హైదరాబాద్: నగరంలోని చింతల్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. వివరాలు.. చింతల్ ఐడీపీఎల్ చౌరస్తాలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. చింతల్‌లో నివాసం ఉండే రాంబాబు హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం ఉదయం బైక్‌పై హైటెక్‌సిటీకి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది