రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీ కొట్టిన ట్రాలీ ఆటో
గచ్చిబౌలి (హైదరాబాద్): రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాలీ ఆటో ఢీ కొట్టడంతో బైక్‌పై వెళుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేష్ గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మసీద్‌బండలో పీజీ హాస్టల్‌లో ఉంటున్న ప్రతిభా చంద్(25) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అతను బైక్‌పై గచ్చిబౌలి నుంచి మసీద్‌బండకు వెళుతున్నాడు.
గచ్చిబౌలి స్టేడియం ఎదుట పాలప్యాకెట్ల లోడ్‌తో రాంగ్ రూట్‌లో వచ్చిన టాటా ఏసీ ట్రాలీ ఆటో అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రతిభా చంద్‌ను కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి హెల్మెట్ ధరించనందునే తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment