సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
అహోబిలం (ఆళ్లగడ్డ): మన సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందామని కేరళ రాష్ట్రానికి చెందిన గురువాయర్ మందిర్ ప్రధానార్చకులు కూనంపల్లి శ్రీరాంనంభూదిరి స్వామి అన్నారు. లోక సంరక్షణార్థం వారం రోజుల పాటు భాగవత్ పారాయణం చే సేందుకు కేరళలోని ఎర్నాకులం భక్త సేవా సంస్థ సభ్యులు 150 మంది ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలానికి వచ్చారు. ముందుగా స్వామిని దర్శించుకుని పారాయణం ప్రారంభించారు. కార్యక్రమంలో మాలోల అతిథి గృహ మేనేజర్ భద్రినారాన్, అనంతకృష్ణన్, కృష్ణన్ పాల్గొన్నారు