దెయ్యాల వివాహ సంప్రదాయం గురించి విన్నారా!. ఏంటిదీ ఈ రోజుల్లోనా అనుకోకుండా కొన్ని చోట్ల దీన్ని పాటిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా ఆ వివాహతంతు గురించి మ్యాట్రిమోనియల్ సైటల్‌లోనే ప్రకటన ఇచ్చింది ఓ కుటుంబం. అది విని అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ ప్రకటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వినియోగదారుడు 2022లో ఈ ట్వీట్ గురించి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాను అలాంటి వివాహానికి హాజరయ్యానని చెప్పుకొచ్చాడు. ఇది మీకు పనికిరాని విషయంగా అనిపించొచ్చు. కానీ ఇలాంటివి ఈ రోజుల్లో కూడా ఉన్నాయా? ఇలాంటి సంప్రదాయల్ని పాటిస్తున్నారా అనే విషయం గురించి తెలియజేయడం కోసం ఇది షేర్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి సంప్రదాయాలు భారత్‌లో ఎక్కువగా కేరళ, కర్ణాటకలో నిర్వహిస్తుంటారు. అలానే ఓ కేరళ కుటుంబం ఏకంగా 30 సంవత్సరాల క్రితం చనిపోయిన వధువు తగిన వరుడు కావాలంటూ ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రకటన ఇచ్చింది.
ఆ తర్వాత చనిపోయిన వరుడు కుటుంబం ఆచూకి లభించగానే..చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ఆ వధువరులిద్దరికి వివాహతంతు జరిపి ఇరుకుటుంబ సభ్యులు ఒకరింటికి ఒకరు వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. ముఖ్యంగా ఇలా కడుపులో శిశువుతో చనిపోయిన మహిళకి, యుక్త వయసు రాకుండానే చనిపోయిన పిల్లలకు ఇలాంటి తంతు జరిపిస్తారట. ఇలా చేస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో వృద్ధిలో ఉంటుందనేది పెద్దల నమ్మకం. వాళ్ల దృష్టిలో పిల్లల తమను విడిచిపెట్టిపోలేదని ఆత్మల రూపంలో తమ వెంటే ఉన్నారని భావించి ఇలా చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ దీన్ని పాటించడం విశేషం.
(చదవండి: రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు! ఎందుకో తెలుసా)
Comments
Please login to add a commentAdd a comment