Wrong Route
-
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచ్చిబౌలి (హైదరాబాద్): రాంగ్ రూట్లో వచ్చిన ట్రాలీ ఆటో ఢీ కొట్టడంతో బైక్‌పై వెళుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మసీద్‌బండలో పీజీ హాస్టల్లో ఉంటున్న ప్రతిభా చంద్(25) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అతను బైక్‌పై గచ్చిబౌలి నుంచి మసీద్‌బండకు వెళుతున్నాడు. గచ్చిబౌలి స్టేడియం ఎదుట పాలప్యాకెట్ల లోడ్‌తో రాంగ్ రూట్లో వచ్చిన టాటా ఏసీ ట్రాలీ ఆటో అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రతిభా చంద్‌ను కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి హెల్మెట్ ధరించనందునే తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Sowmya Janu Photos: హోంగార్డ్‌పై దాడి..ట్రెండింగ్ లో నటి సౌమ్య జాను (ఫొటోలు)
-
రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్‌లపై నిబంధనలు కఠినతరం
-
Viral Video: రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో చూడండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పేరు తలుచుకుంటేనే గుర్తుకొచ్చేది ఒకటి బిర్యాని అయితే రెండు ట్రాఫిక్.. పని మీద బయటకొచ్చి రోడ్లపైకి వస్తే ఎన్ని గంటలకు గమ్య స్థానానికి చేరుతారో ఎవరూ ఊహించలేరు. ఆఫీస్‌కు లేట్ అయితే బాస్ తిడతారనే భయంతో అతివేగంతో రోడ్డు మీద ప్రయాణిస్తుంటారు. మార్గ మధ్యలో రోడ్డు దాటాల్సి వస్తే.. యూ టర్న్ వరకూ వెళ్లాలి. అలా వెళ్తే కొంత సమయం వృథా అవుతుందనే తొందరలో చాలా మంది తప్పని తెలిసినా రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా, ప్రకటనలు ఇచ్చినా కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే విషయం అర్థమవుతుంది. చదవండి: రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి.. వీడియోలో.. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌పై రాంగ్ రూట్లో వస్తున్నాడు. హెల్మెట్ కూడా ధరించలేదు. అంతేగాక తప్పుడు మార్గంలో వస్తున్నాననే భయం లేకుండా బైక్ నడుపుతూ వాహనదారులకు ఎదురెళ్లాడు. ఇంతలో మలుపు నుంచి వస్తున్న కారు అతన్ని బలంగా డీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పిట్టలాగ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ట్రాఫిక్ రూల్ పాటించకపోవడంతో ఎంత పని జరుగుతుందో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతుంది. సెంటిమీటర్ ప్రయాణం అయినా రాంగ్ రూట్లో నడపవద్దని పోలీసులు సూచించారు. సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/SsFkp84XXc — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 7, 2022 -
ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..!
సాక్షి, ముంబై: ప్రస్తుత కాలంలో తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే మనం సాధారణంగా గూగుల్ మ్యాప్‌నే నమ్ముకుంటాం..గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత, తక్కువ ట్రాఫిక్ ఉన్న మార్గాలను ఎంచుకోవడం, షార్ట్ కట్స్‌ను తెలుసుకోవడంమే కాదు గూగుల్ మాత ఉందిగా ఎందుకు బెంగ అనేంతగా పరిస్థితి మారిపోయింది. అయితే గ్యూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని తప్పులో కాలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్లి ఓ కారు ఏకంగా డ్యామ్‌లోనే పడిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒక ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పుణెకు చెందిన గురు శేఖర్ (42) మిత్రులతో కలిసి ఫార్చ్యూనర్ కారులో సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకున్నారు. డ్రైవర్ సతీష్, మిత్రుడు సమీర్, మరో వ్యక్తితో కలిసి మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. మధ్యాహ్నం వేళ అక్కడకు బయలుదేరిన వీళ్లు మధ్యలో దారి తప్పిపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించారు. కానీ దురదృష్టవశాత్తూ అది కూడా రాంగ్ రూట్ చూపించింది గూగుల్. కానీ అది తెలియని వీరు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ పోయారు. చీకటిపడినా గూగుల్ మ్యాప్ చూపిస్తుందన్న ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒక డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును పోనిచ్చాడు..అంతే కారు క్షణాల్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన శేఖర్, సమీర్, మరో వ్యక్తి కారు డోర్లను తీసుకుని ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు.. కానీ, సతీష్‌కు ఈత రాకపోవడంతో బయటకురాలేక, కారులోనే ప్రాణాలొదిలాడు. మరునాడు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడికి కొంతదూరంలో కారును పోలీసులు గుర్తించారు. అందులో సతీష్ మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే, అక్కడ బ్రిడ్జి ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, అది ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరచి ఉంటుందనిడిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మాధ్నే తెలిపారు. మిగతా 4 నెలలు ఆ బ్రిడ్జి పై నుంచి నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు. ఈ బ్రిడ్జికిపైనే పెద్ద డ్యామ్ ఉన్న కారణంగా, నీటిని విడుదల చేసినప్పుడు బ్రిడ్జిమునిగిపోతుందని వెల్లడించారు. ఈ విషయం స్థానికులకు తెలుసు కనుక వారు జాగ్రత్తగా ఉంటారు. కానీ రాత్రి పూట, గూగుల్ డైరెక్షన్ ఆధారంగా వెళ్లి డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారన్నారు. గూగుల్ మ్యాప్‌లను గుడ్డిగా నమ్మితే, కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని ఈ సంఘటన నిరూపిస్తోంది. సో...తస్మాత్ జాగ్రత్త! -
దారికొచ్చాడు
కేరళలోని ఓ ప్రాంతం. ప్రధాన రహదారి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు. దోవంతా నాదే అన్నట్టుగా భారీ వాహనాలకు కేటాయించిన లేన్‌ను వదిలి.. అంటే రైట్ లేన్‌ను వదిలి లెఫ్ట్లేన్లోంచి వెళ్తోంది. అయినా పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్లిపోతున్నారు చాలా మంది. ఇంతలోకే ఎర్ర రంగు టూ వీలర్ మీద రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చుడీదార్, ఎర్ర రంగు హెల్మెట్ ధరించిన ఓ యువతి ఆ బస్సుకు ఎదురు వచ్చింది. బస్సు డ్రైవర్ ‘‘పక్కకు తప్పుకో అమ్మా...’’ అని అరిచాడు అసహనంగా. అంగుళం కూడా కదల్లేదు ఆమె. రోడ్డు మీద వెళ్లే వాహనదారుల దృష్టి ఆ సన్నివేశం పై పడింది. నెమ్మదిగా వేగం తగ్గించి చోద్యం చూడ్డం మొదలుపెట్టాయి. బస్సు వెనక ఆగిన వాహనాల హారన్లు మారుమోగుతున్నాయి. బస్సుకు ఎదురుగా ఉన్న ఆ టూవీలర్ కదిలితే కాని బస్సు ముందుకు కదలదు. ‘‘రాంగ్ రూట్లో ఉన్నావు.. నీ లేన్‌లోకి వెళ్లు’’ అని చెప్పకుండానే బస్సుకు ఎదురొడ్డి చెప్తోంది ఆమె. అలా అయిదు నిమిషాలు గడిచాయి. తన తప్పు, పరిస్థితి అర్థమైన బస్సు డ్రైవర్ తన లేన్‌లోకి స్టీరింగ్ వీల్‌ను తిప్పక తప్పలేదు. అలా బస్సు తన రూట్లోకి గేర్ మార్చుకోగానే తన దారిన తాను వెళ్లిపోయింది ఆ యువతి. నోటి మాట లేకుండా చేతలతో డ్రైవర్‌కి చెక్ పెట్టి పౌరురాలిగా తన కర్తవ్యాన్నీ నిర్వహించింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యం తప్ప ఆ యువతి పేరు, తదితర వివరాలేవీ బయటికి రాలేదు. ఏమైనా ఆడవాళ్ల సామాజిక బాధ్యతకూ అద్దం పడుతోంది ఆ వీడియో! -
రాంగ్రూట్లో ఎమ్మెల్యే.. వీడియో అంటే వెనక్కు తగ్గారు
సాక్షి, సిటీబ్యూరో: ఓ పక్క జోరుగా నిమజ్జన వాహన శ్రేణి ముందుకు సాగుతుండగా... గురువారం రాత్రి ఓ ఎమ్మెల్యే వాహనం బషీర్‌బాగ్ చౌరస్తాలో హల్చల్ చేసింది. రాంగ్రూట్లో వచ్చి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించింది...దీనిని గుర్తించిన డీఎస్పీ స్థాయి అధికారి వెంకట్‌రెడ్డి సదరు వాహనాన్ని అడ్డుకున్నారు. ఎలాంటి వాగ్వాదం, ఘర్షణలకు తావు లేకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వాహనాన్ని వెనక్కు పంపారు. సామూహిక నిమజ్జనం నేపథ్యంలో గురువారం నగర వ్యాప్తంగా 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరం మధ్య నుంచి శోభాయాత్ర రూట్ ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఇవి అమలులో ఉన్నాయి. పశ్చిమ భాగం నుంచి తూర్పు వైపునకు వెళ్లడానికి కేవలం బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కింద, కనకదుర్గ దేవాలయం వద్ద మాత్రమే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం వరకు వాహనాలను మామూలుగానే వదిలిన పోలీసులు విగ్రహాలతో వస్తున్న లారీల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రూట్‌ను నియంత్రించారు. తాళ్లను ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు అవకాశం చిక్కినప్పుడల్లా విగ్రహాలను తీసుకువచ్చే లారీలను ఆపి సాధారణ ట్రాఫిక్‌ను ఇటు లక్డీకపూల్ వైపు, అటు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు పంపుతున్నారు. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. ఒక్కో వాహనం బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ దాటడానికి 20 నుంచి 25 నిమిషాలు పట్టింది. ఆ ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్, విగ్రహాలను తీసుకువస్తున్న వాహనాలను నియంత్రించడం ట్రాఫిక్ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అదే సమయంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న ఓ ఇన్నోవా లక్డీకాపూల్ వైపు నుంచి రాంగ్రూట్లో బషీర్‌బాగ్ చౌరస్తా వరకు దూసుకువచ్చింది. అక్కడ నుంచి సరైన మార్గంలోకి మారి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. దీనిని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రత్యేక అధికారి, రాష్ట్ర ఈ–చలాన్ విభాగం డీఎస్పీ కె.వెంకట్‌రెడ్డి గమనించారు. తక్షణం ఆ వాహనాన్ని అడ్డుకుని వెనక్కు వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే వాహనం నుంచి కిందికి దిగిన గన్‌మెన్ లోపల సార్ ఉన్నారని, ముందుకు వెళ్ళాల్సి ఉందని చెబుతూ కాస్సేపు అక్కడే కారు ఆపారు. ఇందుకు అంగీకరించని వెంకట్‌రెడ్డి ఏ మాత్రం వాగ్వాదానికి అవకాశం ఇవ్వకుండా తన జేబులో ఉన్న సెల్‌ఫోన్ తీసి ఎమ్మెల్యే వాహనాన్ని వీడియో తీసేందుకు సిద్ధమయ్యారు. దీని ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గన్‌మెన్‌కు స్పష్టం చేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాన్ని వెనక్కు తిప్పుకుని వెళ్లక తప్పలేదు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఆయన సమయస్ఫూర్తిని అభినందించారు. వెంకట్‌రెడ్డి గతంలో మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గానూ పని చేశారు. -
ఇలాంటోళ్లు ఉండాల్సిందే!
-
ఇలాంటోళ్లు ఉండాల్సిందే!
భోపాల్ : రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనదారులకు బుద్ధి చెప్పేలా ఓ వ్యక్తి చేసిన పనిపై పలువురు అభినందనలు కురిస్తున్నారు. అయితే తప్పును ఎత్తి చూపే క్రమంలో ధైర్యంగా నిలబడిన యువకుడు దాడికి గురికావటం.. చుట్టుపక్కల వెళ్లేవారు కాసేపటి దాకా వారిని అడ్డుకునే యత్నం చేయకపోవటం ఇక్కడ గమనార్హం. నవంబర్ 3న ఈ ఘటన భోపాల్‌లోని ఓ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. ఓ ఎస్యూవీ వాహనం రాంగ్ రూట్లో రావటం గమనించిన ఓ యువకుడు తన బైక్‌ను అడ్డుగా నిలిపాడు. చాలా సేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే బైక్ పై ఉన్న వ్యక్తి మాత్రం అస్సలు చలించలేదు. చివరకు ఎస్‌యూవీతో ఢీకొట్టేందుకు ఝలక్ ఇవ్వగా.. యువకుడు అస్సలు బెదరలేదు. చివరకు తన ఫోన్‌తో నెంబర్ ఫ్లేట్ ఫోటోలు తీశాడు. అది గమనించిన ఎస్యూవీ వాహనదారుడు కూడా అదే పని చేయగా.. చివరకు ఆ వాదులాట తన్నులాటకు దారితీసింది. బైక్‌పై ఉన్న వ్యక్తిపై ఎస్యూవీ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా పిడిగుద్దులు కురిపించాడు. ఆఖర్లో కొందరు వచ్చి వారిని విడిపించారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇండోర్‌కు చెందిన నిలయ వర్మ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో ఆ సీసీటీవీ ఫుటేజీని.. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని పోస్టు చేశారు. బైక్‌పై ఉన్న యువకుడికి హాట్సాఫ్.. తప్పును ధైర్యంగా ప్రశ్నించే ఇలాంటోళ్లు ఉండాల్సిందే అంటూ ఆయన అభినందనలు కురిపించారు. ఆ వీడియోను ఇప్పటికే 5 మిలియన్లకుపైగా వీక్షించారు. రాంగ్ రూట్‌ను అడ్డుకున్నాడని దాడి చేశాడు -
దొంగల బండి
రాంగ్ రూట్లలోనే వెళుతుందండి! మెక్సికో సిటీలోకి కొత్తగా ఈ దొంగల బండి వచ్చింది! దీని పేరు ‘కరెప్టూర్’ (కరెప్ట్ + టూర్). దీన్నెక్కి కూర్చుంటే మెక్సికో సిటీలోని అందమైన సందర్శనీయ స్థలాలను చూడనే చూడలేం. అసలీ బండి అటువైపే వెళ్లనివ్వదు. దీని రూటే సపరేటు! రాంగ్ రూట్లో వెళుతుంది. అంటే అడ్డదిడ్డంగా, వన్ వేలలో వెళుతుందని కాదు. సిటీలోని రాంగ్ ప్లేసెస్‌లోకి వెళుతుంది. రాంగ్ టూర్ అన్నమాట. విషయం ఏంటంటే.. మెక్సికో సిటీలోని కరెప్టెడ్ ఏరియాస్‌కి ఇది మనల్ని తిప్పుతుంది. ఇదిగో ఇక్కడే ఆ మర్డర్ జరిగింది, అక్కడుంది చూశారా.. ఆ బిల్డింగ్‌లోనే కోట్ల డాలర్ల స్కామ్ జరిగింది, ఇక ఇది.. అక్రమ రవాణా అడ్డా, అదేమో చీకటి పనుల ప్రధాన కేంద్రం.. ఇలా మెక్సికో ప్రతిష్టను దెబ్బతీస్తున్న 27 పాడు సైట్లకు ఈ దొంగల బండి మనల్ని తిప్పుతుంది. దారి మధ్యలో కూడా ఆపి ఎక్కొచ్చు. వెంకన్న దర్శనానికి మెల్లిగా కదులుతున్న క్యూలో.. మధ్యమధ్య ‘గోవిందా.. గోవిందా’ అని భక్తులు గోవింద జపం చేస్తుంటారు కదా. అదే విధంగా రోడ్డు మీద ఈ బండి వెళుతున్నప్పుడు పక్క వాహనాల వాళ్లు ‘నో మోర్ కరప్షన్... నో మోర్ కరప్షన్’ అని గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలని ఈ దొంగల బండి ఆపరేటర్లు ఉత్సాహపరుస్తుంటారు. లోపల కూర్చున్నవాళ్లు కూడా మూవింగ్‌లో అరుచుకుంటూ వెళ్లొచ్చు. విరాళాలు పోగేసి, 5000 డాలర్లతో ఈ వాహనాన్ని తయారు చేశారు. అవినీతి ప్రదేశాల వివరాలను బండిపై పెయింట్ చేశారు. దీన్నింకా ఆకర్షణీయంగా డెవలప్ చేస్తారట. మెక్సికోలో దాపరికాలు ఉండవు అని చాటి చెప్పడం ఈ కరెప్టూర్ ఉద్దేశం. ఇటీవలే విడుదలైన 2016 పారదర్శక సూచిక (ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్)లో మొత్తం 176 దేశాలలో మెక్సికో 123వ స్థానంలో నిలిచింది. దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం కావచ్చు ఈ కరెప్టూర్! మెక్సికో సిటీ రోడ్లపై కరెప్టూర్; (ఇన్సెట్) : నగర సందర్శకులు -
రాంగ్‌సైడ్ బైక్ డ్రైవింగ్.. ముగ్గురికి గాయాలు
ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా బైక్ నడిపిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం నేరేడ్మెట్ వాయుపురిలో ఒకే బైక్‌పై నలుగురు యువకులు రాంగ్రూట్లో వెళ్తున్నారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారును బైక్ ఢీకొనటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రాంగ్ రూట్లో వెళ్లి ప్రాణాలు కోల్పోయారు
వన్ వే మార్గంలో వాహన ప్రవేశాల నిషేధాన్ని పట్టించుకోకుండా బైక్‌పై వెళుతూ ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ గోపయ్య స్వామిల దర్శనం చేసుకుని బైక్‌పై తిరిగి వెళుతున్నారు. నందిగామ బైపాస్ రోడ్డులో (ఆ మార్గం వన్‌వే) వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. తీవ్ర గాయాలతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. -
హోంగార్డు చెంప చెళ్లు మనిపించిన యువతి
-
హోంగార్డు చెంప చెళ్లు మనిపించిన యువతి
కేసు నమోదు చేసిన కీసర పోలీసులు కీసర : ద్విచక్రవాహనంపై రాంగ్రూట్లో వెళ్తున్న ఓ యువతి.. తనను ఫొటో తీసినందుకు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హాంగార్డు చెంప చెల్లుమనిపించింది. రంగారెడ్డి జిల్లా కీసర ఠాణా పరిధిలో ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ గురువారెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని దమ్మాయిగూడకు చెందిన అర్చిత ఇంజినీరింగ్ చదువుతోంది. మంగళవారం సాయంత్రం ఆమె తన ద్విచక్రవాహనంపై నాగారం గ్రామం మీదుగా స్వగ్రామానికి వెళ్లేందుకు రాంగ్రూట్లో వెళ్తోంది. దమ్మాయిగూడ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న మల్కాజిగిరి ట్రాఫిక్ ఠాణాకు చెందిన హోంగార్డు వెంకటేష్ ఈ విషయం గమనించి తన వద్ద ఉన్న కెమెరాలో యువతి వాహనాన్ని ఫొటో తీశాడు. ఇది గమనించిన అర్చిత హోంగార్డుతో వాగ్వాదానికి దిగింది. తన ఫొటో ఎందుకు తీశావని ఆమె ప్రశ్నించగా.. రాంగ్రూట్లో వెళ్లినందుకు జరిమానా విధించేందుకు ఫొటో తీశానని వెంకటేష్ బదులిచ్చాడు. కెమెరా నుంచి ఫొటో తొలగించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈక్రమంలో అతడితో గొడవకు దిగింది. హోంగార్డు కాలర్ పట్టుకొని చెంప చెల్లుమనిపించింది. అక్కడే ఉన్న కొందరి సమాచారంతో కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
రాంగ్ రూట్లో వెళ్తూ బైక్‌ను ఢీకొన్న టిప్పర్ యువకులు నగరంలో చిరు వ్యాపారులు రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ముగ్గురు యువకుల ప్రాణాలను హరించింది. కంచికచర్లలోని పేరకలపాడుకు చెందిన బండి నాగరాజు, బురదగుంట మధు, దోమ కోటేశ్వరరావు బైక్‌పై వెళ్తుండగా పరిటాల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరు నగరంలోని బీసెంట్‌రోడ్డులో ఫ్యాన్సీ డ్రెస్సుల వ్యాపారం చేస్తుంటారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ముగ్గురు స్నేహితులు చిన్నప్పటి నుంచి అన్యోన్యంగా మెలిగారని, మృత్యువులోనూ వీరి స్నేహబంధం వీడిపోలేదని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కంచికచర్ల : రాంగ్ రూట్లో వెళ్తుతున్న టిప్పర్ బైక్‌ను ఢీకొట్టి ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఈ దుర్ఘటన కంచికచర్ల మండలం, పరిటాల వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామానికి చెందిన బండి నాగరాజు (22), బురదగుంట మధు (30), దోమ కోటేశ్వరరావు (తంబి) (23) విజయవాడ బీసెంట్ రోడ్డులో తోపుడుబండ్లపై చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ యువకులు బుధవారం ఉదయం ఇబ్రహీంపట్నం లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు. బంధువులతో కొంతసేపు ఆనందంగా గడిపి అదే బైక్‌పై తిరిగి ఇంటికి బయలుదేరారు. మండలంలోని పరిటాల సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని బైక్ ఓవర్టేక్ చేసే సమయంలో కంచికచర్ల వైపు నుంచి విజయవాడ వైపు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న దొనబండ పవన్ గ్రానైట్‌కు చెందిన టిప్పర్ బైక్‌ను ఢీకొంది. టిప్పర్ ఆగకుండా కిందపడిన ముగ్గురిపైనుంచి ముందుకు వెళ్లింది తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం తరువాత పరారవుతున్న టిప్పర్ డ్రైవర్‌ను సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు పట్టుకుని పోలీస్‌స్టేష న్లో అప్పగించారు. నందిగామ డీఎస్పీ టి.రాధేష్‌మురళీ, రూరల్ సీఐ వై.సత్యకిషోర్, ఎస్ఐ కె. ఈశ్వరరావు, నందిగామ ఆర్టీవో సురేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృుతదేహాలను పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లి వస్తున్న నాగరాజు, కోటేశ్వరరావు, మధును టిప్పర్ రూపంలో వృుత్యువు కాటేసిందని తెలియడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పోలీస్ అయితే..
రాంగ్రూట్లో వెళ్లి బైక్‌ను ఢీకొట్టిన పోలీస్ వెహికల్ వెంటపడి పట్టుకున్న ప్రజలు - బందరురోడ్డులో ఉద్రిక్తత సాధారణంగా రాంగ్రూట్లో వెళ్లే వాహనదారులను పోలీసులు చేజ్ చేసి పట్టుకుంటారు. ఇక్కడ సీన్ రివర్స అయింది. రాంగ్రూట్లో రావడమే కాకుండా ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టి పలాయనం చిత్తగించిన పోలీస్ వాహనాన్ని ప్రజలే చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. బందరురోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ప్రజలను అడ్డుకోవడంతో వారంతా రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. గాయపడిన కాశీ విశ్వేశ్వరరావును చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లబ్బీపేట : నిబంధనలు ప్రజలకే కానీ తమకేంటని అనుకున్నారో ఏమో కానీ,..రాంగ్ రూట్లో వెళ్తూ..ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టి ...ఆపకుంటూ పరారవుతున్న పోలీస్ వెహికల్‌ను ప్రజలు వెంటాడి పట్టుకున్నారు. ప్రజలు పట్టుకున్న వాహనాన్ని పోలీసు వాహనంగా గుర్తించిన అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు పంపించి వేయడంతో ప్రజల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. వందలాదిగా అక్కడకు చేరుకుని పోలీసులపై తిరగబడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మహాత్మాగాంధీ రోడ్డులోని మాన్య షోరూమ్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన పోలీసు వాహనం బొలోరో (నంబరు ఏపీ 18పి 1064) డ్రైవరు పశువుల ఆస్పత్రి వైపు నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లేందుకు మాన్య షోరూమ్ వద్ద రాంగ్రూట్లో యూ టర్న్ తీసుకునే ప్రయత్నించాడు. అదే సమయంలో మరోవైపు ద్విచక్రవాహనదారులు నిబంధనలకు అనుగుణంగా యూటర్న్ తీసుకుంటుండగా, పోలీసులు వెహికల్ ఒక బైక్‌ను ఢీకొంది. దీంతో అతడి వాహనం వెళ్లి వెనుక వస్తున్న బీఎండబ్ల్యూ కారుపై పడింది. కాగా బైక్‌ను ఢీకొట్టిన పోలీస్ వెహికల్ వెనక్కి వచ్చి బెంజిసర్కిల్ వైపు వెళ్లిపోతుండగా, ప్రజలు వెంబడించి దానిని పట్టుకున్నారు. ఈ ఘటన చూసిన పలువురు పోలీసు వాహనం డ్రైవర్‌పై దాడికి యత్నించడంతో అక్కడ వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ వాహనాన్ని పంపించివేశారు. దీంతో అప్పటికే అక్కడకు చేరుకున్న వందలాది మంది ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడం, పెద్ద సంఖ్యలో యువత అక్కడకు చేరుకోవడంతో పోలీసు వాహనాన్ని పంపించిన కానిస్టేబుల్‌తో పాటు, అక్కడకు చేరుకున్న ఇతర ట్రాఫిక్ పోలీసులు పారిపోయేందుకు సిద్ధమయ్యారు. కాగా బైక్‌పై వస్తూ గాయపడిన కాశీ విశ్వేశ్వరరావును 108లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆపకుండా వెళ్లడంపైనే ఆగ్రహం.. రాంగ్రూట్లో వెళ్లడం, ప్రమాదాలు చేయడం ఎవరికైనా జరుగుతుందని, కానీ బైక్‌ను ఢీకొట్టి గాయాలతో పడివున్న వ్యక్తిని వదిలి పారిపోయే ప్రయత్నం చేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వాహనం అయి ఉండి ఇలా ప్రవర్తించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నచ్చజెప్పిన సీఐలు.. కాగా వందలాది మంది ప్రజలు రోడ్డుపై ఆందోళన చేస్తుండగా, కృష్ణలంక సీఐ ఎస్వీవీఎస్మూర్తి, నాల్గవ ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. ప్రజల నుంచి ఘటన వివరాలను తెలుసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, బైక్పడి దెబ్బతిన్న బీఎండబ్ల్యూ కారు యజమానితో సైతం చర్చించారు. దీంతో సుమారు ఆర్థగంటకు పైగా నెలకొన్న ఉద్రిక్తతకు తెరదించారు. కాగా ప్రమాదానికి కారణమైన వెహికల్ గుంటూరు జిల్లా పోలీసులకు సంబంధించినది కాగా, డ్రైవర్‌ను అరుణ్‌కుమార్‌గా గుర్తించామని తెలిపారు. -
మంత్రిగారూ, ఇది రాంగ్ రూట్!
-
మంత్రిగారూ, ఇది రాంగ్ రూట్!
కేంద్రమంత్రి రామ్కృపాల్ను అడ్డుకున్న మహిళా పోలీసు పట్నా: కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్‌కు దమ్మున్న మహిళా కానిస్టేబుల్ ఒకరు గట్టి షాకిచ్చారు. మంగళవారం పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాంగ్ రూట్లో ఎగ్జిట్ ద్వారం గుండా వెళ్తున్న ఆయనను అక్కడ పని చేసే సీఐఎస్ఎఫ్ మహిళా పోలీసు అడ్డుకున్నారు. ఆయనతో కాసేపు మాట్లాడాక వాకీటాకీలో తనపై అధికారిని సంప్రదించారు. తర్వాత ఆ మార్గం గుండా లోనికి వెళ్లకూడదని స్పష్టం చేశారు. దీంతో మంత్రి తన పొరపాటు అంగీకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. వీఐపీలు తమ హోదాను ఇలా దుర్వినియోగపరచడం సరైందేనా అని ఓ విలేకరి అడగ్గా, తనది పొరపాటేనని రామ్‌కృపాల్ అంగీకరించారు. మహిళా కానిస్టేబుల్ తనను ఆపి, ప్రవేశ మార్గం వద్దకు వెళ్లాలని చెప్పడంతో అలాగే వెళ్లానని చెప్పారు. తాను ఆమెతో వాదించలేదని, ఆమె తన విధిని చక్కగా నిర్వహించారని కొనియాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి పట్నా వస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు ఆహ్వానం పలకడానికి రామ్‌కృపాల్ విమానాశ్రయానికి వెళ్లారు. -
రూలంటే రూలే!
రాంగ్రూట్లో కారొస్తోంది. ట్రాఫిక్ సీఐ వాహనాన్ని ఆపారు. మిర్రర్ కిందకు దిగింది. కారు నడుపుతున్న వ్యక్తి ‘నేను మంత్రి తాలూకా. కావాలంటే ఫోన్ కలుపుతా...మాట్లాడతా’ అన్నాడు. సీఐ అదరలేదు...బెదరలేదు... మొహమాటపడలేదు. మౌనంగా చేయాల్సింది చేసేశారు. ఫైన్ రాసి బిల్లు చేతిలో పెట్టేశారు. కారు నడిపిన వ్యక్తి మాట్లాడకుండా కట్టేశాడు. ఆ తర్వాత మరో కారొచ్చింది. ‘హోం మంత్రి తాలూకా’ అన్నాడు... మళ్లీ అదే దృశ్యం. సీఐ ఫైను రాశారు... నిబంధనలు పాటించకపోతే ఎవరైనా ఒకటేనని గోపాలపట్నం ట్రాఫిక్ సీఐ మళ్ల మహేష్ రుజువు చేశారు. బంక్ జంక్షన్లో రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న వాహనాలపై నిర్మొహమాటంగా ఫైన్ విధించారు. ⇒ రాంగ్రూట్లో దూసుకొచ్చిన వీఐపీలు ⇒ అడ్డుకున్న ట్రాఫిక్ సీఐ మళ్ల మహేష్ ⇒ మంత్రులు తెలుసంటూ వాగ్వాదం ⇒ పట్టించుకోని సీఐ...ఫైన్ వసూలు గోపాలపట్నం: ఆదివారం ఉదయం... బంకు జంక్షన్లో ట్రాఫిక్ రద్దీగా ఉంది. గోపాలపట్నం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ల మహేష్ పోలీసు సిబ్బందితో ట్రాఫిక్‌ను చక్కదిద్దే పని మొదలు పెట్టారు. రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకులు, డ్రయివింగ్ పత్రాలు లేకుండా నడుపుతున్న వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బస్ కారిడార్ నుంచి బడాబాబులు దూసుకొస్తుండటాన్ని అంతా గమనించారు. నిషేధిత మార్గంలో వస్తున్న వాహనాలపై సీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా గమనించారు. బస్సులు రాకపోకలు సాగించే మార్గంలో ఇతర వాహనాలు రావడంపై సీఐ అభ్యంతరం చెప్పారు. తొలుత నేవీ చీఫ్ ఇంజనీరు వాహనం, తర్వాత నేవీ అధికారి వాహనం ఒకదాని వెనుక వచ్చాయి. ఈ వాహనాలను ఆపి రూ.300 చొప్పున జరిమానా విధించారు. ఆ తర్వాత దూసుకొచ్చిన మరో కారును సీఐ ఆపారు. దీంతో కారు యజమాని బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. తాను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి తాలూకా అని... కావాలంటే ఫోన్ కలుపుతా... మాట్లాడండని కారులోంచి దిగకుండా చెప్పినా సీఐ మొహమాటం లేకుండా ఫైన్ విధించారు. ‘నిజానికి మంత్రుల కుటుంబీకులు తప్పు చేయరని...వారు ఏనాడూ తప్పు చేసేవారిని సమర్ధించబోరని’ కారు యజమానితో సీఐ అన్నారు. ఇక్కడ ఫైన్ కడితే తప్ప వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేయడంతో కారు యజమానితో పాటు మరో మహిళ చెల్లించి కదిలారు. దాని వెనుక దూసుకొచ్చిన మరో కారునీ సీఐ అడ్డుకున్నారు. తాను హోం మంత్రి తాలూకా అంటూ చెప్పబోయాడా యజమాని. అయినా ఫైన్ కట్టాల్సిందేనని సీఐ ఫైన్ రాసి పంపించారు. ఇక ఇదే దారిన రాంగ్ రూట్లో వచ్చిన గోపాలపట్నానికి చెందిన మరో కానిస్టేబుల్‌కి కూడా ఫైన్ రాశారు. ఇలా ఎవరు అధికారం చెలాయించినా వెనక్కి తగ్గకుండా నిబంధనల్ని గుర్తు చేసిన సీఐని అంతా అభినందించారు. -
రాంగ్ రూట్! - part 2
-
రాంగ్ రూట్! - part 1
-
రాంగ్‌రూటే ప్రాణాలు మింగింది
వేములపల్లి, న్యూస్‌లైన్ : వేములపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి రాంగ్‌రూటే ప్రధానకారణమని తేలింది. డీసీఎం డ్రైవర్ రోడ్డు మారాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా అదే రూట్లో రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని బుగ్గబాయిగూడెం సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో వన్‌వేలో వాహనాలు వెళుతున్నా యి. కాగా గ్రామం చివరన మిర్యాగూడకు వెళుతుండగా తిరిగి రెండు మార్గాలలో ప్రయాణించాల్సి ఉంది. కాగా డీసీఎం డ్రైవర్ వన్‌వే వచ్చిన తరువాత తిరిగి ఎడమకు మళ్లకుండా వన్‌వేలోనే ప్రయాణించడంతో ప్రమాదం జరిగింది. దీంతో పాటు అంబులెన్స్ మరో వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు రెండు కిలోమీటర్ల వరకు మళ్లీ రోడ్డు మళ్లింపు లేకపోవడంతో డీసీఎం వాహనాలకు ఎదురుగా వచ్చి అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. మృతులంతా బంధువులే.. వేములపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన, గాయాలపాలైన వారు అందరూ బంధువులు. నిడమనూరు మం డలం గుంటిపల్లికి చెందిన నల్లగంతుల చిన్నసైదమ్మకు మూత్రపిం డాల వ్యాధి ఉడడంతో మిర్యాల గూడ నుంచి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకె ళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. దీంతో సైదమ్మతో పాటు డీసీఎంలో వెళుతున్న ముగ్గురు బంధువులు అంబులెన్స్ డ్రైవర్ మృతిచెందారు. వారిలో గుంటిపల్లికి చెందిన నల్లగంతు చిన్న సైదమ్మ(50), నల్లగంతుల శ్రీను(35), మిర్యాలగూడ మండ లం యాదగిరిపల్లికి చెందిన పగిళ్ల ఉపేందర్(35), త్రిపురారానికి చెందిన అనుముల లక్ష్మీ(30), డ్రైవర్ నామ శేఖర్(35) ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు.. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చిన్న సైదమ్మకు అనుముల లక్ష్మి స్వయాన కూతురు. పగిళ్ల ఉపేందర్ సైదమ్మకు అల్లుడు(సైదమ్మ మరో కూతురు భర్త). దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో పాటు నల్లగంతుల పెద్ద సైదమ్మ మృతిరాలు చిన్న సైదమ్మకు అక్క(యారాలు), నల్లగంతుల శ్రీను, పెద్ద సైదమ్మకు కుమారుడు. చిక్సిత పొందుతున్న అనుముల నాగయ్య మృతురాలు లక్ష్మి భర్త. వీరంతా బంధువులే కావడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో రోదనలు మిన్నంటాయి.