దసరా.. అన్ని వర్గాల వారికీ ఆనందాన్ని పంచే పండగ! ఎన్నో సెంటిమెంట్లను సరదాలను, మెసుకొచ్చే శుభదినం. కొత్త బట్టలు, కొత్త కార్లు, కొత్త ఇల్లు, సరికొత్త ఆభరణాలు కొత్త మొబైల్, ఇలా కొంగొత్తగా వేడుక ఉండాలని ఆరాట పడతారు. కొత్త వ్యాపారాలు చేసే వారు దసరా ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయల్లా విలసిల్లాలని మొక్కుకుంటారు. అంతేనా ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు అబ్బో.. ఆ సందడే వేరు!
మనసంతా షాపింగ్
సరదా అంటేముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఆఫ్‌లైన్‌లైనా ఆన్‌లైన్‌లైనా షాపింగ్ మాత్రం మస్ట్. దీన్ని క్యాష్ చేసుకునేందుక రకకరకాల ఆఫర్లతో మురిపిస్తుంటాయి కంపెనీలు. ఏ మాత్రం హడావిడి లేకుండా, జాగ్రత్తగా షాపింగ్ చేసేయ్యడమే. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. మనకి కావలన్నపుడు నచ్చినవి దొరక్క, డీలా పడ్డం కాదు, చీప్‌గా దొరికినపుడు దక్కించుకోవడమే ఇదీ లేటెస్ట్ ట్రెండ్
కలిసొచ్చే సెలవులు
దసరా అంటే పిల్లలకు కూడా చాలా సంబరం. ఎందుకంటే దాదాపు పది రోజులు ఎంచక్కా సెలవులొస్తాయి. అమ్మచేతి కమ్మనైన వంటలు (అపుడపుడు మొట్టికాయలు కూడా) తినేయొచ్చు. కొత్త బట్టలొస్తాయి, కొత్త బొమ్మలూ వస్తాయి. సన్నిహిత బంధువుల పిల్లకాయలొస్తారు. ఇంకేంముంది ఇల్లు పీకి పందిరేయడమే.
స్వీట్లు
స్వీట్లు లేని దసరా ఊహించుకోగలమా? చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ జగన్మాతను పూజించుకోవడంతోపాటు, నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. లడ్డూలు, జిలేబీలు, గులాబ్ జామూన్ పూతరేకులతోపాటు, జంతికలు, కారప్పూస, సఖినాలు ఇలా రకరకాల పిండి వంటల తయారీలో మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక దసరా నాడు, గారెలూ, బజ్జీలూ, వడలు, ఇక ఆ తరువాత కోడికూర, మటన్ మంచింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి.
దసరా భక్తి
దసరా' అనే 'దశ' అంటే 'పది' ,'హర' అంటే 'ఓటమి' అనే రెండు సంస్కృత పదాలనుంచి వచ్చింది. దసరా నవరాత్రులు, లేదా దేవీ నవర్రాతులు పేరుతో తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మను కొలుస్తారు. ఈ శరన్నవ రాత్రల్లో దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి దేవాలయాలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతాయి.
రాముడు (విష్ణువు ఎనిమిదవ అవతారం), శని యుగంలో జన్మించిన పది తలల రాక్షసుడు రావణుడిని సహరించిన శుభ సందర్భాన్ని, పాండవుల అజ్ఞాత వాసం వీడి, శమీ వృక్షం మీదున్న ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని కూడా దసరాగా జరుపుకుంటారు. ఇందులో భాగమే రావణ దహనం, శమీ పూజలు
తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాలు
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పాటిస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చిన పండుగు కనుక శరన్నరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. తొమ్మిది రకాల పైవేద్యాలు సమర్పిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి. మహా సరస్వతి, నందయ, రక్త దంతి, శాకంబరి దుర్గ, మాతంగి, భ్రమరి అవతారాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. బాలాత్రిపుర సుందరి , గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి మహిషాసరమర్ధిని, దర్గమ్మ, రాజరాజేశ్వరి, మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది.
బొమ్మల కొలువు
దసరా సంబరాల్లో బొమ్మల కొలువు మరో ముఖ్యమైన ఆచారం. ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దడంలో మహిళలు, అమ్మాయిలు తమ కళాత్మక దృష్టిని ప్రదర్శిస్తారు. ఇది కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సంస్కృతీ సంపన్నమైన ఆచారాలకు ప్రతిబింబంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment