెవులు కుట్టించేవారు. ఇప్పుడు కూడా కొందరు పురుషులు ఫ్యాషన్‌గా చెవులు కుట్టించుకుంటున్నారనుకోండి... మంచి పరిణామమే అనుకోవాలి. -
చిలకలా ఉండేందుకు చెవులు కోసుకున్నాడు...
లండన్: బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరానికి చెందిన టెడ్ రిచర్డ్స్ అనే 56 ఏళ్ల ప్రబుద్ధిడికి రామ చిలకలంటే ప్రాణమే కాదు, వల్లమాలిన పిచ్చి. ఆ పిచ్చికాస్త ఈ మధ్య మరీ ప్రకోపించింది. దాంతో తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న రామ చిలకల్లాగా తన ముఖం కూడా ఉండాలని భావించాడు. అంతే...తన రెండు చెవులను సర్జరీతో తీసేయించుకున్నాడు. రామ చిలక రంగులను తలపించేలా ముఖానికి దాదాపు 150 రంగు రంగుల టాట్టులను వేయించుకున్నాడు. అంతటితో సంతృప్తి పడలేదు. జుట్టును కత్తిరించుకొని తల ముందుభాగాన ముచ్చటగా మూడు చిన్నపాటి కొమ్ములను తగిలించుకున్నాడు. ముక్కు కొసన ఓ రింగ్, బుగ్గలపై మెరిసే మెటల్ వస్తువులను తగిలించుకునేందుకు ఏకంగా 150 రంధ్రాలు చేయించుకున్నాడు. నాలుక కొసను రెండుగా చీల్చుకున్నాడు. చిలుకను పోలిన ముక్కును సాధించేందుకు ముక్కు సర్జరీ కోసం ముస్తాబవుతున్నాడు. తనకిష్టమైన ఎల్లి, టీకా, తిమ్నేహ్, జేక్, బూబీ అంటూ ముద్దుగా పిలుచుకునే రామ చిలకలతో ఆడుకుంటూ మురసిపోతున్నాడు. ‘ఇప్పుడు నిజంగా నేను గొప్పగా కనిపిస్తున్నాను. ఇది నాకెంతో ఆనందంగా ఉంది. నా సంతోషానికి అవధులు లేవు. అద్దంలో చూసుకోకుండా ఒక్క క్షణం ఉండలేక పోతున్నానంటే ఒట్టు. ముద్దొచ్చే నా చిలకల్లా సాధ్యమైనంత వరకు ఉండాలన్నదే నా తాపత్రయం’ అని తన వింత చేష్ట గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఓ చెప్పుల కంపెనీలో పనిచేసి రిటైరయిన రిచర్డ్స్కు బాడీ పెయింటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. దానికి ఇప్పుడు వెర్రి వేషాలు తోడయ్యాయి. తన ఎడమ భుజం మీద శాంతి చిహ్నం చెక్కించేందుకు 750 సెంటిగ్రేడ్ డిగ్రీల వద్ద వేడిచేసిన ఇనుప కడ్డీలను ఉపయోగించాడు. ఇప్పుడు తాను బయటకు ఎక్కడికెళ్లినా తనవైపు పిన్నా, పెద్దలందరూ వింతగా చూస్తున్నారని, అది తనకెంతో థ్రిల్లింగా ఉందని రిచర్డ్స్ తెలిపాడు. తాను ముదటి నుంచి ఇతరులకన్నా భిన్నంగా ఉండాలని, తనలా ఎవరూ ఉండకూడదని భావించే వాడినని ఇప్పుడు తనకా కోరిక తీరిందని చెప్పాడు. అంతా బాగానే ఉన్నప్పటికీ చిన్న ఇబ్బంది మాత్రం తప్పడం లేదని వాపోయాడు. చెవులులేక పోవడం వల్ల కళ్లజోడు పెట్టుకోవడం కష్టమవుతోందని అన్నాడు.