సంప్రదాయ విజ్ఞానం ముఖ్యమైనది. కానీ దానిలోని దురవగాహనలకు తప్పక అడ్డుకట్ట వేయాలి. విమర్శ స్ఫూర్తిని అభివృద్ధి చేయడాన్ని రాజ్యాంగం ఒక విధిగా నిర్దేశించిన భారత్ వంటి దేశంలో నిపుణులు తప్పుడు సమాచారంపై కూడా యుద్ధం చేయాలి. ప్రసవ సమయంలో ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయడానికి ఉన్న ప్రాధాన్యతపై, ఆధునిక తల్లితండ్రులకు అపసవ్యతలు, మానసిక వ్యాధులతో పిల్లలు ఎందుకు పుడుతున్నారు అనే అంశంపై చర్చ నడుస్తోంది. దీనికి సంస్కార లేమిని కారణంగా చూపుతున్నారు. శాస్త్రీయ, సామాజిక, నైతిక స్థాయిల్లో ఇలాంటి ఆలోచన తప్పు. పిల్లల జెండర్ కారణంగా మహిళలను సంప్రదాయికంగా నిందిస్తున్న వాతావరణం గురించి ప్రతి డాక్టర్ కూడా జాగరూకతతో ఉండాలి.
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. అది అభివృద్ధికి పరాకాష్టగా ఉండి పతనమైంది, మళ్లీ వృద్ధి చెందుతోంది. ఒకప్పుడు మనకు విలువైన సంప్ర దాయ విజ్ఞానం ఉండేది. అయితే ఇప్పుడది ఆధునిక శాస్త్రీయ మదింపునకు గురికావలసి ఉంది. పైగా సంప్రదాయ విజ్ఞానానికి తగిన సాక్ష్యాధారం లేదని భావిస్తున్నారు. కానీ ఆరోగ్య రంగంలో, స్వావలంబనతో కూడిన జీవన ఆచరణలు ఆయుర్వేదంలో సమృద్ధిగా ఉన్నాయి. ఆధునిక వైద్యం ఇప్పుడు వాటినే ప్రతిధ్వనిస్తోంది. ఉదా హరణకు, ప్రేవుల ఆరోగ్యం(గట్ హెల్త్), పలురకాల ఆరోగ్యకరమైన ఆహార రకాల లక్షణాలను, వంటల పద్ధతులను ఆయుర్వేదం చాలా కాలంగా నొక్కి చెబుతోంది. ఆహారం, ప్రేవుల్లోని సూక్ష్మజీవులు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయనే అంశాన్ని ఆధునిక సైన్స్ ఇటీవల మాత్రమే పరిగణనలోకి తీసుకుంది.
అయితే సంప్రదాయ విజ్ఞానం మూఢనమ్మకాలతో, దురభిప్రా యాలతో కూడి ఉంటోంది. వ్యక్తికీ, సమాజానికీ హాని కలిగించకుండా వీటిని తప్పక వడపోత పోయాలి. వైద్యంలో నిరూపించాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తప్పు సూచన ఇస్తే అది మానవ ప్రాణాలకే ప్రమాదకరం. సందేహాస్పదమైన మూలికా సప్లిమెంట్ల కారణంగా ఆరోగ్యవంతమైన ప్రజల్లో కూడా కాలేయం దెబ్బతింటున్న కేసులు పెరుగుతున్నాయి. వీటన్నింటికీ ఉత్తమమైన వైఖరి ఆరోగ్యపరమైన సంశయవాదమే. అప్పుడు మాత్రమే మూలంతో పనిలేకుండా కొత్త ఆలోచనలు మనలో తెరుచుకుంటాయి.
ఏదైనా నిరూపితం కాని కొత్త ఆలోచన కనిపించినప్పుడు, మూడు కోణాల్లోని కచ్చితమైన ప్రమాణాలతో దాని లబ్ధిని పరీక్షించాల్సి ఉంటుంది. మొదటిది, శాస్త్రీయ ఆమోదయోగ్యత. రెండు, జరిగే హానిని పరిశీలించడం. మూడు, నిర్దిష్ట శాస్త్రీయ సంభావ్యత. శాస్త్రీయ వైద్య ఆచరణలో మేళనం వైపుగా సాక్ష్యాన్ని తీసుకురాదగిన సంభావ్యత ఇది. సైన్స్, సైంటిఫిక్ మెథడ్ ద్వారా సత్యాన్ని వెంటా డటం భవిష్యత్ సమగ్ర వైద్యశాస్త్రపు సారాంశం. అలాంటి మార్గాన్ని చాలా సంస్థలు సిఫార్సు చేశాయి. వీటిలో మూఢ నమ్మకాలను పాతిపెట్టిన వారి నుంచి, నీతి ఆయోగ్ వంటి భారతదేశ పరివర్తనకు మార్గదర్శకత్వం వహిస్తున్న సంస్థల వరకు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇది సవాలుతో కూడుకున్నది.
ఇటీవలే, ఏకీకరణ వైద్యానికి సంబంధించి మాతృ, శిశు వైద్యుల సమావేశం ఒకటి జరిగిందని మీడియా కథనాలు వెలువరించాయి. ఇందులో నా పూర్వసంస్థ అయిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ ఫ్యాకల్టీ కూడా పాల్గొ న్నారు. అయితే ఆ కథనంలో కొన్ని భాగాలు అశాస్త్రీ
యంగా ఉండటం ఇబ్బంది కలిగించింది. పుట్టబోయేవారికి సంబంధించిన తల్లుల లింగపరమైన అంచనాలు పిల్లల్లో స్వలింగ సంప ర్కానికి దారితీయవచ్చనేది అందులో ఒకటి. ఉదాహరణకు ఆడ పిల్లను కోరుకుంటున్న గర్భిణి మగపిల్లాడిని హోమోసెక్సువల్ (స్వలింగ సంపర్కి)గా పెరిగేట్టు చేస్తుందనే ఆలోచన హాస్యాస్పదం. జీజాబాయి(శివాజీ తల్లి) ప్రార్థనలను గర్భవతిగా ఉన్నప్పుడు అను సరిస్తే ‘హిందూ నాయకుల’ లక్షణాలతో పిల్లలు పుడతారన్న సూచ నలు ఆందోళనకరం.
ప్రసవ సమయంలో ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయ డానికి ఉన్న ప్రాధాన్యతపై, ఆధునిక తల్లితండ్రులకు అపసవ్యతలు, మానసిక వ్యాధులతో పిల్లలు ఎందుకు పుడుతున్నారు అనే అంశంపై చర్చ నడుస్తోంది. దీనికి సంస్కార లేమిని కారణంగా చూపుతున్నారు. శాస్త్రీయ, సామాజిక, నైతిక స్థాయిల్లో ఇలాంటి ఆలోచన చాలా తప్పు. అంతిమ సమగ్ర మొత్తం దాని విడిభాగాల మొత్తం కంటే తక్కువగా ఉండదని మనం ఎలా నిర్ధారించాలి?
పలువురు ఆయుర్వేద సహచరులు ఈ చర్చను ‘గర్భసంస్కార్’పై వక్రీకరించిన వైఖరి అని తోసిపుచ్చారు. ప్రసవ సమయంలో ఆరోగ్యకరమైన ఆచరణల ప్రాధాన్యత గురించే గర్భసంస్కార్ మాట్లాడుతుంది. భవిష్యత్తు పిల్లల ఆరోగ్యాన్ని బాహ్య జన్యు ప్రభావాల ద్వారా ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మీడియా నివేదికల గురించి ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన డాక్టర్ల బృందంలో చాలామంది జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే ఇలాంటి ఆలోచనలు, ఆచరణలు అంత హానికరం కాదని మరి కొంతమంది భావించారు. అలాంటి నివేదికల్లో మంచి భాగాన్ని ప్రజలు తీసుకోవచ్చనీ, మిగతా వాటిని వదిలేయాలనీ వీరు సూచించారు. వీరి దృష్టిలో, సాక్ష్యాధారం లేక పోవడం అంటే సాక్ష్యం లేదని అర్థం కాదు. పైగా మనం సంప్ర దాయాల గురించి మరీ విమర్శనాత్మకంగా ఉండకూడదన్నది వీరి ఆలోచన. భారత్‌లో సమగ్ర పరిశోధనల నిర్వహణకు ఈ రెండో వైఖరి ఎంతమాత్రమూ ఉపకరించదు.
ఆయుర్‌జీనోమిక్స్ అనేది ఆయుర్వేద భావనలు, జీనోమిక్ పరిశోధనల సంగమం. దీనికి నా పూర్వ సంస్థ సీఎస్‌ఐఆర్–ఐజీఐబీ విజయవంతంగా నేతృత్వం వహించింది. ఎందుకంటే మేము నిజా యితీతో కూడిన శాస్త్రీయ చర్చలు జరిపేవాళ్లం. ఆ చర్చల్లో మేము ఆయుర్వేద టీమ్‌కు సాక్ష్యాధారాల గురించి సవాల్ విసిరేవాళ్లం. ఒక పక్షం నిపుణులు మరొక పక్షంలోని వాళ్లను ప్రశ్నించకూడదని భావిస్తుంటారు. ఇలాంటి వైఖరి తెలివితక్కువతనంతో కూడింది. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారుతుంది. సహకారం అందించు కునే సమయాల్లో శాస్త్రీయ సంభావ్యతల సరిహద్దులను మేం పాటించేవాళ్లం. వాటిని తరచుగా తిరిగి సందర్శించేవాళ్లం. నూతన జ్ఞానాన్ని గుర్తించేవాళ్లం. ఇది అర్థవంతమైన సహకారాన్ని వేగవంతం చేసేది. మరోవైపున అర్థరహితమైన వాటిని తొలగించేవాళ్లం. పైగా, మహి ళలు తప్పుడు సమాచారపు పర్యవసానాలను ఎదుర్కొంటున్న భారత్ వంటి భిన్నమైన సమాజంలో వాస్తవికతల నేపథ్యంలో మాత్రమే మనం ఫలితాన్ని వీక్షించవలసిన అవసరం ఉంది.
సీనియర్ నిపుణుల ద్వారా ప్రచారమయ్యే తప్పుడు విశ్వాసాలకు పర్యవసానాలు ఉంటాయి. పైన పేర్కొన్న ఉదాహరణలో, ఇలాంటి చర్చలు పిల్లల్లోని వివిధ సామర్థ్యాలు లేక లైంగిక ధోరణుల కారణంగా తల్లిని నిందించడానికి దారితీస్తాయి. లేదా గర్భిణిపై సామాజిక ఒత్తిడిని కలిగిస్తాయి. పిల్లల జెండర్ కారణంగా మహిళలను సంప్ర దాయికంగా నిందిస్తున్న వాతావరణం గురించి ప్రతి డాక్టర్ కూడా జాగరూకతతో ఉండాలి. అలాంటి సామాజిక అవలక్షణాలకు తప్పుడు సమాచార ప్రచారాన్ని వైద్యులు అనుసంధానించుకోగల గాలి. శాస్త్రీయ ఉ«ధృతిని, మానవవాదాన్ని, విమర్శ స్ఫూర్తిని, సంస్క రణను అభివృద్ధి చేయడం ప్రాథమిక విధిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ (హెచ్)ని కలిగి ఉన్న దేశంలో వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు చేయ వలసింది చాలానే ఉంది.
ఒక ఆచరణను ప్రశ్నించే లేదా సవాలు చేసే విషయంలో సీని యర్లను లేదా బోధకులను ఆధునిక వైద్య సంస్థలతో సహా భారత్‌లో తగినవిధంగా గౌరవించడం లేదు. పర్యవసానంగా, మనకు మితి మీరిన విశ్వాసం ఉంటోంది తప్పితే సైంటిఫిక్ టెంపర్ ఉండటం లేదు. ఇది తప్పక మారాలి. మన ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాతే ఇత రులతో వ్యవహరించే నమ్మకం మనకు వస్తుంది. మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నట్లే ఇతరుల ఆచరణలను కూడా మనం శాస్త్రీయంగా ప్రశ్నించగలం. చిట్టచివరగా, ఈ ప్రపంచంలో మ్యాజిక్ లేదు, సర్వత్రా సైన్స్ మాత్రమే ఉంది.
అనురాగ్ అగర్వాల్
వ్యాసకర్త డీన్, బయోసైన్సెన్ అండ్ హెల్త్ రీసెర్చ్, అశోకా యూనివర్సిటీ
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment