దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమైనాయి. భక్తులు తొమ్మిది రోజుల పాటు, ఆ జగన్మాతను భక్తితో ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వారి వారి ఆచారాలు, పద్ధతుల ప్రకారం అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వడోదరలో ఒక ప్రత్యేకమైన నవరాత్రి సంప్రదాయం గురించి తెలుసుకుందాం.
నవరాత్రి వేడుకల్లో భాగంగా గుజరాత్‌లో పురుషులు ఆనాదిగా ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు. 200 సంవత్సరాల నాటి శాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నవమిరోజు సంప్రదాయ బద్ధంగా మహిళల్లా దుస్తులు ధరిస్తారు. అంతేకాదు చీర కట్టుకొని అష్టమి రోజు రాత్రం జానపద నృత్యమైన షేరీ , గర్బా నృత్యం చేస్తారు. ‘సాదుబా మాత’ను పూజిస్తారు. ( Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!)
తరతరాలుగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 200 ఏళ్ల క్రితం, ‘సదుబెన్’ అనే మహిళను ఒక మొఘల్ కులీనుడు లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. దీంతో బారోట్ సమాజంలోని పురుషులను రక్షణ కోరింది. దీనికి సదరు పురుషులు సాయం చేసేందుకు నిరాకరిస్తారు. ఫలితంగా ఆమె బిడ్డను కోల్పోతుంది. ఈ బాధ, దుఃఖం, ఆవేదనతో భవిష్యత్ తరాల పురుషులు పిరికిపందలుగా మారతారని శపించి 'సతీ'ని పాటించింది. (మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!)
ఇదీ చదవండి: శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం
ఆ శాపం చాలా శక్తివంతమైందిగా అక్కడి వారు ఇప్పటికీ నమ్ముతారు. అందుకే ఈ ఈ ఆచారాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. సాదుమాను శాంతింప చేసేందుకు, ఆమెను గౌరవించుకునేందుకు ఒక ఆలయాన్ని నిర్మించారు. నవమి రోజు ప్రత్యేక పూజలు చేసి భవిష్యత్తరాన్ని కాపాడాలని వేడుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment