వింత ఆచారం.. వరుణుడి కరుణ కోసం అమ్మాయిని అబ్బాయిగా అలంకరించి.. | Kakarnataka: Two Minor Girls Marriage For On Time Rains Vijayapura District | Sakshi
Sakshi News home page

వింత ఆచారం.. వరుణుడి కరుణ కోసం అమ్మాయిని అబ్బాయిగా అలంకరించి..

Published Fri, Jun 17 2022 8:49 AM | Last Updated on Fri, Jun 17 2022 9:52 AM

Kakarnataka: Two Minor Girls Marriage For On Time Rains Vijayapura District - Sakshi

చిన్నారులకు పెళ్లి జరిపిస్తున్న దృశ్యం

సాక్షి,బళారి: వరుణ దేవుడి కరుణ కోసం విజయపుర జిల్లాలో చిన్నారులకు వివాహాలు జరిపిస్తున్నారు. జిల్లాలోని ముద్దేబిహాల్‌ తాలూకా సాలతవాడ పట్టణంలో కారుపౌర్ణిమ తర్వాత చిన్నారులకు పెళ్లి జరిపించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే అబ్బాయి, అమ్మాయికి పెళ్లి చేస్తున్నారనుకుంటే పొరపాటు. ఇక్కడ అమ్మాయిని అబ్బాయిగా అలంకరించి, మరొక అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. 14 సంవత్సరాలు లోపు అమ్మాయిలతో ఈ తంతు పూర్తి చేస్తారు.

పెళ్లి జరిపించడంతో పాటు విందు, దేవాలయాలు సందర్శన చేస్తారు. సంప్రదాయబద్దంగా 18 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, శాంతి నెలకొంటుందని వారి నమ్మకం.

చదవండి: తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్‌ మీడియాలో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement