
నవ్వులతో పోటీపడేలా..!
ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకున్నా, ప్రత్యేకంగా అనిపించాలన్నా దుస్తులు, హెయిర్ స్టైల్స్‌తో పాటు గాజుల గలగలలు కూడా తప్పనిసరి. సంప్రదాయం, ఆధునికం ఏదైనా రకరకాల మోడల్ గాజులను ధరించడం అంటే అమ్మాయిలకు అమితమైన మక్కువ. గాజుల గలగలలు నవ్వులతో పోటీపడాలంటే వాటి ఎంపికలోనూ, ధరించడంలోనూ మెళకువలను పాటించాలి.
ఎక్కువ గాజులు వేసుకునేటప్పుడు చూడగానే కంటికి నదురుగా కనిపించే ఒక ప్రత్యేకమైన గాజును సెంటర్‌లో ఉండేట్టుగా వేసుకోవాలి.
ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే ఒక చేతికి మాత్రమే గాజులు వేసుకొని, ఆ గాజులను పోలి ఉండే ఫంకీ రింగ్‌ను మరొక చేతి వేలికి ధరించాలి.
నాలుగు నుంచి ఆరు గాజులు వేసుకునేటప్పుడు వాటికి మరికొన్ని భిన్నమైన గాజులను జోడించి ధరించాలి.
వెండి, బంగారు, ఇతర లోహపు గాజులు ధరించేటప్పుడు రంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా నేచరల్ కలర్స్‌ని ఎంపిక చేసుకుంటే కాంప్లిమెంట్స్ కూడా అందుతాయి. లెదర్, దారం, పూసలతో తయారుచేసిన బ్రేస్‌లెట్స్‌ను ధరించినప్పుడు ఇతర సంప్రదాయ గాజులకు దూరంగా ఉండటం మంచిది.
గాజుల ఎంపిక సమయంలో మీ మణికట్టు పరిమాణం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.