
భద్రం.. పడుతారు
హైదరాబాద్ సిటీ: బైక్‌పై ఒక్కరు లేదా ఇద్దరు వెళ్తారు కానీ.. మేము కొంచెం వేరు.. మాకు ఏ నిబంధనలు వర్తించవు అన్నట్లు ఐదుగురు యువకులు ఒకే బైక్‌పై ప్రయాణించారు. తేడా వస్తే.. ఏమవుతుందో పరిస్థితి ఆలోచించినట్లు లేరు వీరు. ఒక పక్క రోడ్డు ప్రమాదాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా.. ఇలాంటి సాహసాలను మాత్రం మారడం లేదు.
తాజాగా ఆదివారం హైదరాబాద్ నగరంలోని చింతల్‌లో ఒకే బైకుపై ఐదుమంది యువకులు వెళ్తున్న ఫొటో 'సాక్షి' కెమెరాకు చిక్కింది. అయితే, ఐదుగురిలో ఒక యువకుడు మాత్రం కెమెరా కంటికి కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు.